E-Paper
Advertisement

48MP కెమెరా, A19 చిప్‌ కలిగిన iPhone 17eపై భారీ తగ్గింపు.. ఈ డీల్ మిస్ కావద్దు మామా!

48MP కెమెరా, A19 చిప్‌ కలిగిన iPhone 17eపై భారీ తగ్గింపు.. ఈ డీల్ మిస్ కావద్దు మామా!
Advertisement

iPhone 17e Price Drop: యాపిల్ నుంచి లేటెస్ట్ iPhone 18 Pro మోడల్స్ మార్కెట్లోకి వస్తున్న తరుణంలో.. పాత మోడల్ అయిన iPhone 17eపై అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో చాలా తక్కువ ధరకే లభిస్తోంది. ప్రస్తుతం దీని అధికారిక ధర రూ.79,900 ఉండగా.. ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రం ఇది కేవలం రూ.64,990 ధరకే లిస్ట్ అయి ఉంది. దీనివల్ల నేరుగా రూ.15,000 వరకు ఆదా చేసుకునే అద్భుతమైన అవకాశం వినియోగదారులకు దక్కుతోంది.

48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా..

యాపిల్ ఈ ఫోన్‌ను మొదట్లో మార్కెట్లోకి తెచ్చినప్పుడు తక్కువ ధరకే లాంచ్ చేసింది. ఆ తర్వాత దీని అధికారిక ధరను రూ.79,900కి పెంచారు. అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రం ఇంకా పాత ధరకే ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఇదే సమయంలో ఐఫోన్ 18 ప్రో సిరీస్ సేల్‌కు వస్తుండటంతో.. కంపెనీ స్టాక్ క్లియర్ చేసుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఇందులో పవర్‌ఫుల్ ఏ19 చిప్‌సెట్, యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్, 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా ఉన్నాయి. అలాగే 256 జీబీ, 512 జీబీ వేరియంట్లలో ఇది లభిస్తోంది.

Advertisement

Also Read: స్పామ్ కాల్స్, రోబో కాల్స్‌కు చెక్ పెట్టేలా TRAI మాస్టర్ ప్లాన్.. ఇకపై ఆ తప్పు చేస్తే అంతే సంగతులు!

బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్:

iPhone 17eను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. మీ దగ్గర ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే.. అదనంగా రూ.3,245 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఈ ఫోన్ ధర రూ.62,000 లోపునకు వస్తుంది. ఇవే కాకుండా మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. మీ పాత ఫోన్ కండిషన్‌ను బట్టి గరిష్టంగా రూ.49,650 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ లభించే ఛాన్స్ ఉంది. అయితే ఈ ఎక్స్ఛేంజ్ ధర అనేది మీ ఫోన్ మోడల్, దాని పరిస్థితిని బట్టి మారుతుంటుంది.

కొనేముందు చేయాల్సివని:

Advertisement

ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ అందరికీ ఒకేలా వర్తిస్తుందని చెప్పలేం. ఎందుకంటే.. లిమిటెడ్ స్టాక్ మాత్రమే అందుబాటులో ఉంది. అలాగే మీరు ఉండే ప్రాంతాన్ని బట్టి డెలివరీ లభ్యత మారుతుంటుంది. ఆర్డర్ చేసే ముందు మీ ఏరియాలో స్టాక్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. తక్కువ బడ్జెట్‌లో మంచి యాపిల్ ఫోన్ తీసుకోవాలనుకునే వారికి ప్రస్తుతం ఇది మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. త్వరపడితేనే ఈ తక్కువ ధర ఆఫర్ మీ సొంతం అవుతుంది.

Also Read: PhonePe లేదా Google Payలో తప్పు నంబర్‌కు డబ్బు పంపారా? ఇలా చేస్తే తిరిగి పొందొచ్చు!

Tags

Related News

రూ.1,004కే 750W పవర్‌ఫుల్ మిక్సర్ గ్రైండర్..ఈ ఆఫర్ అస్సలు మిస్ కావద్దు!

పెన్,బ్లూటూత్ కీబోర్డ్ ఫ్రీ! రూ.42,999కే ట్రెండింగ్ ఆండ్రాయిడ్ ట్యాబ్

కాల్స్, మ్యూజిక్, హెల్త్ ట్రాకింగ్ అన్నీ ఈ ఒక్క ఉంగరంతోనే.. Rogbid ZenRing ప్రత్యేకతలు ఇవే!

బడ్జెట్‌లో అదిరిపోయే సౌండ్ క్వాలిటీ కావాలా? ఈ ఇయర్ బడ్స్‌ ట్రై చేయండి!

స్పామ్ కాల్స్, రోబో కాల్స్‌కు చెక్ పెట్టేలా TRAI మాస్టర్ ప్లాన్.. ఇకపై ఆ తప్పు చేస్తే అంతే సంగతులు!

చేయి ఊపితే చాలు ఆన్ అయిపోయే చిమ్నీలు! ఇండియన్ కిచెన్స్‌కు ఇవి పర్ఫెక్ట్!

రూ.36,000 లోపు ఏఐ టెక్నాలజీతో సూపర్ ల్యాప్‌టాప్ లాంచ్.. ఫీచర్స్ అదిరిపోయాయ్!

Big Stories

Advertisement
×