E-Paper
Advertisement

పోలీస్ శాఖలో భారీ కుంభకోణం.. నకిలీ ఉద్యోగుల పేరుతో రూ.6.4 కోట్లు అవినీతి

పోలీస్ శాఖలో భారీ కుంభకోణం.. నకిలీ ఉద్యోగుల పేరుతో రూ.6.4 కోట్లు అవినీతి
Advertisement

Police Payroll scam| సమాజంలో అవినీతి రూపుమాపాల్సిన పోలీస్ శాఖలో భారీ కుంభకోణం జరిగింది. లేని ఉద్యోగుల ఉన్నట్లు అకౌంట్లు సృష్టించి వారికి జీతాల పేరుతో రూ.6.41 కోట్లు స్వాహా చేశారు కొంతమంది అధికారులు. ఈ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో జరిగింది. అక్కడి పోలీసు శాఖలో అసలు ఉద్యోగులు కాని 10 మంది పేర్లతో రూ.6.41 కోట్ల ప్రభుత్వ జీతాలు చెల్లించినట్లు దర్యాప్తులో బయటపడింది. ఉద్యోగుల జీతాల వివరాలను పాత సేవార్త్ (Sevarth) పోర్టల్ నుంచి కొత్త పేరోల్ సాఫ్ట్‌వేర్‌కు మార్చే సమయంలో ఈ అక్రమాలు బయటపడ్డాయి.
ఈ ఘటన ప్రభుత్వ శాఖల్లో పేరోల్ సిస్టమ్ భద్రతపై తీవ్ర అనుమానాలకు కారణమైంది.

మోసం ఎలా బయటపడింది?

ఉద్యోగుల డేటాను కొత్త సాఫ్ట్‌వేర్‌కు మార్చే ప్రక్రియలో అధికారులు కొన్ని అసాధారణ అంశాలను గుర్తించారు. దీంతో ముంబై ఉత్తర ప్రాంతీయ విభాగానికి చెందిన ఒక పోలీసు అధికారి అధికారికంగా ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో పోలీసు శాఖలో పనిచేయని కొందరి పేర్లు ఉద్యోగుల జాబితాలో ఉన్నట్లు గుర్తించారు. వారి పేర్లపై ప్రతి నెలా జీతాలు బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్లు తేలింది.

10 మంది నకిలీ ఉద్యోగుల పేర్లతో జీతాలు

Advertisement

దర్యాప్తులో మొత్తం 10 మంది నకిలీ ఉద్యోగుల పేర్లు బయటపడ్డాయి. వీరికి పోలీసు శాఖతో ఎలాంటి సంబంధం లేకపోయినా ఉద్యోగులుగా నమోదు చేశారు. 2019 డిసెంబర్ నుంచి 2020 ఫిబ్రవరి వరకు భారీగా అక్రమ జీతాల చెల్లింపులు జరిగినట్లు అధికారులు గుర్తించారు. అలాగే 2020 జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ నకిలీ ఉద్యోగుల పేర్లపై మొత్తం రూ.6.41 కోట్ల జీతాలు విడుదలైనట్లు అధికారులు తెలిపారు.

నకిలీ అటెండెన్స్ రికార్డులు

కొంతమంది పోలీస్ శాఖ సిబ్బంది కలిసి ఈ కుంభకోణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నకిలీ అటెండెన్స్ హాజరు రిజిస్టర్లు, తప్పుడు అధికారిక రికార్డులు తయారు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. శాఖకు సంబంధం లేని వ్యక్తుల పేర్లను పేరోల్‌లో చేర్చి ప్రతి నెలా జీతాలు విడుదల చేసినట్లు దర్యాప్తులో తేలింది.

ఐదుగురు అధికారులపై కేసులు

Advertisement

ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు మాజీ ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ (పరిపాలనాధికారులు) రామ్‌కిషన్ గోస్వామి, నాగేశ్ తల్వాడేకర్, విజయ చవాన్ పేర్లు కేసులో ఉన్నాయి. హెడ్ క్లర్క్ అజయ్ రాథోడ్, సీనియర్ క్లర్క్ అమోల్ మేశ్రామ్‌లపై కూడా కేసులు నమోదయ్యాయి. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) – 2023 కింద ఫ్రాడ్, నకిలీ పత్రాల తయారీ, నమ్మకద్రోహం, క్రిమినల్ కుట్ర వంటి అభియోగాలు నమోదు చేశారు.

Also Read: ఐఐటీ డిగ్రీ లేకుండానే నెలకు రూ.5 లక్షల ఆదాయం? బీటెక్ డ్రాప్‌అవుట్ సంపాదన ఎలాగంటే

ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్

విజయ చవాన్, అమోల్ మేశ్రామ్‌  అనే ఉద్యోగులను ముంబై పోలీసు శాఖ సస్పెండ్ చేసింది. వారు నకిలీ సర్వీస్ ఐడీలు, డీసీపీఎస్ (DCPS) ఐడీలు సృష్టించి అక్రమంగా జీతాలు విడుదల చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తు పూర్తయ్యే వరకు వారు ఎలాంటి ప్రైవేట్ ఉద్యోగాలు చేయకూడదు. అలాగే అధికారుల అనుమతి లేకుండా బృహన్‌ముంబై పరిధి దాటి వెళ్లకూడదు.

దర్యాప్తు కొనసాగుతోంది

నకిలీ ఉద్యోగులుగా నమోదైన 10 మంది అసలు ఎవరో పోలీసులు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. వారి పేర్లపై తెరిచిన బ్యాంకు ఖాతాలను ఎవరు నిర్వహించారో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కుంభకోణం ద్వారా అసలు లబ్ధి పొందిన వ్యక్తులను గుర్తించేందుకు అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి ఘటనలు

ధూలే, లాతూర్ జిల్లాల్లో కూడా ఇలాంటి పేరోల్ అక్రమాలు జరిగినట్లు సమాచారం వచ్చింది. అక్కడ తక్కువ మొత్తాల అక్రమాలు గుర్తించినప్పటికీ, ఈ ఘటన తర్వాత మహారాష్ట్రవ్యాప్తంగా పేరోల్ వ్యవస్థను సమీక్షించాలని అధికారులు నిర్ణయించారు. భవిష్యత్తులో ఇలాంటి మోసాలు జరగకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

Tags

Related News

వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇన్సురెన్స్ లేకపోతే ఆయిల్ బంద్, రంగంలోకి పోలీసులు

కర్ణాటక పరిశ్రమలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి, ఐసీయూలో మరో ముగ్గురు!

జీతం రూ.63000.. పదో తరగతి ఉంటే చాలు.. ఇండియా పోస్ట్‌లో డ్రైవర్ జాబ్స్

కుమారుడు ఉదయనిధి అరెస్ట్.. సీఎం విజయ్‌పై విరుచుకుపడ్డ ఎం.కె. స్టాలిన్!

ఉదయనిధి స్టాలిన్‌ అరెస్టు వ్యవహారం.. విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం

E20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ నిరసన.. ప్రధాని నివాసానికి పాదయాత్ర!

త్రిషపై కామెంట్స్ వ్యవహారం.. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ అరెస్ట్, బెయల్ కోసం హైకోర్టుకు

Big Stories

Advertisement
×