Ram Pothineni: సెలబ్రిటీలకు సంబంధించిన కొన్ని గాసిప్స్ విపరీతంగా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా చాలామంది సెలబ్రిటీలు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా పడుతుంటారు. కానీ ఇంకొంతమంది ఈజీగా దొరికేస్తారు. లావణ్య త్రిపాటి, వరుణ్ తేజ్ పెళ్లి చేసుకుంటారని వార్త ఎంగేజ్మెంట్ వరకు కూడా పెద్దగా బయటకు రాలేదు. అంత పగడ్బందీగా వాళ్ళు రిలేషన్ మెయింటైన్ చేశారు. మరోవైపు బయటకు చెప్పట్లేదు కానీ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రష్మిక మందన్న చాలాసార్లు ఇన్ డైరెక్ట్ గా దొరికారు.
ఇక ప్రస్తుతం వీళ్ళు పెళ్లి చేసుకుంటారు అని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో మరో కొత్త జంట మొదలైంది. రామ్ పోతినేని, భాగ్యశ్రీ వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం వీరిద్దరూ కలిసి మహేష్ బాబు దర్శకత్వంలో ఆంధ్ర కింగ్ తాలుక అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ పోతినేని పాటను కూడా రాశాడు.
అడ్డంగా దొరికేశారు
చాలామంది సెలబ్రిటీలను సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలో అవుతుంటారు కొంతమంది అభిమానులు. అయితే వాళ్లు పెట్టే పోస్ట్ బట్టి కూడా చాలా విషయాలను ఈజీగా అర్థమయిపోతాయి. ఇక భాగ్యశ్రీ రీసెంట్ గా ఇంస్టాగ్రామ్ వేదికగా పిజ్జా గురించి ఒక పోస్ట్ పెట్టింది. యాదృచ్ఛికంగా రామ్ పోతినేని కూడా పిజ్జా గురించి పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ రెండు ఫోటోలను అటాచ్ చేసి సోషల్ మీడియాలో అడ్డంగా దొరికేశారు అంటూ పోస్టులు వేయడం మొదలుపెట్టారు. చాలామంది సెలబ్రిటీ కపుల్స్ లా వీళ్లు విషయాన్ని సాగదీస్తారో, లేదంటే ఉన్నది ఉన్నట్లు చెబుతారు వేచి చూడాలి.
ఆ ఫీల్ తోనే రాశాడు
రామ్ పోతినేని పాటను రాస్తున్నాడు అన్నప్పుడు అందరికీ ఒక రకమైన క్యూరియాసిటీ మొదలైంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పాటలు రాసిన హీరోలు చాలా తక్కువ మంది. అలానే సాహిత్యం మీద రామ్ పోతినేనికి ఎంత అవగాహన ఉందో ఆ పాట తర్వాత అర్థమైంది. గతంలో కూడా బ్రోచేవారెవరురా సినిమా ఈవెంట్ కి వచ్చినప్పుడు రామజోగయ్య శాస్త్రి (Ramajogayya sastry ) తన సినిమాలో రాసిన పాటను కూడా గుర్తు చేశారు. అయితే పాటలో అంత అద్భుతమైన ఫీల్ వచ్చేలా రాయడానికి కారణం తను పర్సనల్ గా లవ్ లో ఉండడమే అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అనిరుద్ పాడిన ఈ పాట మాత్రం విపరీతంగా ఆకట్టుతుంది. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయి.
Also Read: Dharma Mahesh: భార్యను వేధిస్తున్న డ్రింకర్ హీరో, సినిమా అనుకున్నాడా?