IIT Bombay Student: మహారాష్ట్రలోని ప్రతిష్టాత్మక ఐఐటీ బొంబాయి (పవాయ్ క్యాంపస్)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం సెకండ్ ఇయర్ విద్యార్థి తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరీక్ష సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ దొరికిపోవడమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. గడిచిన ఆరు నుంచి ఏడు నెలల వ్యవధిలోనే ఇదే క్యాంపస్‌లో మూడో ఆత్మహత్య జరగడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.
మృతుడిని ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన రెండో సంవత్సరం విద్యార్థి సాహిల్ వాకోడేగా గుర్తించారు. పరీక్ష జరుగుతున్న సమయంలో ప్రశ్నాపత్రాన్ని చాట్‌జీపీటీ (ChatGPT)లో అప్‌లోడ్ చేసి సమాధానాలు వెతికేందుకు ప్రయత్నిస్తుండగా పరిశీలకులు అతడిని పట్టుకున్నారు. అయితే దీనిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదని సంబంధిత అధికారులు తెలిపారు. సంబంధిత ఇన్స్ట్రక్టర్, విభాగాధిపతి (HoD) విద్యార్థితో మాట్లాడి కౌన్సెలింగ్ ఇచ్చారన్నారు. ఈ ఘటన అతడి భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపదని కూడా హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఈ వరుస పరిణామాల అనంతరం హాస్టల్ గదికి వెళ్లిన సాహిల్.. సాయంత్రానికి శవమై కనిపించాడు.
విద్యార్థి మృతి పట్ల ఐఐటీ బొంబాయి యజమాన్యం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ విషాదకర సంఘటనతో ప్రభావితమైన విద్యార్థి స్నేహితులు, తోటి విద్యార్థులు, అధ్యాపకులకు అండగా ఉండనున్నట్లు వెల్లడించింది. మృతికి గల కారణాలపై సంబంధిత అధికారులు విచారణ జరుపుతున్నారని ఒక ప్రకటనలో తెలిపింది.
మరోవైపు సాహిల్ మరణవార్త వెలుగులోకి రావడంతో ఐఐటీ పవాయ్ క్యాంపస్‌లో విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. ఘటనకు సంబంధించిన పూర్తి నిజాలను యాజమాన్యం దాస్తోందని వారు ఆరోపించారు. కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థిని ఏడాది పాటు సస్పెండ్ చేస్తామని బెదిరించారని అదే జరిగితే అతడు హాస్టల్ ఖాళీ చేసి బయట ఉండాల్సి వచ్చేదని విద్యార్థులు పేర్కొన్నారు.
దీనికితోడు నాలుగు సంవత్సరాల కోర్సు కాస్త ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం సాగుతుందనే భయం, తీవ్ర ఒత్తిడి వల్లే సాహిల్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనపై విద్యాసంస్థ యాజమాన్యం పారదర్శకతతో వ్యవహరించి పూర్తి బాధ్యత వహించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
FOUND WITH PHONE IN EXAM HALL. IIT BOMBAY STUDENT ENDS LIFE. PROTESTS ROCK CAMPUS.
A second-year IIT Bombay student died by suicide on Friday, hours after he was found using a mobile phone during an examination. According to an official statement from the institute, the student… pic.twitter.com/OVwqJ0P3hC— Rahul Shivshankar (@RShivshankar) September 19, 2026
Also Read: ఐస్ క్రీమ్ రంగంలోకి రిలయన్స్.. అమూల్ పని అయిపోయినట్లేనా? అంబానీ అసలు వ్యూహం ఏంటి?
క్యాంపస్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఆందోళనకారులతో, ఐఐటీ యాజమాన్యంతో పోలీసులు చర్చలు జరిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి దత్తాత్రేయ నలావడే తెలిపారు.
Also Read: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య.. నెట్టింట ఇంటర్వ్యూ క్లిప్ వైరల్.. యాంకరే హత్యకు పురిగొల్పిందా?