Paritala Ganesh Immersion Row:వినాయక నిమజ్జనం ‘రెండు కులాల మధ్య చిచ్చు పెట్టింది.వినాయకుడిని ఏ వీధి నుండి తరలించాలి అన్న విషయం బీసీ, ఎస్సీ కులాల మధ్య గొడవకి దారి తీసింది.విషయంలోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల దగ్గరి పరిటాల గ్రామంలో వినాయకుడిని ప్రధాన మార్గంలో ఊరేగించాలని ఉత్సవ కమిటీ సభ్యులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
అయితే శాంతిభద్రతలు, ట్రాఫిక్ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు వేరే మార్గం లో తీసుకెళ్లాలని చెప్పారట. ముఖ్యంగా ఎస్సీ కాలనీ వైపు కాకుండా బీసీ కాలనీ మీదుగా ఊరేగింపు తీసుకెళ్లాలని పోలీసులు సూచించారని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో హిందూ సంఘాల ప్రతినిధులు ఈ విషయం పై తమ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ముందుగా అనుకున్నట్టుగా ,ఎప్పుడు తీసికెళ్ళే దారిలోనే గణేష్ ఊరేగింపు జరగాలని వారు పట్టుబట్టారు. పోలీసుల సూచనను అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ కంచికచర్ల పోలీస్‌స్టేషన్ ఎదుట రోడ్డుపై ధర్నాకి దిగారు .దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఇక పోలీసుల ప్రవర్తనతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆందోళనకారులు ఆరోపించారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను పోలీసులు బెదిరించారని కూడా వారు ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసులు ఏమంటారో చూడాలి.
ఇక ఆందోళనకారులతో నందిగామ రూరల్ సీఐ వైవీవీఎల్ నాయుడు చర్చలు జరిపినట్టు తెలుస్తుంది . సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నించినప్పటికీ, ప్రధాన మార్గంలోనే ఊరేగింపు వెళ్లాలన్న డిమాండ్‌పై ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదని సమాచారం. మరోవైపు ఏసీపీ చలసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూడా పరిస్థితిపై సమీక్ష జరిగిందని తెలుస్తుంది ..
చర్చలు జరిగినప్పటికీ వెంటనే పరిష్కారం రాకపోవడంతో పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన కొనసాగింది. ప్రధాన రహదారిపై గణేష్ విగ్రహాన్ని ఊరేగిస్తామని, మార్గాన్ని మార్చే ప్రసక్తి లేదని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నట్లు సమాచారం.
వినాయక చవితి ఉత్సవాల సమయంలో ఊరేగింపు మార్గాలు, ట్రాఫిక్, భద్రత అంశాలపై పోలీసులు ముందస్తుగా కొన్ని రూల్స్ పెట్టడం కామన్ .అలా ఈ ఏడాది కూడా గణేష్ మండపాలు, నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో పోలీసులు నిర్వాహకులతో సమన్వయం చేస్తూ భద్రతా చర్యలు చేపడుతున్నారు. మండపాల నిర్వహణ, ఊరేగింపులు, నిమజ్జనాల కోసం ముందస్తు ఏర్పాట్లపై పోలీసు అధికారులు సూచనలు చేస్తున్నారు కూడా.ప్రస్తుతం పోలీస్‌స్టేషన్ ఎదుట కొనసాగుతున్న ఆందోళనతో పరిటాల ఘటన స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది.
ALSO READ: చంద్రబాబు సభపై అమర్నాథ్ సెటైర్లు.. విశాఖలో అసలు సమస్య ఇదేనంటూ ఫైర్!