BigTV English

Gold In Odisha: ఒడిషాకు ‘బంగారు’ పంట.. నాలుగైదు జిల్లాల్లో బంగారం గనులు

Gold In Odisha: ఒడిషాకు ‘బంగారు’ పంట..  నాలుగైదు జిల్లాల్లో బంగారం గనులు


Gold In Odisha: దేశంలో ఈ మధ్యకాలంలో ఖనిజాల కోసం అన్వేషణ జరుగుతోంది. రకరకాల ప్రాంతాల్లో రకరకాల ఖనిజాలు బయటపడుతున్నాయి. తాజాగా ఒడిషాలో నాలుగైదు జిల్లాల్లో బంగారు ఘనులు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చింది. దీనికోసం మరికొన్ని జిల్లాల్లో అన్వేషణ మొదలైంది. అదే జరిగితే కర్ణాటక స్థానంలో ఒడిషా పేరు మార్మోగనుంది.

దేశంలో ఖనిజాల కోసం అన్వేషణ జరుగుతోంది. ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో లిథియం నిల్వలు ఉన్నట్లు జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తించింది. రియాసి జిల్లాలో సలాల్‌-హైమనా ప్రాంతంలో దాదాపు ఆరు మిలియన్‌ టన్నుల వరకు నిక్షేపాలను పేర్కొంది. దానితో ముడిపడి ఉన్న రంగాలకు బూస్ట్ లాంటింది. 


దేశంలో బంగారం గనులు పేరు చెప్పగానే కర్ణాటకలో కోలార్ ప్రాంతం గుర్తుకొస్తుంది. ఆ గనుల ద్వారానే ఆ ప్రాంతం అంత ఫేమస్ అయ్యింది. ఆ గనులపై సినిమాలు వచ్చాయి. ఈ గనులను తెరిపించాలని మోదీ సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒడిషాలో భారీ ఎత్తున బంగారు నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది.

ప్రస్తుతం నాలుగు జిల్లాలో వాటిని గుర్తించిందని, దాదాపు 20 మెట్రిక్ టన్నుల వరకు ఉండవచ్చని అంచనా వేసింది. మరో నాలుగు జిల్లాల్లో వాటి కోసం అన్వేషన్ కంటిన్యూ అవుతోంది. ఈ వార్త దేశానికి శుభవార్త మాత్రమేకాదు.. జాక్‌పాట్ లాంటింది కూడా.

ALSO READ: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్

ఒడిశాలో బంగారం గనులు ఎక్కడ బయటపడ్డాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం డియోగఢ్ (అదాస-రాంపల్లి), సుందర్‌గఢ్, నబరంగ్‌పూర్, కియోంఝర్, అంగుల్, కోరాపుట్ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో ఆయా నిక్షేపాలను గుర్తించింది జీఎస్ఐ. మయూర్‌ భంజ్, మల్కాన్‌గిరి, సంబల్‌పూర్, బౌధ్ వంటి ప్రదేశాలలో ఆయా గనుల కోసం అన్వేషణ జరుగుతోందని సమాచారం.

ఒడిశా ప్రభుత్వం.. OMCGSI లతో కలిసి కొత్త బంగారు గనులను గుర్తించేందుకు ప్రణాళికలను వేగవంతం చేస్తోందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తొలుత దేవ్‌ఘర్‌లోని మొదటి బంగారు మైనింగ్ బ్లాక్‌ను వేలం వేయడానికి సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది.

బంగారు నిల్వల వాస్తవ విలువను అంచనా వేయనప్పటికీ, ఈ నిల్వలు 10 నుండి 20 మెట్రిక్ టన్నుల మధ్య ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.  గనుల విషయాన్ని మార్చి‌లో గనుల మంత్రి బిభూతి భూషణ్ జెనా ఒడిశా అసెంబ్లీలో ఓ ప్రకటన చేశారు కూడా. భారతదేశం బంగారం దిగుమతి పరిమాణాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ.

గతేడాది భారతదేశం దాదాపు 700–800 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుందని నివేదికలు చెబుతున్నాయి. దేశీయంగా బంగారు ఉత్పత్తి చాలా తక్కువ. ఇలాంటి సమయంలో ఒడిశాలో బంగారు నిల్వలు కనుగొనడం దేశ ఆర్థిక వ్యవస్థ, ఒడిశాకు గేమ్‌ఛేంజర్‌గా మార్చవచ్చని అంటున్నారు.

అన్నట్లు ఆ మధ్య ఏపీలో కొన్ని ప్రాంతాల్లో బంగారం గనులను జీఎస్ఐ గుర్తించింది కూడా. ఇప్పుడు ఒడిషా వంతైంది. రాబోయే ఇంకా ఏయే రాష్ట్రాల్లో ఆ తరహా ఖనిజాలు బయటపడతాయో చూడాలి. 

Related News

Cloud Burst: అసలు క్లౌడ్ బరస్ట్ ఏంటి..? దీనికి గల కారణాలేంటి..?

CP Radhakrishnan: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్

Rahul Gandhi: ఎలక్షన్ కమిషన్‌పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు.. సీఈసీ ఫైర్

National Highway: రూ.11వేల కోట్లతో నేషనల్ హైవే.. 20 నిమిషాల్లోనే ఎయిర్ పోర్టుకు..!

Rare disease: హడలెత్తిస్తున్న అరుదైన వ్యాధి.. పాపం చిన్నారి మృతి.. బీ అలర్ట్!

Big Stories

×