Big Stories

Motorola Edge 50 Pro Sale: సేల్ మొదలైంది.. ఈ ఆఫర్లతో తక్కువ ధరకే కొత్త 5జీ ఫోన్‌ను కొనేయండిలా..!

Motorola Edge 50 Pro Sale Started: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటోరోల కంపెనీ కొత్త కొత్త మొబైళ్లను మార్కెట్‌లో రిలీజ్ చేస్తూ ఫోన్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ కంపెనీ ఎన్నో రకాలైన మోడళ్లను, వేరియంట్లను విడుదల చేసి అట్రాక్ట్ చేసింది. అయితే ఇప్పుడు మరొక కొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ‘మోటోరోల ఎడ్జ్ 50 ప్రో’ ఫోన్‌ను ఇటీవల లాంచ్ చేసింది.

- Advertisement -

అయితే దీనికి సంబంధించిన సేల్ కూడా స్టార్ట్ చేయడంతో కొద్ది సేపటికే స్టాక్ అయిపోయింది. అందువల్ల అప్పుడు ఈ ఫోన్‌ను మిస్ అయిన వారు ఇప్పుడు కొనుక్కోవచ్చు. ఈ రోజు ఈ మొబైల్‌ రెండవ సేల్ ప్రారంభమైంది. అందువల్ల ఈ ఫోన్‌ను కొనుక్కోవాలనుకునే వారు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులను ఉపయోగించి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. మరి ఈ ఫోన్ ధర, ఆఫర్ వివరాలు, స్పెసిఫికేషన్ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.31,999గా కంపెనీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే దీని 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.35,999 ధర వద్ద రిలీజ్ చేసింది. అయితే కస్టమర్లు బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించి మరింత తక్కువ ధరకే దీన్ని కొనుక్కోవచ్చు.

Also Read:Nothing Phone 2 ChatGPT : నథింగ్ ఫోన్ క్రేజీ అప్‌డేట్.. ఈ ఫీచర్‌తో వేగం!

HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను కలిగిన కొనుగోలుదారులు EMI లావాదేవీలపై రూ.2,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా కొనుగోలుదారులు 9 నెలల వరకు EMIలో కూడా ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. అలాగే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.2,250 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ మొబైల్ మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. లక్స్ లావెండర్, మూన్‌లైట్ పెర్ల్, బ్లాక్ బ్యూటీ వంటి కలర్ ఆప్షన్లలో దీన్ని పొందవచ్చు.

Also Read: అమేజింగ్ ఆఫర్.. రూ.11 వేల 5జీ ఫోన్ పై రూ.10,400 వరకు డిస్కౌంట్..

ఈ మొబైల్ వెనుకభాగం మెటల్ ఫ్రేమింగ్‌తో సిలికాన్ వేగన్ లెదర్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 1.5k రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల పంచ్-హోల్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది గరిష్ట ప్రకాశంతో 2,000 నిట్‌ల వరకు కర్వడ్ OLED ప్యానెల్‌తో వస్తుంది. ఐ ప్రొటెక్షన్ కోసం 1ఇందులో SGS సర్టిఫికేషన్ ఉంది.

ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌తో వచ్చింది. ఈ మొబైల్ 125W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది. అయితే బేస్ కాన్ఫిగరేషన్ 68W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో అదే బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. రెండూ 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తాయి. ఇది 50MP AI మెయిన్ లెన్స్‌తో ట్రిపుల్-రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. అలాగే మాక్రో సెన్సార్‌గా కూడా పనిచేసే 13MP అల్ట్రావైడ్ కెమెరాను, 30x హైబ్రిడ్ జూమ్‌తో టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. సెల్ఫీల కోసం ఒకే కెమెరా ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News