BigTV English

Vistara flights cancelled: విస్తారాకు ఏమైంది.. చుట్టిముట్టిన సమస్యలు.. ఒకేసారి..!

Vistara flights cancelled: విస్తారాకు ఏమైంది.. చుట్టిముట్టిన సమస్యలు..  ఒకేసారి..!

Vistara flight cancellations


Vistara flights cancelled(Today’s news in telugu): పైలట్ల కొరత విస్తారా ఎయిర్‌లైన్స్‌ను వెంటాడుతోంది. దీని ఫలితంగా దాదాపు 50 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. మరో 160 సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ కారణంగా ప్రయాణికులు ఆ సంస్థపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

విస్తారా ఎయిర్‌లైన్స్ సంస్థకు సమస్యలు వెంటాడుతున్నాయి. ఎయిరిండియాలో విలీనానికి ముందు జీతాల విధానాన్ని సవరించాలన్నది పైలెట్ల ప్రధాన డిమాండ్. దీని ఫలితంగా సోమవారం 50 విమానాలను ఆ సంస్థ రద్దు చేసుకుంది. దీంతో మంగళవారం నాటికి ఈ సమస్య మరింత జఠిలమైంది. పైలెట్లు అందుబాటులో లేకపోవడంతో దాదాపు 70కి పైగానే సర్వీసులను రద్దు చేసినట్టు సమాచారం. ముంబై, ఢిల్లీ, బెంగళూరు నుంచి బయలుదేరాల్సిన సర్వీసులను రద్దు చేసింది. మరో 160 సర్వీసులు ఆలస్యంగా నడుతుస్తున్నాయి.


ఈ వ్యవహారంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమానాలు క్యాన్సిల్, ఆలస్యంగా రావడంపై  ఆ సంస్థ సరైన సమాచారం ఇవ్వలేదని మండిపడుతున్నారు. ప్రయాణికుల ఆందోళనతో విస్తారా రియాక్టయ్యింది. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించింది.

Tags

Related News

Aadhar – Pan Cards: ఆధార్, పాన్, ఓటర్ ఐడీ.. దానికి పనికి రావు

Minta Devi Bihar: పార్లమెంట్ లో రచ్చరేగిన..124 ఏళ్ల ఓటరు ఎక్కడ?.. ఆమె మాట ఇదే!

Justice Yashwant Varma: జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు.. స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం

Stray Dogs: వీధి కుక్కలు కనిపించకూడదన్న సుప్రీంకోర్టు.. రంగంలోకి అధికారులు, మండిపడ్డ పెటా

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Big Stories

×