BigTV English

Rashmika Mandanna : నేషనల్ క్రష్ డీప్ ఫేక్ వీడియో.. నలుగురి అరెస్ట్..

Rashmika Mandanna : నేషనల్ క్రష్ డీప్ ఫేక్ వీడియో.. నలుగురి అరెస్ట్..
Rashmika Mandanna

Rashmika Mandanna : గత కొద్దిరోజులుగా సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అవ్వడం మనం గమనిస్తున్నాం. మరి ముఖ్యంగా లేడీ సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది రేపిన దుమారం అంతా ఇంతా కాదు.. రీసెంట్ గా ఈ డీప్ ఫేక్ వీడియో విషయంలో చాలా ఇబ్బందికి గురి అయినటువంటి నటి రష్మిక. ఆ తర్వాత వరుసగా చాలామంది సెలబ్రిటీలకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


నిన్న మొన్నటి వరకు నేషనల్ రష్మికకు సంబంధించి ఒక అసభ్యకరమైన బ్లాక్ డ్రెస్‏ డీప్ ఫేక్ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. అది అంతటితో ఆగకుండా మరి కొంత మందికి సంబంధించి కూడా ఇదే జరుగుతూ ఉండడంతో ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఈ విషయానికి సంబంధించి సీరియస్ అయిన గవర్నమెంట్ వెంటనే నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేనండి.. ఏఐ సాయంతో కొందరు ఆకతాయిలు అదేపనిగా డీప్ ఫేక్ వీడియోలు చేసి వైరల్ చేస్తూ ఉన్నారు. రష్మిక తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అలియా భట్ ,ప్రియాంక చోప్రా ,కత్రినా కైఫ్ డీప్ ఫేక్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో హడావిడి చేశాయి. ఇలా టెక్నాలజీ ఉపయోగించి ఒక వ్యక్తికి సంబంధించిన డీప్ ఫేక్ వీడియోస్ చేయడం..వాటిని సోషల్ మీడియాలో విడుదల చేయడం పై బాలీవుడ్ అమితాబచ్చన్ కూడా తన అసహనాన్ని వ్యక్తం చేశారు.


ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సెలబ్రెటీలతో పాటు గా అభిమానులు, రాజకీయ ప్రముఖులు కూడా డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ విషయాన్ని ఎంతో సీరియస్ గా తీసుకొని కేసు నమోదు చేసి డీప్ ఇన్వెస్టిగేషన్ చేపట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా రష్మిక డీప్ ఫేక్ వీడియో కేసుకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియోని అప్డేట్ చేసిన వ్యక్తులుగా ఈ నలుగురిని పోలీసులు గుర్తించారు. అయితే తెర వెనుక ఉన్న అసలు కుట్ర దారుడు కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇప్పటికైనా ఆన్లైన్లో ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు పెట్టే ఆకతాయి పనులు తగ్గుతాయి అని అందరూ ఆశిస్తున్నారు.

Related News

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

Big Stories

×