BigTV English

Modi : ఆర్థిక నేరస్తులను వేగంగా అప్పగించండి.. బ్రిటన్ ను కోరిన మోదీ..

Modi : ఆర్థిక నేరస్తులను వేగంగా అప్పగించండి.. బ్రిటన్ ను కోరిన మోదీ..


Modi : బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కు భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఇరువురు ప్రధానులు కీలక అంశాలపై చర్చించారు. భారత్‌ వ్యతిరేక శక్తుల విషయంలో కఠిన చర్యలు చేపట్టాలని రిషి సునాక్‌ను మోదీ కోరారు. బ్రిటన్ లోని భారత దౌత్య కార్యాలయాల భద్రతపై ఆందోళన వ్యక్తంచేశారు.

ఇటీవల బ్రిటన్ లో భారత హైకమిషన్‌పై జరిగిన దాడిని మోదీ ప్రస్తావించారు. ఖలిస్తానీ అనుకూలవాదులు లండన్‌లో భారత దౌత్య కార్యాలయంపై దాడి చేశారు. భారత జాతీయ పతాకాన్ని అవమానించారు. ఈ ఘటనలను రిషి సునాక్‌తో మోదీ ప్రస్తావించారు. భారత వ్యతిరేక శక్తులపై గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. భారత్ దౌత్య కార్యాలయాల భద్రత విషయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హామీ ఇచ్చారు.


దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి బ్రిటన్ లో తలదాచుకుంటున్న వారిని భారత్ కు అప్పగించే విషయంపై చర్చించారు. ఆర్థిక నేరస్తులను అప్పగించే ప్రక్రియలో పురోగతిని గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం సహా ద్వైపాక్షిక సంబంధాలను ప్రధానులు సమీక్షించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని సత్వరం కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ లో ఢిల్లీలో జరిగే జి-20 సదస్సుకు హాజరుకావాలని రిషి సునాక్‌ను మోదీ ఆహ్వానించారు.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×