Terrorists Arrest: పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే-మొహమ్మద్ తో సంబంధాలున్నాయన్న అనుమానంతో పుల్వామాకు చెందిన డాక్టర్ ముజమ్మల్ వైద్యుడిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్టు జరిగిన 10 రోజుల తర్వాత హర్యానా, జమ్మూ కశ్మీర్‌లలో ఓ భారీ ఉగ్రదాడిని పోలీసులు భగ్నం చేశారు. హర్యానా ఫరీదాబాద్‌లోని ఓ ఇంట్లో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలను సీజ్ చేశారు. పోలీసుల తనిఖీల్లో 360 కిలోల అమ్మోనియం నైట్రేట్, భారీగా ఆయుధాలు, బాంబు తయారీ భాగాలను స్వాధీనం చేసుకున్నారు.
మూడు మ్యాగజైన్‌లతో అస్సాల్ట్ రైఫిల్, 83 లైవ్ కార్ట్రిడ్జ్‌లు, ఎనిమిది లైవ్ రౌండ్ల పిస్టల్, రెండు ఖాళీ కార్ట్రిడ్జ్‌లు, రెండు అదనపు మ్యాగజైన్‌లు, 12 సూట్ కేసులు, పేలుడు పదార్థం ఉన్న బకెట్, 20 టైమర్లు, నాలుగు బ్యాటరీలు, రిమోట్‌లు, ఐదు కిలోగ్రాముల హెవీ మెటల్, ఒక వాకీ-టాకీ సెట్ ను పోలీసులు సీజ్ చేశారు. వీటిని భారీ ఉగ్రదాడికి ఉపయోగించేందుకు సిద్ధం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరికి అల్-ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేస్తున్న మహిళా వైద్యురాలు సహాయపడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె కారులో అస్సాల్ట్ రైఫిల్ ను పోలీసులు గుర్తించారు.
నిందితుడు ఆమెకు తెలియకుండానే కారులో గన్ పెట్టాడా? అనే విషయంపై దర్యాప్తులో ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఫరీదాబాద్, సహరన్‌పూర్‌లలో అరెస్టుల తర్వాత పుల్వామాకు చెందిన మరో వైద్యుడు డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాథర్‌ను జమ్ము కశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
VIDEO | Faridabad terror module case: Police Commissioner Satender Kumar Gupta says, "Dr. Muzammil, arrested in the case, was teaching at Al Falah University. The investigation is underway after the recovery of explosives, an assault rifle, and other ammunition."#Faridabad… pic.twitter.com/mynBoFbePU
— Press Trust of India (@PTI_News) November 10, 2025
ఉగ్ర లింకుల నేపథ్యంలో అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ముజమ్మల్ ను పది రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముజమ్మల్ అరెస్టు తర్వాత, ఆదివారం ఫరీదాబాద్‌లోని అతని నివాసంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలను నిల్వ చేయడానికి మాత్రమే నిందితుడు అదనపు గదిని అద్దెకు తీసుకున్నాడని పోలీసులు గుర్తించారు.
Also Read: UP Lovers Incident: UPలో దారుణం.. లవర్‌ను గన్‌తో కాల్చి.. తర్వాత ప్రియుడు కూడా..
ఈ ఆపరేషన్ గురించి ఫరీదాబాద్ పోలీస్ కమిషనర్ సతేందర్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. జమ్ము కశ్మీర్, హర్యానా పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసినట్లు తెలిపారు. త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందన్నారు. ఉత్తర భారతదేశంలో ఉగ్రదాడులు చేయడమే లక్ష్యంగా పాకిస్తాన్ కు చెందిన జైషే-మొహమ్మద్ మద్దతుదారులు పనిచేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.