E-Paper
Advertisement

లా స్టూడెంట్ అమృత హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్!

లా స్టూడెంట్ అమృత హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్!
Advertisement

Bengaluru Knife Attack: అక్కడ ఏం జరుగుతుంది. ఓ అమ్మాయిపై ఓ కిరాతకుడు కత్తితో దాడి చేస్తున్నాడు. అడ్డొచ్చిన వ్యక్తిపై కూడా అటాక్ చేశాడు. ఇంతకు వాడు ఎవడు.. ఇదీ ఎక్కడ జరిగింది. ఎప్పుడు జరిగింది. ఈ విజువల్స్ ఇప్పడిది కాదు.. కానీ ఈ మధ్యే బయటకు వచ్చింది. బెంగళూరులోని కోడిహళ్లి రోడ్డుపై సరిగ్గా ఈ ఏడాది జులై 13న సాయంత్రం నాలుగున్నరకు లా స్టూడెంట్‌ అమృత నడుచుకుంటూ వెళ్తుంది. ఇంతలో ఒకడు పరుగెత్తుకుంటూ వచ్చి కత్తితో దారుణంగా నరికేశాడు.

నడిరోడ్డుపై రాక్షసత్వం!

Advertisement

ఇంతకీ ఈ అమ్మాయిని నడిరోడ్డుపై ఎందుకంత కసిగా నరికేశాడు. అదే కదా మీ డౌట్. లా చదువుతూనే ఓ పిజ్జా ఔట్‌లెట్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తోంది ఈ 22 ఏళ్ల అమృత. ఓ మీటింగ్‌లో ధనుష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం లవ్‌గా అప్‌డేట్‌ అవ్వడానికి పెద్దగా టైమ్‌ పట్టలేదు. అయితే, అసలు సినిమా అక్కడే మొదలైంది. ధనుష్‌కు ఆల్రెడీ పెళ్లై పాప కూడా ఉంది. కాకపోతే డివర్స్ అయ్యాయి. ఈ నిజాన్ని దాచిపెట్టి అమృతతో లవ్‌ట్రాక్ నడిపిస్తున్నాడు. ధనుష్ గాడి దరిద్రమైన హిస్టరీ తెలుసుకున్న అమృత షాక్ అయ్యింది. తనదగ్గర నిజం దాచి మోసం చేశాడనే అసహ్యంతో అమృత ఆ వెధవకు, వాడి లవ్‌కు గుడ్‌బై చెప్పేసింది.

మోసగాడికి గుడ్‌బై చెప్పిందని..

Advertisement

కానీ, ఆ మోసగాడికి అస్సలు మింగుడు పడలేదు. ఇంతలో ధనుష్ తమ్ముడు సూర్యగాడు ఎంటరయ్యాడు. మా అన్నే వదిలేస్తావా అంటూ కోపంతో రగిలిపోయాడు. జూలై 13న అమృత డ్యూటీకి వెళ్తుండగా.. దారికాచి వెనుక నుంచి ఎటాక్ చేశాడు ఆ సైకో. కత్తితో ఛాతీపై, వీపుపై విచక్షణారంగా నరికేశాడు. అడ్డుబోయిన ఓ వ్యక్తిపై కూడా ఆ కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు.

చావు బతుకుల మధ్య 48 గంటలు పోరాటం..

రక్తపు మడుగులో పడిఉన్న అమృతను స్థానికులు హుటాహుటిన ఆటోలో హాస్పిటల్‌కు తరలించారు. చావు బతుకుల మధ్య 48 గంటలకు పైగా పోరాడిన ఆ లా స్టూడెంట్.. జూలై 15న తుదిశ్వాస విడిచింది. జీవన్ భీమా నగర్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. ఇద్దరు అన్నదమ్ములను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అయితే ఈ సీసీ ఫుటేజ్ ఇప్పుడు బయటకు రావడంతో అయ్యో అమృత అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: అటెండర్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం.. ఇద్దరు కేటుగాళ్ల అరెస్ట్!

Tags

Related News

నందిగామ్ బైపోల్లో బిగ్ ట్విస్ట్.. మమత మద్దతు ఇచ్చిన గంటల వ్యవధిలో.. కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్!

హనీమూన్‌లో దంపతుల మధ్య మంటలు.. నవ వధువుకి తీవ్రగాయాలు, డార్జిలింగ్‌లో ఘటన

స్టేట్ బ్యాంక్‌లో ఉద్యోగ ఖాళీలు.. గ్రూప్ CISO జాబ్స్.. రూ.2.5 కోట్ల వరకు సాలరీ

31 ఏళ్ల క్రితం రూ.100 లంచం తీసుకున్న ఉద్యోగికి ఇప్పుడు జైలు శిక్ష.. కోర్టు విచిత్ర తీర్పు

76వ పుట్టినరోజు వేళ.. మోదీపై జార్జియా మెలోని ఆసక్తికర పోస్ట్.. ఇంతకీ ఏమన్నారంటే?

వినూత్న నిరసన.. అధికారి టేబుల్‌పై వీధి కుక్క.. 8 రోజుల డెడ్ లైన్!

సినిమాలో మాదిరిగా బెంగుళూరులో సన్నివేశం.. ప్రేమ వివాహంలో చర్చ, ఆ తర్వాత ఏం చేశారంటే..

Big Stories

Advertisement
×