E-Paper
Advertisement

ఐఐటీ డిగ్రీ లేకుండానే నెలకు రూ.5 లక్షల ఆదాయం? బీటెక్ డ్రాప్‌అవుట్ సంపాదన ఎలాగంటే

ఐఐటీ డిగ్రీ లేకుండానే నెలకు రూ.5 లక్షల ఆదాయం? బీటెక్ డ్రాప్‌అవుట్ సంపాదన ఎలాగంటే
Advertisement

College Dropout Huge Salary| భారతదేశంలో చాలామంది విద్యార్థులు ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చదవాలని కలలు కంటారు. ఐఐటీ డిగ్రీ ఉంటే మంచి ఉద్యోగం, భారీ జీతం ఖాయం అని చాలా మంది నమ్ముతారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్ట్ ఈ నమ్మకానికి రివర్స్‌లో ఉంది. నైపుణ్యాలు, అనుభవం ఉంటే కాలేజీ పేరు ఒక్కటే విజయాన్ని నిర్ణయించదని ఆ పోస్ట్ చెబుతోంది.

బీటెక్ పూర్తి చేయకుండానే కొత్త ప్రయాణం

లావణ్య జైన్ అనే యువకుడు.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (X) వేదికగా తన ఆదాయం, స్కిల్స్ గురించి తెలిపాడు. తాను ఐఐటీలో చదవలేదని ఆయన చెప్పాడు. అంతేకాకుండా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చివరి సెమిస్టర్‌లోనే చదువు మానేశానని వెల్లడించాడు. కాలేజీ చదువు మధ్యలోనే వదిలేయడం తన జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో ఒకటిగా ఆయన పేర్కొన్నాడు. ఆ నిర్ణయం తర్వాత తన కెరీర్ పూర్తిగా మారిపోయిందని తెలిపాడు.

నెలకు రూ.4.86 లక్షల ఆదాయం

Advertisement

లావణ్య జైన్ తన సోషల్ మీడియా పోస్టులో ప్రస్తుతం నెలకు రూ.4.86 లక్షలు సంపాదిస్తున్నానని పేర్కొన్నాడు. ఈ ఆదాయం ప్రధానంగా పార్ట్‌టైమ్ కాంట్రాక్ట్ పనుల ద్వారా వస్తోందని చెప్పాడు.
అదనంగా తనకు ఐదు రకాల పాసివ్ ఇన్‌కమ్ వనరులు కూడా ఉన్నాయని వెల్లడించాడు. వాటి ద్వారా భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చని తెలిపాడు. తన వాదనకు మద్దతుగా రెండు బ్యాంక్ క్రెడిట్ స్క్రీన్‌షాట్‌లను కూడా షేర్ చేశాడు. వాటిలో ఒకటి రూ.3.74 లక్షలు, మరొకటి రూ.1.12 లక్షల పేమెంట్స్ కనిపించాయి. ఈ రెండు కలిపి దాదాపు రూ.4.86 లక్షలుగా ఉన్నాయి.

ఇదంతా గొప్పలు చెప్పుకోవడం కాదు

తాను ఈ పోస్ట్‌ గొప్పలు చెప్పుకోవడానికి పెట్టలేదని లావణ్య జైన్ స్పష్టం చేశాడు. విద్యార్థులకు ఐఐటీ ఒక్కటే విజయానికి మార్గం కాదని గుర్తించాలని మాత్రమే ఈ పోస్ట్ చేశానని చెప్పాడు. ఐఐటీలో చదవడం వల్ల మంచి అలుమ్ని నెట్‌వర్క్, గుర్తింపు లభిస్తుందని ఆయన అంగీకరించాడు. అయితే విజయాన్ని నిర్ణయించేది కేవలం కాలేజీ పేరు కాదని అభిప్రాయపడ్డాడు.

