BigTV English

Rajinikanth: ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు? రజనీ ను చూసి నేర్చుకోండి – సజ్జనర్

Rajinikanth: ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు? రజనీ ను చూసి నేర్చుకోండి – సజ్జనర్

Rajinikanth: మామూలుగా సినిమా హీరోలను ప్రేక్షకులు ఎంతగా అభిమానిస్తారో మనకు తెలిసిందే. మరి కొంతమంది అభిమానాన్ని దాటి ఆదరించడం మొదలుపెడతారు. అలానే తమ హీరోలా ఉండాలి అని ఇమిటేట్ కూడా కొంతమంది చేస్తుంటారు. ఆ హీరో వేసుకునే బట్టలు, ఆ స్టైల్ మెయింటైన్ చేయడానికి కొంతమంది ఉత్సాహం చూపిస్తుంటారు.


అందుకే చాలామంది సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా తమ ఫేవరెట్ హీరో ఒక బ్రాండ్ ప్రమోట్ చేశాడు అంటే ఆ వస్తువుని కొనడానికి అభిమానులు ముందంజలో ఉంటారు. అలానే ఏదైనా ఫుడ్, కూల్ డ్రింక్ కు సంబంధించి ప్రమోట్ చేసిన కూడా అభిమానులు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అయితే కొంతమంది హీరోలు మాత్రం బ్రాండ్ ప్రమోషన్స్ కి దూరంగా ఉంటారు. ముఖ్యంగా డబ్బులు కోసం ఏ పని పడితే ఆ పని చేయరు.

రజనీకాంత్ ఆ పని చేయలేదు 


ఇప్పటివరకు రజనీకాంత్ ఏ వాణిజ్య ప్రకటన కూడా చేయలేదు. తను కోరినంత డబ్బులు ఇచ్చినవాళ్లు ఉన్నా కూడా సున్నితంగా తిరస్కరించారు. రజనీకాంత్ మీద గౌరవం పెరగడానికి ఇది కూడా ఒక మెయిన్ రీజన్. గతంలో రజనీకాంత్ మాట్లాడుతూ అభిమానులు నేను ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేస్తారు. ఆ తర్వాత వాటి లోటుపాట్లకు నేను బాధ్యుడిని అవుతాను. కాబట్టి ఆ సంపాదన నాకొద్దు. అయితే సినిమాల్లోనే జీవితానికి పనికొచ్చే సత్యాలు చెప్పడం మాత్రమే కాకుండా, సినిమా బయట కూడా ఆ స్థాయిలో ఆలోచించడం అనేది మామూలు విషయం కాదు. రజనీకాంత్ 50 సంవత్సరాల జర్నీ పూర్తి చేసుకున్న సందర్భంగా. సజ్జనర్ ఐపీఎస్ ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. ట్విట్టర్ వేదికగా తలైవాకు ప్రశంసలు తెలిపారు.

‘రియల్ సూపర్ స్టార్’ రజనీకాంత్ 

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటూ కొందరు సెలబ్రెటీలు డబ్బు కోసం ఎలాంటి యాడ్స్ చేయడానికైనా వెనుకాడటం లేదు. కాసులకు కక్కుర్తి పడుతూ బెట్టింగ్ యాప్స్, మోసపూరిత గొలుసుకట్టు కంపెనీలతో పాటు సమాజానికి తీవ్రంగా హాని చేసే అనేక సంస్థలను ప్రమోట్ చేస్తున్నారు. ఎంతో మంది జీవితాలను చేజేతులా నాశనం చేస్తున్నారు.

కానీ, 50 ఏళ్ల మీ సినీ జీవితంలో మీరు ఎలాంటి వాణిజ్య ప్రకటనలు చేయకపోవడం గొప్ప విషయం. మిమ్మల్ని అభిమానించే వారిని మోసం చేయొద్దనే ఉద్దేశంతో మీరు తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం.

మాకు డబ్బే ముఖ్యం, సమాజం ఎటు పోయిన మాకేంటి అనుకునే ప్రస్తుత సెలబ్రిటీలు రజిని గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. బెట్టింగ్ యాప్స్, మోసపూరిత మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలతో పాటు సమాజాన్ని చిద్రం చేసే సంస్థల ప్రమోషన్లకు దూరంగా ఉండాలి. సమాజ శ్రేయస్సుకు పాటుపడాలి.

అంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు.

Related News

War 2 – Ntr: ఎన్టీఆర్ కి ఘోర అవమానం, ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు

Actor Suman: ఆయన దయతోనే రాజకీయాలలోకి వస్తా.. క్లారిటీ ఇచ్చిన సుమన్!

Ram Pothineni: అడ్డంగా దొరికిపోయిన రామ్ పోతినేని, భాగ్యశ్రీ , జాగ్రత్తలు తీసుకోవాలి

Dharma Mahesh: భార్యను వేధిస్తున్న డ్రింకర్ హీరో, సినిమా అనుకున్నాడా?

Naga Vamsi: అప్పుడు ముంబై నిద్రపోలేదు, ఇప్పుడు నువ్వు పడుకుంటున్నావా అన్న?

Big Stories

×