E-Paper
Advertisement

Modi : ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు.. బెంగళూరులో మోదీ రోడ్ షో..

Modi : ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు.. బెంగళూరులో మోదీ రోడ్ షో..
Advertisement

Modi : కర్నాటకలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రచారానికి మరో రోజు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రచారంలో దూకుడు పెంచింది. తాజాగా బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో చేపట్టారు. న్యూ తిప్పసాంద్ర రోడ్డులోని కెంపెగౌడ విగ్రహం నుంచి ట్రినిటీ సర్కిల్‌ వరకు ఈ రోడ్ షో చేపట్టారు.

ప్రధాని చేపట్టిన రెండో రోడ్‌ షో ఇది. మోదీపై దారి పొడవునా పూల వర్షం కురిపించారు. నీట్‌ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు ఇబ్బంది లేకుండా రెండో రోడ్‌ షోను 10 కిలోమీటర్లతో సరిపెట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. దక్షిణ కర్ణాటకలో కేంద్రం హోంమంత్రి అమిత్‌ షా రోడ్‌ షో చేపట్టారు.

Advertisement

ప్రధాని శనివారం 28 కిలోమీటర్లు రోడ్ షో చేశారు. 18 నియోజకవర్గాలను చుట్టేశారు. బాదామి, హావేరిలకు వెళ్లిన మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఉన్న బిడ్డ ప్రపంచమే గుర్తించేలా దేశాన్ని నిలబెట్టారంటే అందుకు కారణం తాను కాదని ప్రజలు వేసిన ఓటేనని ప్రకటించారు.

కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. సోమవారంతో ప్రచార పర్వం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రచారంలో దూకుడు పెంచింది. అటు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

Related News

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

Big Stories

Advertisement
×