BigTV English

OTT Movie : కూతురు వయసున్న అమ్మాయితో… మోహన్ లాల్ ను ఇలాంటి పాత్రలో అస్సలు ఊహించలేరు మావా

OTT Movie : కూతురు వయసున్న అమ్మాయితో… మోహన్ లాల్ ను ఇలాంటి పాత్రలో అస్సలు ఊహించలేరు మావా

OTT Movie : మోహన్‌లాల్ రీసెంట్ గా నటించి మెప్పించిన మలయాళం సినిమా ‘Hridayapoorvam’.  ఫీల్ గుడ్ రొమాంటిక్ శైలిలో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో మీరా జాస్మిన్, బాసిల్ జోసెఫ్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్‌లో ₹100 కోట్లకు పైగా వసూళ్లతో, 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. నెల తిరక్కుండానే ఓటీటీలో కూడా దూసుకెళ్తోంది. ఈ కథ ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్

‘Hridayapoorvam’ 2025 ఆగస్టు 28న విడుదలైన మలయాళ రొమాంటిక్ కామెడీ సినిమా. దీనికి సత్యన్ అంతిక్కాడ్ దర్శకత్వం వహించారు. దీనిని ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబావూర్ నిర్మించారు. ఇందులో మోహన్‌లాల్, మాళవికా మోహనన్, సంగీత మాధవన్ నాయర్, సంగీత్ ప్రతాప్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జియో హాట్‌స్టార్‌లో 2025 సెప్టెంబర్ 26 నుండి మలయాళం, తమిళం, హిందీ, తెలుగు, కన్నడ డబ్బింగ్ వెర్షన్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో 7.0/10 రేటింగ్‌ని పొందింది.

స్టోరీలోకి వెళ్తే

సందీప్ బాలకృష్ణన్ (మోహన్‌లాల్) 40 ఏళ్ల వ్యాపారవేత్త. కొచ్చిలో రెస్టారెంట్ ను నడుపుతూ ఒంటరిగా జీవిస్తుంటాడు. ఒక రోజు అతని ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో టెస్టులు చేయించుకుంటాడు. అతనికి గుండె మార్పిడి ఆపరేషన్ అవసరం అవుతుందని తెలుస్తుంది. ఒక ఇండియన్ ఆర్మీ కల్నల్ రవీంద్రనాథ్ దానం చేసిన గుండె అతనికి సెకండ్ లైఫ్ ని ఇస్తుంది. కానీ ఆపరేషన్ తర్వాత, సందీప్ గుండెను కేవలం ఒక అవయవంగా భావిస్తాడు. కానీ కల్నల్ కుమార్తె హరిత (మాళవికా మోహనన్) తన తండ్రి ఆఖరి కోరిక ప్రకారం, సందీప్‌ను తన నిశ్చితార్థానికి ఆహ్వానిస్తుంది. సందీప్ కృతజ్ఞత చెప్పడానికి పూణే వెళ్తాడు. కానీ హరిత నిశ్చితార్థం ఊహించని కారణంతో రద్దవుతుంది. అదే రోజు సందీప్ వీపునొప్పితో బాధపడతాడు. దీంతో అతను కల్నల్ కుటుంబంతో కొన్ని వారాలు గడపాల్సి వస్తుంది.


ఈ సమయంలో అతను హరిత తల్లి దేవిక, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ జెర్రీతో క్లోజ్ అవుతాడు. సందీప్ కుటుంబంతో గడిపే క్షణాలు అతని ఒంటరి జీవితాన్ని మార్చడం మొదలుపెడతాయి. హరితతో అతని సంబంధం క్రమంగా ప్రేమగా మారుతుంది. అయితే అతనికి గుండెను ఇచ్చి బతికించిన ఫ్యామిలీ కావడంతో ఆలోచనలో పడతాడు. బాధలో ఉన్న ఈ కుటుంబానికి తోడుగా ఉంటాడు. అతను కూడా తన జీవితంలో ఒక కొత్త ఆనందాన్ని పొందుతాడు. చివరలో సందీప్ తన ప్రేమను ఒప్పుకోవాలా? తన గత జీవితానికి తిరిగి వెళ్లాలా ? అనే నిర్ణయం ఈ కథకు ఆసక్తికర ముగింపును ఇస్తుంది.

Read Also : ప్రియురాలి గదిలోకి స్నేహితున్ని పంపే ప్రియుడు … ముసలోడి నుంచి నిక్కరేసుకున్న వాడి దాకా…

Related News

OTT Movie : ఓనర్ ను కాపాడడానికి ప్రాణాలకు తెగించే పిల్లి… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

OTT Movie : ఈ ఊళ్ళో నీళ్లలో అడుగుపెడితే పోతారు… తండ్రీకూతుర్లూ ఇద్దరూ ట్రాప్… వణుకు పుట్టించే ట్విస్టులు

OTT Movie : హాస్పిటల్ కు వచ్చిన అమ్మాయిల్ని వదలకుండా అదే పని… ఐసీయూలో ముసలి డాక్టర్ అరాచకం భయ్యా

OTT Movie : డ్రాయర్ లో ఫిష్ వేసుకుని ఇదెక్కడి మెంటల్ పనిరా అయ్యా… ఒక్కో సీన్ మ్యాడ్ ఉంటది భయ్యా

OTT Movie : బాబోయ్ అరుపుతో అరసెకనులో చంపేసే అమ్మాయి… ఒక్కొక్కడూ ముక్కలు ముక్కలుగా… స్పైన్ చిల్లింగ్ థ్రిల్లర్

OTT Movie : పని మనిషిపై అంతులేని ప్రేమ… ఆ పాడు పని కోసం దిక్కుమాలిన ప్లాన్… ఇలాంటి గెస్ట్ ను ఎక్కడా చూసుండరు

OTT Movie : ఇంకొకడి కోసం ప్రేమించిన వాడిని నిండా ముంచే అమ్మాయి… కిల్లర్ల గ్యాంగ్ మొత్తం ఒకే చోట… బ్రూటల్ రివేంజ్ డ్రామా

Big Stories

×