BigTV English

Ayodhya Ram Mandir : 5 వేల అమెరికన్ వజ్రాలతో అయోధ్య రాముడికి కంఠహారం.. ఓ భక్తుడి కానుక..

Ayodhya Ram Mandir : 5 వేల అమెరికన్ వజ్రాలతో అయోధ్య రాముడికి కంఠహారం.. ఓ భక్తుడి కానుక..

Ayodhya Ram Mandir : అయోధ్యలో రామ మందిరం త్వరలో ప్రారంభకానుంది. రాములోరి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రారంభోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 22న ఈ కార్యక్రమం జరగనుంది. జనవరి 23 నుంచి సాధారణ భక్తులను అనుమతిస్తారు. ఈ క్రమంలో రామ భక్తుల స్వామివారికి భారీ కానుకలు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు.


గుజరాత్‌ సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి కౌశిక్ కకాడియా రాములోరి కోసం వజ్రాల కంఠహారం తయారు చేయించారు. 5 వేల అమెరికన్ వజ్రాలతో ఈ కంఠహారం రూపొందించారు. రామాయణంలోని ముఖ్య పాత్రల చిత్రాలను కంఠహారంపై తీర్చిదిద్దారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేళ ఈ హారాన్ని కానుకగా ఇస్తానని కౌశిక్ కకాడియా తెలిపారు.

ఈ కంఠహారం తయారీ కోసం 5 వేల అమెరికన్‌ వజ్రాలతోపాటు 2 కిలోల వెండిని ఉపయోగించారు. హారం తయారీ కోసం 40 మంది కళాకారులు 35 రోజులపాటు శ్రమించారు. కంఠహారంపై అయోధ్య రామమందిర నమూనాను కూడా పొందుపరిచారు.


Related News

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Big Stories

×