Tanuja Trolling:తనూజ పుట్టస్వామి..ముద్దమందారం,అగ్ని పరీక్ష వంటి సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులని అలరించిన ఈ కన్నడ భామ ఇపుడు ‘హత:’ అనే సినిమాతో వెండితెరని పలకరించడానికి సిద్దమైంది.యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో తనూజ కీలక పాత్రలో కనిపించనుంది.ఇక ఈ సినిమా నవంబర్ 6న రిలీజ్ కానున్న సందర్భంగా ప్రమోషన్స్ లో వేగం పెంచింది మూవీ టీమ్.
ఈ క్రమంలో తాజాగా మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించగా పాల్గొన్న తనూజ పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా తనపై జరుగుతున్న ట్రోలింగ్ కి తనదైన శైలిలో రియాక్ట్ అయ్యింది.
ట్రోలింగ్ కొనసాగుతుండటంపై రియాక్ట్
బిగ్‌బాస్ ముగిసిన తర్వాత కూడా తనూజపై ట్రోలింగ్ కొనసాగుతుండటంపై ఆమెను ప్రశ్నించగా.. తనూజ తన స్టైల్లో స్పందించింది.తను ఈ సినిమాని బిగ్ బాస్ లోకి పోకముందే చేశానని తెలిపింది.
ప్రస్తుతం తనకు చాలా సినిమాల నుంచి అవకాశాలు వస్తున్నాయని తెలిపింది. అయితే తనకు ఇంత పారితోషికం కావాలి, అంత పారితోషికం కావాలి అని తాను పట్టుబట్టే రకం కాదని చెప్పింది. కథ నచ్చిందా? ఆ పాత్రను తాను బాగా చేయగలనా? అనే విషయాలనే ముందుగా చూస్తానని తెలిపింది.
అభిమానుల ప్రేమతో మళ్ళీ
సినిమా ఇండస్ట్రీలో ఉండటం తనకు దక్కిన అదృష్టమని తనూజ చెప్పింది. తనను ఇష్టపడే ఆడియన్స్, ఫ్యాన్స్ కూడా తన అదృష్టమేనని పేర్కొంది. మూడేళ్ల క్రితం సినిమాలు చాలు.. ఇక ఇక్కడితో ఆపేద్దామని అనుకున్నానని కూడా చెప్పింది. కానీ ఎక్కడికి వెళ్లినా ‘తనూజ వచ్చిందా? తనూజ కనిపిస్తోందా?’ అంటూ ప్రేక్షకులు చూపించే ప్రేమను చూసి సినిమాలు వదిలేయలేకపోయానని చెప్పింది.
తన జీవితంలో జరుగుతున్న చాలా విషయాలు ముందుగా ప్లాన్ చేసుకున్నవి కాదని.. అవన్నీ తన అదృష్టంగానే భావిస్తానని తనూజ చెప్పింది.
నెగిటివ్ కామెంట్స్ వస్తే
ఇక ట్రోలింగ్ విషయానికి వస్తే.. గతంలో బ్యాడ్ కామెంట్ కనిపిస్తే దాన్ని చాలా సీరియస్‌గా తీసుకునేదానినని తనూజ తెలిపింది. ఆ కామెంట్ గురించి పదేపదే ఆలోచిస్తూ బాధపడేదానినని చెప్పింది. కానీ ఇప్పుడు తన మైండ్‌సెట్ పూర్తిగా మారిపోయిందట. నెగిటివ్ కామెంట్స్ చూసి బాధపడటం కంటే వాటిని చూసి నవ్వుకుంటున్నానని చెప్పింది.
‘ఇలా కూడా చేస్తారా? ఇంత ఖాళీగా ఉన్నారా?’ అని అనిపిస్తోందని తనూజ చెప్పింది. కొన్నిసార్లు ట్రోల్స్ చేసే వాళ్లను చూసి తనకే నవ్వొస్తోందని తెలిపింది. వాళ్లు ఎంటర్‌టైన్ అవుతున్నప్పుడు తాను కూడా ఎంటర్‌టైన్ అవుతున్నానని చెప్పినట్టుగా ఆమె కామెంట్స్ ఉన్నాయి.
నవంబర్ 6న రానున్న హత:
అయితే తనూజ విషయంలో ఒక విషయం మాత్రం చాలా సీరియస్. తన గురించి ఎవరైనా ఏదైనా అంటే పెద్దగా పట్టించుకోనని చెబుతున్న ఆమె.. తనకు అండగా నిలిచే వాళ్లను ఎవరైనా టార్గెట్ చేస్తే మాత్రం తట్టుకోలేనని స్పష్టం చేసింది.
మొత్తానికి బిగ్‌బాస్ తర్వాత తనూజ క్రేజ్ పెరగడంతో పాటు ట్రోలింగ్ కూడా అదే స్థాయిలో ఎదురవుతోంది. అయితే గతంలోలా ప్రతి కామెంట్‌ను మనసుకు తీసుకోకుండా ఇప్పుడు వాటిని లైట్‌గా తీసుకుంటున్నానని ఆమె చెప్పడం ఆసక్తికరం.
ALSO READ:వరుణ్ తేజ్-లావణ్య ఇటలీ ట్రిప్.. వాయువ్ తేజ్ క్యూట్ మూమెంట్స్ అదుర్స్!
చూడాలి మరి నవంబర్ 6న రానున్న హత:’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని రాబడతాడో !