BigTV English

GST: కొత్త జీఎస్‌టీ ఎఫెక్ట్.. వీటి ధరలు బాగా తగ్గుతాయట.. అవి మాత్రం కాస్ట్లీనే!

GST: కొత్త జీఎస్‌టీ ఎఫెక్ట్.. వీటి ధరలు బాగా తగ్గుతాయట.. అవి మాత్రం కాస్ట్లీనే!

జీఎస్టీ పన్ను విధింపు విధానంలో భారత ప్రభుత్వం కీలక మార్పులు చేస్తోంది. గతంలో ఉన్న జాబితాలలో మార్పులు చోటు చేసుకోడానికి ఆస్కారం ఉంది. ఒకరకంగా జీఎస్టీ మార్పు వల్ల చాలా రకాల వస్తువుల రేట్లు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో కొన్ని వస్తువుల రేట్లు మాత్రం అమాంతం పెరిగిపోతాయి. ఇంతకీ వేటి రేట్లు తగ్గే అవకాశం ఉంది, వేటి రేట్లు పెరిగేందుకు ఛాన్స్ ఉంది.


ఇప్పటి వరకు 12 శాతం జీఎస్టీ పరిధిలోకి వచ్చే వస్తువుల్లో కొన్నింటిని 5 శాతం జీఎస్టీ శ్లాబ్ లోకి మారుస్తున్నారు. 28 శాతం జీఎస్టీ పరిధిలో ఉన్న వాటిని కొత్తగా 18 శాతం పరిధిలోకి తెస్తున్నారు. అంటే జీఎస్టీ శాతం తగ్గితే కచ్చితంగా పన్ను బాదుడు తగ్గుతుంది, అంటే బహిరంగ మార్కెట్ లో దాని రేటు కూడా తగ్గుతుందని స్ఫష్టమైంది. ఇప్పటి వరకు 28శాతం జీఎస్టీ పరిధిలోకి వచ్చిన వస్తువుల్లో దాదాపు 90శాతం వాటికి పన్నుభారం భారీగా తగ్గబోతోంది. వాటికి ఇకపై కేవలం 18శాతం మాత్రమే జీఎస్టీ విధిస్తారు. ఇక పొగాకు ఉత్పత్తులపై అదనపు పన్ను బాదుడు మొదలు కాబోతోంది. వీటిపై 40శాతం అదనపు పన్నులు ఉంటాయి. ఈ జాబితాలో పొగాకు ఉత్పత్తులతోపాటు గరిష్టంగా మరో ఏడు వస్తువులు మాత్రమే ఉండే అవకాశం ఉంది. వజ్రాలు, విలువైన రాళ్ళతో చేసిన వస్తువుల విషయంలో రేట్ల మార్పు ఉండదని తెలుస్తోంది. ఇక జీఎస్టీ లేకుండా కూడా కొన్ని వస్తువులు ఉన్నాయి. వాటిని జీఎస్టీ పరిధిలోకి ఇప్పుడల్లా తీసుకొచ్చేలా లేరు. పెట్రోలియం ఉత్పత్తులు GST ఫ్రేమ్‌వర్క్ వెలుపలే కొనసాగుతాని ప్రభుత్వం స్పష్టం చేసింది.

చౌకగా మారేవి..
రోజువారీ వినియోగ వస్తువులు చౌకగా మారతాయనే అంచనాలున్నాయి. అయితే ఏవేవి ఎంత చౌకగా లభిస్తాయనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేం. టూత్‌పేస్ట్ లు, గొడుగులు, కుట్టు మిషన్లు, ప్రెజర్ కుక్కర్లు, చిన్నపాటి వాషింగ్ మెషీన్లు వంటి గృహోపకరణాలు కేవలం 5 శాతం జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. సైకిళ్ళు, రెడీమేడ్ దుస్తులు, చెప్పులు, వ్యవసాయ పనిముట్లు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, హెయిర్ ఆయిల్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, జ్యామెట్రీ బాక్స్ లు, నోట్‌బుక్‌లు వంటి పిల్లల స్టేషనరీ వస్తువులు కూడా కాస్త అందుబాటులోకి వస్తాయి.


టీవీలు, ఏసీలు, ఫ్రిజ్ లు, వాషింగ్ మెషీన్లు, నిర్మాణ పరిశ్రమలో ఉపయోగించే రెడీ-మిక్స్ కాంక్రీట్, సిమెంట్ వంటి కొన్ని వస్తువులు కొత్త 18 శాతం GST జాబితాలో చేరతాయి. వాహనాలు ఇంజిన్ సామర్థ్యం, పొడవు ఆధారంగా కార్లు, బైక్ లు 28 శాతం GSTతో లభిస్తాయి. 22 శాతం వరకు పరిహార సెస్సును కూడా వీటిపై విధిస్తారు. ఎలక్ట్రిక్ కార్లపై మాత్రం 5 శాతం పన్ను విధిస్తారు, దీనికి పరిహార సెస్సు లేదు. బైక్ లకు 28 శాతం జీఎస్టీ కట్టాల్సిందే.

మొత్తమ్మీద చౌకగా మారే వస్తువులు ఎక్కువగా నిత్యావసరాలలోనే ఉన్నాయి. ఇక కాస్ట్ లీ గా మారేవి కూడా కొన్నిసార్లు నిత్యావసరాల్లో కలిసే అవకాశముంది. మోదీ మాత్రం కొత్త జీఎస్టీతో వినియోగదారులకు ఊరట కలిగించాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు వాతలు పెట్టడమే అలవాటు అయిన మోదీ, ఊరటనిస్తారా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.

Related News

Mugdha 2.0: కూకట్ పల్లిలో సరికొత్తగా ముగ్ధా 2.0.. ప్రారంభించిన ఓజీ బ్యూటీ ప్రియాంక మోహనన్!

Diwali Offers: దీపావళి రీఛార్జ్ ఆఫర్లు తెలుసా?.. బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్‌టెల్, వీఐ స్పెషల్ ప్లాన్స్ ఇవే!

Amazon Offers: అమెజాన్ షాపింగ్ పై 10% అదనపు క్యాష్‌బ్యాక్ .. సిఎస్‌బి బ్యాంక్ కొత్త ఆఫర్!

Cheque Clearance: ఇకపై గంటల్లోనే చెక్ క్లియరెన్స్.. ఇవాళ్టి నుంచి కొత్త రూల్ అమలు!

2 Thousand Note: మీ దగ్గర ఇంకా రూ.2వేల నోట్లు ఉన్నాయా? ఈ వార్త మీకోసమే

Recharge plan: Vi మెగా మాన్సూన్ సర్‌ప్రైజ్ ఆఫర్.. రీచార్జ్ ప్లాన్‌పై భారీ డిస్కౌంట్

Diwali offers 2025: దీపావళి షాపింగ్ బోనాంజా.. మొబైల్స్, డేటా ప్లాన్లు, క్యాష్‌బ్యాక్‌ల వరద

Airtel Offers: ఎయిర్‌టెల్ వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్‌.. కేవలం రూ.155కే అపరిమిత కాల్స్! కానీ..

Big Stories

×