Delhi Air Emergency : దిల్లీలో పొగ మంచు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వాయు కాలుష్యంతో గాలి నాణ్యత తగ్గిపోతుంది. దీంతో ప్రజలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. శ్వాసకోశ సమస్యలు తీవ్రమవుతున్నాయని ఇండియా గేట్ వద్ద స్థానికులు ఆదివారం “క్లీన్ ఎయిర్” నిరసన చేపట్టారు. “ఎయిర్ ఎమర్జెన్సీ” తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసనలో పాల్గొన్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కొంతమంది మహిళలు తమ చిన్నారులతో కలిసి నెబ్యులైజర్లు, వైద్య ప్రిస్క్రిప్షన్లు పట్టుకుని నిరసన తెలిపారు. దిల్లీ నగరంలో కాలుష్య సంక్షోభం తీవ్రమవుతుందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు.
‘మేము ఊపిరి పీల్చుకోలేకపోతున్నాము’ అంటూ ఇండియా గేట్ వద్ద దిల్లీవాసులు ప్లకార్డులు ప్రదర్శించారు. నిరసన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలపై నెటిజన్లు స్పందిస్తూ.. నిరసనకారులపై దాడి చేయడం అమానుషం అన్నారు.
నిరసనలను జంతర్ మంతర్‌కు మార్చాలని ఆందోళనకారులను కోరినట్లు పోలీసులు తెలిపారు. అందుకు నిరసనకారులు అంగీకరించకుండా, మాన్ సింగ్ రోడ్డును దిగ్బంధించారన్నారు. దీంతో తాము జోక్యం చేసుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని, రోడ్డును క్లియర్ చేశామని డీసీపీ దేవేష్ కుమార్ మహలా తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన వారిని మాత్రమే అదుపులోకి తీసుకున్నామని అన్నారు. ఆ తరువాత వారిని విడుదల చేశారని చెప్పారు.
దిల్లీలో వాయు కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇండిపెండెంట్ సంస్థను ఏర్పాటు చేయాలని, రియల్-టైమ్ గాలి నాణ్యత డేటా, కాలుష్యం పెరిగే సమయంలో స్పష్టమైన ఆరోగ్య సలహాలు, కాలుష్యాన్ని పరిష్కరించడానికి నిధులు కేటాయించాలని దిల్లీవాసులు డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం స్వచ్ఛమైన గాలి, జీవించే హక్కు ప్రాథమిక హక్కు అని తెలిపారు. దిల్లీ, కేంద్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని కాపాడటానికి దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Delhi has deployed riot police to stop a protest against air pollution.
As the AQI touches 600 long before peak winter, the government is busy tampering with monitors with water sprinklers and beating up young mothers and students for fighting for clean air.
National disaster. pic.twitter.com/pDppxkSKZj
— Anish Gawande (@anishgawande) November 9, 2025
సోమవారం దిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు 11.6°Cలకు పడిపోయాయి. గాలి నాణ్యత చాలా తీవ్రంగా ఉంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సోమవారం ఉదయం 6.05 గంటలకు ఇచ్చిన డేటా ప్రకారం వాయు నాణ్యత సూచిక (AQI) 346 రికార్డు అయింది. దిల్లీలోని చాలా ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు ఆందోళనకరంగా ఉన్నాయి. బవానాలో అత్యధికంగా AQI 412గా నమోదు అయింది. తరువాత వజీర్‌పూర్ (397), జహంగీర్‌పురి (394), నెహ్రూ నగర్ (386) ఉన్నాయి. సగటున 370 AQI రికార్డు అవుతుంది. అక్టోబర్ 30 తర్వాత ఈ సీజన్‌లో ఇది రెండో అత్యల్ప రీడింగ్ ను తాకింది.
Also Read: UP Lovers Incident: UPలో దారుణం.. లవర్‌ను గన్‌తో కాల్చి.. తర్వాత ప్రియుడు కూడా..
దేశ రాజధాని దిల్లీకి సమీపంలోని పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కాలుష్యం పెరిగిపోతుంది. దిల్లీలో PM 2.5 స్థాయిలు తక్కువగా నమోదు అవుతున్నాయి.