Jawaharnagar Accident:హైదరాబాద్ శివార్లలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వంపుగూడ ఎల్లారెడ్డిగూడెం వద్ద జరిగిన ప్రమాదంలో యాక్టివాపై వెళ్తున్న ఇద్దరు యువతీ యువకులు ప్రాణాలు కోల్పోయారు. టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తీరు స్థానికులను షాక్ లోకి నెట్టేసింది .
ఎల్లారెడ్డిగూడెం ప్రాంతంలోకి చేరుకోగానే
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దీప్సిక (19), అమర్దొయ (15) యాక్టివా వాహనంపై వెళ్తున్నారు. వినాయక మండపం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో వంపుగూడ ఎల్లారెడ్డిగూడెం ప్రాంతంలోకి చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన టిప్పర్ లారీ వారి వాహనాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. టిప్పర్ ఢీకొనడంతో యాక్టివా అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.
అక్కడికక్కడే మృతి
ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో దీప్సిక, అమర్దొయ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో రోడ్డుపై ఉన్నవారు షాక్‌కు గురయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో జవహర్‌నగర్ పోలీసులు యాక్సిడెంట్ అయిన ప్రాంతానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు.
తర్వాత మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగింది? టిప్పర్ డ్రైవర్ తప్పు ఏమైనా కారణమా? వాహనాల వేగం ఎంత ఉంది? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
అక్కడి వాతావరణం ఒక్కసారిగా విషాదం
ఇదిలా ఉంటే.. యాక్టివాపై వెళ్తున్న యువతీ యువకులను టిప్పర్ ఢీకొట్టడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకోవడం స్థానికులను కలచివేసింది. కాసేపటి క్రితం వరకు ఆనందంగా ఉన్న ప్రాంతంలోనే ప్రమాదం జరగడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా విషాదంగా మారింది.
als0 read:ఊరేగింపు రూట్ మార్చాలన్న పోలీసులు.. భగ్గుమన్న హిందూ సంఘాలు!
ఏది ఏమైనా పండుగ పూట సరదాగా బయటకు వెళ్లిన ఇద్దరు యువ ప్రాణాలు రోడ్డు ప్రమాదంలో బలైపోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది.అలాగే . కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగిల్చిన ఈ ఘటన మరోసారి రోడ్డు భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. రోడ్డుపై ఒక్క చిన్న నిర్లక్ష్యం కూడా ఎంతటి విషాదానికి దారితీస్తుందో ఈ ఘటన తెలియజేస్తోంది.