Actor Suman: సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి ఎంత మంచి అవినాభావ సంబంధం ఉంది సినిమా ఇండస్ట్రీలో(Film Industry) నటినటులుగా కొనసాగిన వారు మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకొని అనంతరం రాజకీయాలలోకి వెళ్తున్నారు. అలా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్న సెలబ్రిటీలు రాజకీయాలలో ఉన్నత పదవులను అధిరోహించిన సంగతి తెలిసిందే. ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎంతోమంది సెలబ్రిటీలు రాజకీయాలలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. ఇక ఈయనని స్ఫూర్తిగా తీసుకొని మరి కొంతమంది రాజకీయాలలోకి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.
రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వనున్న సుమన్..
ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటుడు సుమన్ (Suman)ఒకరు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో చిరంజీవికి గట్టి పోటీ ఇస్తూ సినిమాలు చేసిన ఈయన కొన్ని కారణాలవల్ల అవకాశాలను పూర్తిగా కోల్పోయారు.అయితే హీరోగా కాకుండా సపోర్టింగ్ పాత్రలలో పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్న ఈయన పలు కార్యక్రమాలకు హాజరవుతూ సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు.
2029 ఎన్నికల్లో పోటీ…
ఇకపోతే ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజకీయాల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం తమిళనాడులో కొంతమంది తనని రాజకీయాలలోకి ఆహ్వానిస్తున్నారని తెలిపారు. ఇక 2029 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికలలో మాత్రం తాను కచ్చితంగా పోటీ చేస్తానని వెల్లడించారు.అయితే తాజాగా మరోసారి రాజకీయాల గురించి ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాజాగా సుమన్ ఎన్టీఆర్ జిల్లా, తిరువూరులో స్వాతంత్ర్య సమరయోధులు స్వరాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు.
భగవంతుడి దయ ఉంటే…
ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం అనంతరం సుమన్ రాజకీయాల గురించి సినిమాల గురించి ఎన్నో విషయాలను తెలియచేశారు. అయితే సినిమాలు వేరు, రాజకీయాలు వేరని తెలియజేశారు . దైవ సంకల్పంతో తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన స్వయంకృషితో సుమారు 800 సినిమాలలో నటించానని తెలిపారు. అయితే రాజకీయాలలోకి కూడా రావాలని భావిస్తున్నానని ఆ భగవంతుడి దయ ఉంటే కచ్చితంగా రాజకీయాలలోకి వస్తానని సుమన్ ఈ సందర్భంగా పొలిటికల్ ఎంట్రీ(Political Entry) గురించి మాట్లాడారు. ఇలా ఈయన 2029 ఎన్నికలలో పోటీ చేస్తానని చెప్పడంతో ఏ పార్టీ తరపున ఎన్నికలలో పోటీ చేయబోతున్నారనే విషయాల గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇక పలు సందర్భాలలో ఈయన రాజకీయ అంశాల గురించి మాట్లాడినప్పటికీ , ఏ పార్టీలోకి వెళ్తారనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. 2029 లో సుమన్ ఏ పార్టీ తరపున పోటీ చేస్తారో తెలియాల్సి ఉంది.
Also Read: HHVM OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన హరిహర వీరమల్లు… ఎప్పుడు? ఎక్కడంటే?