MCA Student Murdered in Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. తన ప్రేమను నిరాకరించినందుకు ఎంసీఏ స్టూడెంట్‌ని కత్తితో పొడిచి చంపి దారుణంగా హతమార్చాడు ప్రేమోన్మాది. కొన్ని రోజులుగా తనను ప్రేమించాలని నిందితుడు.. యువతి వెంటపడుతూ వచ్చాడు. చివరకు ఆమె అంగీకరించలేదన్న కోపంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో దారుణంగా చంపేశాడు. సంచలనం రేపిన ఈ ఘటన కర్ణాటకలోని హుబ్బళ్లిలోని కాలేజీలో చోటు చేసుకుంది.
హుబ్బళ్లి పాలికె కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ కూతురు నేహా హీరేమఠ.. స్థానిక కాలేజీ ఎంసీఏ చదువు తోంది. కాలేజీ తర్వాత బీవీబీ కాంప్లెక్స్ క్యాంటీన్‌కి తన ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లింది. తిరుగు వస్తున్న సమయంలో ఆమె వద్దకు వెళ్లిన నిందితుడు ఫయాజ్ తనతో తెచ్చుకున్న కత్తితో కసి తీరా తొమ్మిదిసార్లు పొడిచాడు.
Also Read: Manifesto: గుడ్ న్యూస్.. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, బాలికలకు రూ. 50 వేలు?
వెంటనే తోటి ఫ్రెండ్స్ ట్రీట్‌మెంట్ కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా నేహా మృతి చెందింది. ఘటన తర్వాత అక్కడి నుంచి పరారవుతున్న ఫయాజ్‌ను స్టూడెంట్స్ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
ఫయాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులకు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫయాజ్ సొంతూరు బెల్గావి జిల్లా. బీవీబీ కళాశాలలో నేహాతో కలిసి బీసీఏ కోర్సు చేసినట్టు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నేహా ఎంసీఏ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కొద్దిరోజులుగా తనను దూరం పెట్టడంతోనే ప్లాన్ ప్రకారం నేహాను హత్య చేసినట్టు అంగీకరించారు.
https://twitter.com/nabilajamal_/status/1780975383900553595