Big Stories

Mysore Maharaja Wadiyar: లెక్కల్లో మాంచి దిట్ట.. కారు, ఇల్లు లేని యువరాజు

Mysore Maharaja Yaduveer Wadiyar does not own house car or land filed nominations

- Advertisement -

Mysore Maharaja Wadiyar: లోక్‌సభ ఎన్నికల వేళ పోటీ చేసే అభ్యర్థుల జాతకాలు బయటపడతాయి. ఇల్లు లేదని ఒకరు.. కారు లేదని మరొకరు ఇలా రకరకాలుగా తమ అఫిడవిట్‌లో ప్రస్తావిస్తారు. కానీ మైసూర్ మహారాజ కుటుంబానికి చెందిన యువరాజు ఒడియార్‌కు కారు గానీ ఇల్లు గానీ లేదు. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా ముమ్మాటికీ నిజం.

- Advertisement -

మైసూర్ రాజకుటుంబానికి చెందిన యువరాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడియార్. తొలిసారి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున ఆయన పోటీ చేస్తున్నారు. మైసూర్-కొడగు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. సోమవారం తన నామినేషన్లు దాఖలు చేశారు ఒడియార్. అఫిడవిట్‌లో యువరాజు కీలక విషయాలు వెల్లడించారు. మొత్తం ఆస్తుల విలువ నాలుగు కోట్ల 99 లక్షల రూపాయలుగా ప్రకటించారు.

ఆస్తులు, అప్పుల వివరాలను అందులో పేర్కొన్నారు. భార్య త్రిషిక కుమారీ ఒడియార్‌కు కోటి నాలుగు లక్షలు, వారి సంతానం పేరి మూడు కోట్ల 64 లక్షల విలువైన ఆస్తున్నట్లు ప్రస్తావించారు. చివరకు కారుగానీ ఇల్లుగానీ భూములుకానీ లేవని తెలిపారు.

మైసూర్ రాజకుటుంబానికి చెందిన చివరి మహారాజు జయచామ రాజేంద్ర ఒడియార్ పెద్ద కుమార్తె గాయిత్రీదేవి మనవడు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడియార్. ఈ యువరాజు మసాచుసెట్స్ యూనివర్సిటీలో ఎనకామిక్స్ చదివారు. గిటార్, వీణలో కాస్త ప్రావీణ్యం ఉంది.

ALSO READ: విస్తారాకు ఏమైంది.. చుట్టిముట్టిన సమస్యలు.. ఒకేసారి..!

దుంగార్‌పూర్ రాజకుటుంబానికి చెందిన త్రిషికా కుమారి మ్యారేజ్ చేసుకున్నారు. త్రిషిక తండ్రి హర్షవర్థన్‌సింగ్ బీజేపీ ఎంపీ కూడా. మైసూర్ రాజకుటుంబానికి రాజకీయాలు కొత్తేమీకాదు. శ్రీకంటదత్త నరసింహరాజ ఒడియార్ మైసూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు పోటీ చేశారు. ఈయన ఎక్కువగా కాంగ్రెస్‌లో ఉన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News