IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( IPL 2026 ) దగ్గరకు వస్తున్న నేపథ్యంలో 10 జట్లు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాయి. ఐపీఎల్ మినీ వేలానికి కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి నేపథ్యంలో ట్రేడ్ ప్రక్రియ ద్వారా ప్లేయర్లను మార్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు (Sunrisers Hyderabad ) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమ జట్టుకు సంబంధించిన ట్రావిస్ హెడ్ ను ముంబై ఇండియన్స్ కు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. ట్రావిస్ హెడ్ ను ముంబైకి పంపించి ట్రేడ్ ప్రక్రియ ద్వారా రోహిత్ శర్మను తీసుకురావాలని కావ్య పాప ( SRH Kavya Maran) స్కెచ్ వేసినట్లు సమాచారం. ఈ మేరకు ముంబై ఇండియన్స్ తో చర్చలు జరుగుతున్నాయట. ఈ చర్చలు ఓకే అయితే, వచ్చే సీజన్ లో హైదరాబాద్ జట్టు తరఫున రోహిత్ శర్మ (Rohit Sharma) బరిలోకి దిగుతాడు.
Also Read: IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్, ఐపీఎల్ 2026 రిటెన్షన్ ఎప్పుడంటే?
🚨 SRH approaches Mumbai Indians for Rohit Sharma in exchange for Travis Head. pic.twitter.com/kBKxm8HuR4
— Indian Cricket (@IPL2025Auction) November 9, 2025