BigTV English

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (29/09/2025)                

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (29/09/2025)                

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన సెప్టెంబర్‌ 29వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి:  

సంతాన విద్యా ఫలితాలు  నిరుత్సాహ పరుస్తాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. చిన్ననాటి మిత్రులతో  కలహా సూచనలున్నవి. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.  దూరప్రయాణ సూచనలున్నవి.

వృషభ రాశి:

ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది.


మిథున రాశి:  

ఆర్ధిక అనుకూలత కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో  ముఖ్య నిర్ణయాలు అమలు పరుస్తారు. సమాజంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో  దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.  వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగ సాగుతాయి.

కర్కాటక రాశి:

ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో  యత్నకార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు మరింత  ఉత్సాహంగా సాగుతాయి.

సింహరాశి:

ఆరోగ్య విషయంలో  జాగ్రత్త అవసరం. ముఖ్యమైన  పనులు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి. మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది.  ఉద్యోగమున అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి.

కన్యారాశి :

దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపార విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వ్యాపారమున కీలక  నిర్ణయాలు అమలు పరుస్తారు. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి  శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలస్తుంది.

వృశ్చికరాశి:

వృత్తి, వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన  పనులు వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

ధనస్సు రాశి:

నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు  ఫలిస్తాయి.  వృత్తి  ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ పెద్దల ఆదరణ పెరుగుతుంది. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి చేతిలో డబ్బు నిలువక నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.

మకరరాశి:

దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ముఖ్యమైన  పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇంటా బయట ఉహించిన ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు తప్పవు.

కుంభరాశి:

చిన్ననాటి స్నేహితులతో  దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి  శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరంగా అనుకూలత సాధిస్తారు. నూతన వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు. ఉద్యోగమున జీత భత్యాల విషయంలో శుభఫలితాలు పొందుతారు.

మీనరాశి:

వ్యాపారాలు  ఆశించిన విధంగా రాణిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఇంట్లో  విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగమున మీ పని తీరుకు  అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులలో  కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలలో  నూతనోత్సాహంతో  ముందుకు సాగుతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (సెప్టెంబర్‌ 28 – అక్టోబర్‌ 04)

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (28/09/2025)               

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (27/09/2025)               

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (26/09/2025)               

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (25/09/2025)               

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (24/09/2025)               

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు. (23/09/2025)               

Big Stories

×