ఇటీవల యూకేలో చాలా స్కూళ్ల యాజమాన్యాలు మారిపోయాయి. యూకే స్థానికులే స్కూల్ పెట్టేవారు, వాటిని నిర్వహించేవారు. కానీ ఇటీవల స్కూళ్లకు సంబంధించి ఆకర్షణీయమైన ఆఫర్లు రావడంతో కొనేవారు ఎవరు, వారి అవసరమం ఏంటి? అసలు ఎక్కడ్నుంచి వచ్చారనేది తెలియకుండా యూకేలోని స్కూళ్లను అమ్మేస్తున్నాయి యాజమాన్యాలు. ఇటీవల కాలంలో ఇలాంటి స్కూల్ అమ్మకాలు చాలానే జరిగాయి. అయితే ఇక్కడే ఒక విశేషం ఉంది. అలా అమ్ముడవుతున్న స్కూళ్లన్నిటినీ చైనా కొనుక్కొంటోంది. చాలా తెలివిగా, వ్యూహత్మకంగా వీటిని చైనా సొంతం చేసుకుంటుండటం విశేషం.
ఎందుకిదంతా?
చైనా ఏ పని చేసినా చాలా పద్ధతిగా, ప్లాన్డ్ గా చేస్తుంది. విద్యాసంస్థల విషయంలో చైనా కొన్నాళ్లుగా యూకేని టార్గెట్ చేసిందనే విషయం వాస్తవం. ఎందుకంటే యూకేలోని పురాతన స్కూల్స్ అన్నీ ఇప్పుడు చైనా చేతిలోనే ఉన్నాయి. 1566లో స్థాపించబడి ఇప్పుడు చైనా ఫైనాన్షియల్ సర్వీసెస్ హోల్డింగ్స్ యాజమాన్యంలో ఉన్న థెట్‌ఫోర్డ్ గ్రామర్ స్కూల్ ఇందులో ఒకటి. 1379లో స్థాపించబడి యాక్సెస్ ఎడ్యుకేషన్ సంస్థ కొనుగోలు చేసిన విస్‌బెక్ గ్రామర్ స్కూల్ కూడా ఈ లిస్ట్ లో ఉంది. అబాట్స్ బ్రోమ్లీ, ఇప్స్ విచ్ హై స్కూల్‌తో సహా అనేక బాలికల పాఠశాలలు చైనా కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఇప్పుడు అబ్బాయిల స్కూల్స్ ని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. మాల్వెర్న్ సెయింట్ జేమ్స్ స్కూల్ ఇప్పటి వరకు కేవలం గర్ల్స్ కి మాత్రమే పరిమితమై ఉండేది. తాజాగా ఆ స్కూల్ లోకి కూడా అబ్బాయిలను అంగీకరిస్తామని చైనా కంపెనీ ప్రకటించింది,
కమ్యూనిస్ట్ భావజాల వ్యాప్తి..
యూకేలో స్కూళ్లను కొంటున్న చైనా.. యాజమాన్యాల మార్పిడి తర్వాత మెల్ల మెల్లగా వాటిల్లో మార్పులు మొదలు పెడుతోంది. తాజాగా ఓ స్కూల్ లో విద్యార్థులకు కమ్యూనిజం పాఠాలు మొదలు పెట్టారట. చైనాలో కమ్యూనిజం ఎలా విజయవంతమైంది, మిగతా చోట్ల ఎందుకు అంత పాపులర్ కాలేదు అనే పాఠాలు కూడా ఉన్నాయట. చైనా ప్రభుత్వం కమ్యూనిజం భావజాల వ్యాప్తికోసమే ఈ చర్య చేపట్టిందనే విమర్శలు మొదలయ్యాయి. అయితే చానా ఈ విషయాన్ని ధృవీకరిండంలేదు.
చైనా వర్సబెట్టి స్కూల్స్ ని కొనుగోలు చేస్తున్నా యూకే మాత్రం ఎలాంటి వ్యతిరేక నిర్ణయం తీసుకోలేదు. తమ పిల్లలపై చైనా యాజమాన్యాల అజమాయిషీ ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నా, ఆల్రడీ ఆ స్కూళ్లను చైనా కొనుగోలు చేయడం విశేషం. అయితే ఇప్పట్లో ఈ కొనుగోలు ఆపేలా లేదు చైనా ప్రభుత్వం. ముందు ముందు మరిన్ని స్కూళ్లను గొనుగోలు చేస్తామని చెబుతోంది చైనా. మరి యూకే ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటుందా అంటే అదీ లేదు. ఇప్పటికిప్పుడు తమకు వచ్చిన నష్టమేమీ లేదనుకుంటోంది యూకే. అయితే చైనా మాత్రం భారీ ముందు చూపుతో భావితరాలను దృష్టిలో పెట్టుకుని స్కూల్స్ ని కొనుగోలు చేస్తూ నిర్వహిస్తోంది. యాజమాన్యాల విషయంలో ఈ మార్పులకు ఎప్పటికి బ్రేక్ పడుతుందో చూడాలి. ఈ విషయంలో యూకే మేల్కొనే లోపు చైనా వల్ల ఆ దేశానికి, ఆ దేశ బాలలకు జరగరాని నష్టం జరుగుతుందేమో అని అంటున్నారు.