డిగ్రీ కాదు నైపుణ్యాలే ప్రధానం

Advertisement

నేటి ఉద్యోగ మార్కెట్‌లో కాలేజీ బ్రాండ్ కంటే నైపుణ్యాలు, అనుభవం, నిరంతర అభ్యాసమే ఎక్కువ విలువ పొందుతున్నాయని లావణ్య జైన్ అన్నాడు. తాను పనిచేసే సంస్థలో కొంతమంది ఐఐటీ గ్రాడ్యుయేట్లు తన ఆధ్వర్యంలో పనిచేస్తున్నారని కూడా పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు ఆయన ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసించగా, మరికొందరు ఆయన చేసిన పోలికపై అనుమానాలు వ్యక్తం చేశాడు.

Also Read: నెలకు రూ.10 లక్షల వరకు జీతం.. ప్రపంచమంతా తిరిగిరావొచ్చు.. ఇంటర్మీడియట్ ఉంటే చాలు

మారుతున్న జాబ్ మార్కెట్

ఇటీవలి సంవత్సరాల్లో టెక్నాలజీ రంగంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. రిమోట్ వర్క్, ఫ్రీలాన్సింగ్, గ్లోబల్ కాంట్రాక్ట్ అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయి. అనేక సంస్థలు ఇప్పుడు డిగ్రీ కంటే నైపుణ్యాలు, ప్రాజెక్టులు, అనుభవానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే ప్రముఖ విద్యాసంస్థలు ఇప్పటికీ నాణ్యమైన విద్య, మంచి ప్లేస్‌మెంట్ అవకాశాలు, బలమైన అలుమ్ని నెట్‌వర్క్‌ను అందిస్తున్నాయి. అదే సమయంలో స్వయంగా నేర్చుకోవడం, వ్యాపారాలు ప్రారంభించడం, ఫ్రీలాన్సింగ్ వంటి ప్రత్యామ్నాయ కెరీర్ మార్గాలు కూడా వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి.

Also Read: బాయ్ ఫ్రెండ్ అద్దెకు లభించును.. కొత్త ట్రెండ్ బాస్.. గంటకు రెంట్ ఎంతంటే?

గమనిక : ఈ కథనం సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఆధారంగా రూపొందించబడింది. ఇందులో పేర్కొన్న ఆదాయం, వివరాలు స్వతంత్రంగా ధృవీకరించబడలేదు. ప్రతి వ్యక్తి కెరీర్ ప్రయాణం భిన్నంగా ఉంటుంది. విజయాన్ని నిర్ణయించేది కాలేజీ పేరు మాత్రమే కాదు. నైపుణ్యాలు, కృషి, అనుభవం, అవకాశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.

Tags

Related News

బ్యాంక్ ఎఫ్‌డీల కన్నా ఎక్కువ లాభం కావాలా? రిస్క్ లేకుండా అధిక వడ్డీ ఇచ్చే ప్రభుత్వ పథకాలు ఇవే!

5thలో 48% మార్కులు.. తండ్రి షాపులో సమోసాల విక్రయం.. కట్ చేస్తే ఐఐటీ టాపర్, దుబాయిలో ఏఐ లీడ్!

2026 సంవత్సరం ముగియనుంది.. సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా? త్వరగా పెంచుకోవడానికి ఇవి చేయండి

దీపావళి గిఫ్ట్స్ అదుర్స్.. నెటిజన్స్ ఫిదా.. ఇలాంటి కంపెనీలో జాబ్ రావాలి సామీ!

SBI ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ పథకాల్లో డిపాజిట్ చేస్తే.. ప్రతినెలా ‘జీతం’ గ్యారెంటీ!

రూ.3 లక్షల లోన్ కావాలా గ్యారెంటీ కూడా అవసరం లేదు.. కేంద్ర ప్రభుత్వ పథకం.. ఇలా అప్లై చేయండి

క్రిప్టో ప్రపంచంలో భారీ హ్యాకింగ్ కలకలం.. ఒక్క ల్యాప్‌టాప్‌తో వేల కోట్ల ముప్పు?

ఉద్యోగులకు కొత్త కంపెనీ బంపర్ ఆఫర్.. ఏ టైమ్‌లోనైనా పనిచేయండి, ఇష్టమొచ్చినప్పుడు సెలవులు

Big Stories

Advertisement
×