E-Paper
Advertisement

Chennai: ఒక్క ఓటుతో గెలుపు ఎమ్మెల్యే.. హైకోర్టు కీలక ఆదేశాలు, బలపరీక్షకు టీవీకే ఎమ్మెల్యే దూరం

Chennai: ఒక్క ఓటుతో గెలుపు ఎమ్మెల్యే.. హైకోర్టు కీలక ఆదేశాలు, బలపరీక్షకు టీవీకే ఎమ్మెల్యే దూరం
Advertisement

Chennai: తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పడినా రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమవుతోంది అధికార టీవీకే పార్టీ. తాజాగా హైకోర్టు ఆదేశాలతో టీవీకే పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి బలపరీక్షకు దూరంగా ఉండనున్నారు. దీంతో విజయ్ పార్టీకి ఒక్క ఓటు తగ్గనుంది.

టీవీకే ప్రభుత్వ బల పరీక్షకు మరొక ఎమ్మెల్యే దూరం

Advertisement

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి చేతిలో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయాడు డీఎంకె మాజీ డీఎంకే మంత్రి కేఆర్ పెరియకరుప్పన్. ఈ వ్యవహారంపై ఆయన హైకోర్టు తలుపు తట్టారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఇద్దరు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది.

తాను పోటీ చేసిన శివగంగ జిల్లాలోని తిరుపత్తూరు నియోజకవర్గానికి చెందిన ఒక పోస్టల్ బ్యాలెట్‌ను పొరపాటున తిరుపత్తూరు జిల్లాకు పంపారని అందులో పేర్కొన్నారు. ఆ బ్యాలెట్ ఏ నియోజకవర్గానికి చెందినదో ఆ ప్రాంతానికి పంపకుండా తిరుపత్తూరు రిటర్నింగ్ అధికారి దానిని తిరస్కరించారని వివరించారు.

Advertisement

ఒక్క ఓటుతో గెలుపు ఎమ్మెల్యే వ్యవహారం.. మద్రాసు హైకోర్టు కీలక ఆదేశాలు

ఈ నేపథ్యంలో శ్రీనివాస సేతుపతి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకుండా నిరోధిస్తూ మధ్యంతర ఉత్తర్వు జారీ చేయాలని కోర్టును కోరారు.  దీనిపై వాదోపవాదనలు విన్న న్యాయస్థానం, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు అసెంబ్లీ కార్యకలాపాలు, బలపరీక్ష ఓటింగ్‌లో సేతుపతి దూరంగా ఉండాలని ఆదేశించింది.

ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఒక నియోజకవర్గం నుండి మరొక నియోజకవర్గానికి బ్యాలెట్‌ను బదిలీ చేయడానికి ఈసీకి అనుమతి ఉండదని సమాచారం. ఫలితాలు వెలువడిన నుంచి కమిషన్ పదవిలో ఉండదని ఈసీ వాదించినట్టు తెలుస్తోంది. ఎన్నికల పిటిషన్ ద్వారా ఉపశమనం కోరవచ్చని, ఆ గడువు ముగిసిన తర్వాత ఎలాంటి ఉపశమనం కల్పించలేమని చెప్పినట్టు సమాచారం.

ALSO READ: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్.. మీ పాన్ కార్డులో ఆ వివరాలు ఉంటే ఇక సబ్సిడీ రానట్టే!  

 

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×