BigTV English

OTT Movie : డ్రాయర్ లో ఫిష్ వేసుకుని ఇదెక్కడి మెంటల్ పనిరా అయ్యా… ఒక్కో సీన్ మ్యాడ్ ఉంటది భయ్యా

OTT Movie : డ్రాయర్ లో ఫిష్ వేసుకుని ఇదెక్కడి మెంటల్ పనిరా అయ్యా… ఒక్కో సీన్ మ్యాడ్ ఉంటది భయ్యా

OTT Movie : కామెడీ జానర్ లో వచ్చిన ఒక హాలీవుడ్ సినిమా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తోంది. ఈ సినిమా ఒక ఇజ్రాయిలీ సూపర్ సైనికుడి చుట్టూ తిరుగుతుంది. ఈ సైనికుడికి అమెరికాలో హెయిర్‌స్టైలిస్ట్‌గా మారాలనే కలఉంటుంది. ఈ కల కథను సరదాగా చూపిస్తుంది. హాస్య ప్రియులు తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

‘You Don’t Mess with the Zohan’ అమెరికన్ యాక్షన్ కామెడీ చిత్రం. దీనికి డెన్నిస్ డుగాన్ దర్శకత్వం వహించారు. ఇందులో ఆడమ్ శాండ్లర్ ప్రధాన పాత్రలో నటించగా, జాన్ టర్టురో, ఎమ్మాన్యూల్ చ్రికీ, నిక్ స్వార్డ్సన్, లైనీ కజాన్ తదితరులు సహాయక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2008 జూన్ 6న కొలంబియా పిక్చర్స్ ద్వారా విడుదలై, $90 మిలియన్ బడ్జెట్‌తో $204.3 మిలియన్ లు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసి బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. IMDbలో ఈ సినిమా 5.6/10 స్కోర్ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే

జోహన్ డ్విర్ ఒక ఇజ్రాయిలీ సూపర్ సైనికుడు. అతను సూపర్‌ మ్యాన్ లాంటి శక్తులతో శత్రువులను సులభంగా ఒడిస్తుంటాడు. కానీ అతను ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధాలతో విసిగిపోయి, అమెరికాలో హెయిర్‌ స్టైలిస్ట్‌గా మారాలనే కలను నిజం చేసుకోవాలనుకుంటాడు. తన కలను సాధించడానికి, అతను తన మరణాన్ని నకిలీగా చూపించి, ఒక యుద్ధంలో తప్పించుకుని న్యూయార్క్‌కు పారిపోతాడు. అక్కడ అతను తన పేరును స్క్రాపీ కోకో గా మార్చుకుని, ఒక పరున్న సలూన్‌లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాడు. కానీ అనుభవం లేనందున అతనికి ఆ ఉద్యోగం రాకుండా పోతుంది. ఆ తర్వాత అతను దలియా అనే ఒక పాలస్తీనియన్ మహిళ నడిపే సలూన్‌లో చిన్న ఉద్యోగం పొందుతాడు.


అక్కడ అతను తన హెయిర్‌ స్టైలింగ్ ని, కొత్త పద్దతుల్లో చేసి వృద్ధ మహిళలను ఆకట్టుకుంటాడు. అదే సమయంలో వారికి ప్రత్యేక సేవలు కూడా అందిస్తాడు. ఇది సిరీస్‌లో కామెడీ సన్నివేశాలకు దారితీస్తుంది. న్యూయార్క్‌లో జోహన్‌ను ఒక ఇజ్రాయిలీ స్నేహితుడు గుర్తిస్తాడు. కానీ అతని సీక్రెట్ ని అలాగే దాచిపెడతాడు. జోహన్ ఇక దలియా సలూన్‌ను టాప్ లోకి తెసుకెళ్తాడు. కానీ అతని గతం అతన్ని వెంటాడుతుంది. అతని శత్రువుకి ఒక రోజు జోహన్ బతికే ఉన్నాడని తెలుసుకుని న్యూయార్క్‌కు వస్తాడు. ఇక క్లైమాక్స్ ఆసక్తికరమైన ముగింపును ఇస్తుంది. చివరికి జోహన్, తన శత్రువుని ఎలా ఎదుర్కుంటాడు ? జోహన్ గురించి అందరికీ తెలిసిపోతుందా ? అతను మళ్ళీ సైన్యంలో చేరుతాడా ? హెయిర్‌ స్టైలిస్ట్‌గానే ఉంటాడా ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

Read Also : పోలీస్ మర్డర్ కేసులో ఊహించని ట్విస్టులు … ఎటూ తేలని యవ్వారం …ఈ కిల్లర్ మామూలోడు కాదు

Related News

OTT Movie : ఈ ఊళ్ళో నీళ్లలో అడుగుపెడితే పోతారు… తండ్రీకూతుర్లూ ఇద్దరూ ట్రాప్… వణుకు పుట్టించే ట్విస్టులు

OTT Movie : కూతురు వయసున్న అమ్మాయితో… మోహన్ లాల్ ను ఇలాంటి పాత్రలో అస్సలు ఊహించలేరు మావా

OTT Movie : హాస్పిటల్ కు వచ్చిన అమ్మాయిల్ని వదలకుండా అదే పని… ఐసీయూలో ముసలి డాక్టర్ అరాచకం భయ్యా

OTT Movie : బాబోయ్ అరుపుతో అరసెకనులో చంపేసే అమ్మాయి… ఒక్కొక్కడూ ముక్కలు ముక్కలుగా… స్పైన్ చిల్లింగ్ థ్రిల్లర్

OTT Movie : పని మనిషిపై అంతులేని ప్రేమ… ఆ పాడు పని కోసం దిక్కుమాలిన ప్లాన్… ఇలాంటి గెస్ట్ ను ఎక్కడా చూసుండరు

OTT Movie : ఇంకొకడి కోసం ప్రేమించిన వాడిని నిండా ముంచే అమ్మాయి… కిల్లర్ల గ్యాంగ్ మొత్తం ఒకే చోట… బ్రూటల్ రివేంజ్ డ్రామా

OTT Movie : కట్టుకున్నోడి దగ్గర అడ్డంగా బుక్… భర్తను అడ్డు తొలగించుకోవడానికి షాకింగ్ పని… మతిపోగోట్టే స్పై థ్రిల్లర్

Big Stories

×