Honeymoon couple: ఆ దంపతుల హనీమూన్‌లో విషాదంగా మారింది. హనీమూన్ కోసం హోమ్ స్టేలో ఎంచుకున్నారు ఆ దంపతులు. వెలిగించిన ఫైర్‌లో ఏదో ద్రవాన్ని పోయడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.ఫలితంగా నవ వధువును మంటలు చుట్టుముట్టడంతో తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన డార్జిలింగ్‌లో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాకు చెందిన నికితా-సౌవిక్‌లకు ఇటీవల వివాహం జరిగింది. ఈ జంటకు పెళ్లై కేవలం రెండు నెలల అయ్యింది. ఈ జంట తమ హనీమూన్ కోసం డార్జిలింగ్ ప్రాంతాన్ని ఎంచుకుంది. సెప్టెంబర్ 13న సిట్టాంగ్‌కు ప్రయాణించి ఆ కొండ ప్రాంతంలోని ఒక హోమ్‌స్టేలో బస చేసింది.
DARJEELING HONEYMOON TURNS INTO NIGHTMARE!
A honeymoon trip to Sitong, Kurseong, reportedly turned horrific after a barbecue fire spread across a homestay balcony, leaving Nikita Chopra severely burnt. pic.twitter.com/3V7GvdcMO1
— Ghar Ke Kalesh (@gharkekalesh) September 18, 2026