E-Paper
Advertisement

భార్యకు మస్కా కొట్టి.. ప్రేయసితో మలేషియా ట్రిప్ ప్లాన్.. తీరా ఎయిర్‌పోర్టులో ఊహించని ట్విస్ట్!

భార్యకు మస్కా కొట్టి.. ప్రేయసితో మలేషియా ట్రిప్ ప్లాన్.. తీరా ఎయిర్‌పోర్టులో ఊహించని ట్విస్ట్!
Advertisement

Malaysia Trip Twist: వివాహేతర సంబంధాలు, వాటిని దాచడానికి ఆడే నాటకాలు ఒక్కోసారి ఎంతటి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. బిజినెస్ ట్రిప్ అని భార్యకు అబద్ధం చెప్పి ప్రేయసితో కలిసి విదేశీ విహారయాత్రకు వెళ్లాలనుకున్న ఒక పుణే వ్యాపారి కథ చివరకు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఎయిర్‌పోర్టులో ఎదురైన ఒక చిన్న సాంకేతిక సమస్య అతని గుట్టు రట్టు చేయడమే కాకుండా.. కటకటాల పాలుజేసింది.

అసలేం జరిగింది?

పుణేకు చెందిన 46 ఏళ్ల ఒక వ్యాపారవేత్త వ్యాపార పనిమీద మలేషియా రాజధాని కౌలాలంపూర్ వెళ్తున్నానని తన భార్యకు చెప్పాడు. నిజానికి అతను తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి సరదాగా ట్రిప్‌కు ప్లాన్ చేసుకున్నాడు. ప్లాన్ ప్రకారం ఇద్దరూ కలిసి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే ఇమిగ్రేషన్ చెకింగ్ సమయంలో సదరు మహిళ గతంలో పోగొట్టుకున్నట్లు డిక్లేర్ చేసిన పాత పాస్‌పోర్ట్‌ను వాడినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆమెను విమానాశ్రయ అధికారులు అక్కడే నిలిపివేశారు.

భార్యను నమ్మించడానికి డ్రామా

Advertisement

మహిళా మిత్రురాలికి ఇమిగ్రేషన్ సమస్య ఎదురై చట్టపరమైన చిక్కులు రావడంతో వ్యాపారి తన పర్యటనను రద్దు చేసుకున్నాడు. అయితే ఈ విషయం తెలిస్తే తన వివాహేతర బంధం ఎక్కడ భార్యకు తెలిసిపోతుందోనని అతను తీవ్ర భయానికి గురయ్యాడు. వెంటనే ఒక నాటకానికి తెరతీశాడు. విమానాశ్రయంలోని ఒక ల్యాండ్‌లైన్ ఫోన్ నుంచి భార్యకు ఫోన్ చేసి, ఇమిగ్రేషన్ సమస్యల వల్ల అధికారులు తన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారని అబద్ధం చెప్పాడు. అనంతరం తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఆ మహిళతో కలిసి ముంబైలోని సీఎస్ఎంటీ రైల్వే స్టేషన్‌కు వెళ్లిపోయాడు.

కిడ్నాప్ కేసు నమోదు

మరుసటి రోజు వ్యాపారి తన భార్యకు వాట్సాప్ వీడియో కాల్ చేసి అదే కథను మళ్లీ నమ్మించే ప్రయత్నం చేశాడు. ఇమిగ్రేషన్ అధికారులు తనను ఎక్కడికి తీసుకెళ్లారో అర్థం కావడం లేదన్నారు. దీంతో ఆందోళన చెందిన భార్య పోలీసులను ఆశ్రయించింది. తన భర్త ఏదో ముప్పులో ఉన్నాడని ఎవరో కిడ్నాప్ చేశారని అనుమానిస్తూ సహార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.

నిజం ఒప్పుకున్న వ్యాపారి

Advertisement

తనపై కిడ్నాప్ కేసు నమోదైనట్లు తెలుసుకున్న వ్యాపారి, ఇక చేసేదేమీ లేక రాత్రికి రాత్రే సహార్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. విచారణలో తన భార్యకు నిజం తెలియకుండా ఉండేందుకే ఇమిగ్రేషన్ సమస్య అని నాటకమాడానని, తన ప్రియురాలితో కలిసి వెళ్లేందుకే ఈ ప్లాన్ వేశానని పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.

Also Read: బిగ్ టీవీ ఇంపాక్ట్.. గుంతల వ్యవహారంలో సర్కార్ యాక్షన్.. మెట్రోకు నోటీసులు జారీ!

పోలీసులు ఏమన్నారంటే?

ఈ వ్యవహారంపై సహార్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. భార్య అవగాహనలేమి వల్ల ఈ కేసు నమోదైందని తెలిపారు. కేసులో ఎలాంటి నేరపూరిత కుట్ర లేనందున త్వరలోనే కోర్టులో క్లోజర్ రిపోర్టును సమర్పించనున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే భార్య, భర్తలు ఇద్దరు పోలీసులకు క్షమాపణ చెప్పి ఇంటికి వెళ్లిపోయారు. అయితే గర్ల్ ఫ్రెండ్ వ్యవహారం భార్యకు తెలిసిందా? లేదా? అన్నదానిపై క్లారిటీ లేదు.

Also Read: చిన్న వయసులోనే పేరు, గుర్తింపు పొందుతారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి అతిత్వరగా విజయాలు సాధిస్తారు

Tags

Related News

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. జలపాతంలోకి దూసుకెళ్లిన కారు, 8 మంది మృతి

దీదీకి దెబ్బ మీద దెబ్బ.. నందిగ్రామ్ తర్వాత రెజీనగర్‌లోనూ షాక్!

ఢిల్లీలో గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ సమిట్.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!

ఐఐటీ బొంబాయిలో తీవ్ర విషాదం.. చాట్‌జీపీటీ కాపీయింగ్ రచ్చ.. విద్యార్థి ఆత్మహత్య!

లా స్టూడెంట్ అమృత హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్!

నందిగామ్ బైపోల్లో బిగ్ ట్విస్ట్.. మమత మద్దతు ఇచ్చిన గంటల వ్యవధిలో.. కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్!

హనీమూన్‌లో దంపతుల మధ్య మంటలు.. నవ వధువుకి తీవ్రగాయాలు, డార్జిలింగ్‌లో ఘటన

Big Stories

Advertisement
×