BigTV English

Girl Harassed By Boyfriend: ఆస్తి కోసం ఇంత దారుణమా..? బెల్టుతో కొట్టి.. నోటిలో ఫెవిక్విక్ పోసి, గాయాలపై కారం చల్లి..

Girl Harassed By Boyfriend: ఆస్తి కోసం ఇంత దారుణమా..? బెల్టుతో కొట్టి.. నోటిలో ఫెవిక్విక్ పోసి, గాయాలపై కారం చల్లి..

Woman Brutally Harassed by her Boyfriend for Money: మానవ సంబంధాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. ప్రేమకోసం, ఆస్తి కోసం.. ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. తాజాగా మధ్యప్రదేశ్ లోని గుణజిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తికోసం ఒక మహిళపై అత్యాచారం చేసి.. చిత్రహింసలు పెట్టాడో దుర్మార్గుడు. వీరిద్దరూ ప్రేమికులు కావడం కొసమెరుపు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.


నిందితుడు, బాధితురాలు(23) పక్కపక్క ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు. మహిళ తండ్రి కొంతకాలం క్రితమే మరణించగా.. ఆమె తల్లి పేరుపై ఆస్తి ఉంది. ఈ విషయం తెలుసుకున్న పఠాన్ (24) ఆమెను ప్రేమిస్తున్నట్లు నటించాడు. నువ్వులేకుండా ఉండలేను.. పెళ్లి చేసుకుందాం అని నమ్మించాడు. కొన్నాళ్లకు అది బలవంతంగా మారింది. తనను పెళ్లి చేసుకుని ఆస్తిని తనపేరుపై మార్చాలని అయాన్ పఠాన్ బాధిత మహిళను వేధించాడు.


Also Read: కాలేజీలో దారుణం, ఎంసీఏ స్టూడెంట్‌ని కత్తితో తొమ్మది సార్లు పొడిచి..

నెలరోజులుగా ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా.. బెల్టు, పైపులతో చాలబాదాడు. అంతటితో ఆగకుండా.. శరీరానికి అయిన గాయాలపై, నోటిలో, కళ్లలో కారం పోసి చిత్రహింసలకు గురిచేశాడు. ఆమె అరుపులు బయటకు వినిపించకుండా ఉండేందుకు పెదాలకు ఫెవిక్విక్ వేసి సీల్ చేసేశాడు. ఇదంతా జరిగిన సమయంలో బాధిత యువతి తల్లి శివపురిలో ఉన్నట్లు తేలింది. పఠాన్ చెర నుంచి ఏప్రిల్ 16న తప్పించుకున్న ఆమె.. ఆస్పత్రికి చేరుకుంది. గుణజిల్లా ఆస్పత్రి వైద్యులిచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ రెండేళ్లుగా రిలేషన్ లో ఉన్నారని పోలీసులు చెప్పారు.

Related News

Solar Storm: భూమికి మరో ముప్పు.. ముంచుకోస్తున్న సౌర తుఫాన్..

India Post: బిగ్ షాకిచ్చిన పోస్టల్.. అక్కడికి అన్నీ బంద్.. వాట్ నెక్స్ట్!

NEET Student Incident: మార్కుల ఒత్తిడి.. బిల్డింగ్ పైకి ఎక్కి నీట్ స్టూడెంట్..

September Holidays: సెప్టెంబర్‌లో సగం రోజులు సెలవులే.. ఇదిగో హాలిడేస్ లిస్ట్

Jammu Kashmir Cloudburst: జమ్ము కశ్మీర్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. 11మంది మృతి, పలువురికి గాయలు..

Chief Ministers: అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా మూడో స్థానంలో చంద్రబాబు

Big Stories

×