అలస్కాలో ట్రంప్, పుతిన్ భేటీ తర్వాత.. ట్రంప్ అనారోగ్య సమస్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ట్రంప్ మందు తాగిన వ్యక్తిలా ప్రవర్తించారని, కార్పెట్ పై ఆ మూల నుంచి ఈ మూలకు తూగుతూ నడిచాడని వీడియో సాక్ష్యాలను చూపించారు చాలామంది. అయితే అక్కడ ఫోకస్ అంతా ట్రంప్ పైనే ఉండటం విశేషం. ఇలాంటి సమయంలో అసలు ట్రంప్ ని కలిసింది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కాదని, ఆయన బాడీ డబుల్ అంటూ వస్తున్న వార్తలు సంచలనంగా మారాయి.
ఎందుకిలా..?
అమెరికా అధ్యక్షుడు సహా, ఇతర ప్రపంచ దేశాలకు చెందిన కొంతమంది కీలక నేతలకు బాడీ డబుల్ ఉండటం సర్వ సాధారణం. కొన్ని హాలీవుడ్ మూవీస్ లో కూడా ఇదే విషయాన్ని చూపిస్తుంటారు. ఎవరైనా దాడికి పాల్పడినా, ఇంకేదైనా చేసినా, అసలు వ్యక్తికి బదులు ఆయన తరపున బయటకు వచ్చే బాడీ డబుల్ కి నష్టం జరుగుతుంది. ఆల్రడీ ఆ కుటుంబానికి న్యాయం చేసి ఉంటారు కాబట్టి, ఎవరూ ఆ విషయాన్ని బయటకు చెప్పరు. అలా బాడీ డబుల్స్ అనేవారు అసలు నాయకుడి కోసం ప్రాణ త్యాగానికి సైతం వెరవరు అని అంటుంటారు. అయితే ఇప్పుడు అలస్కా మీటింగ్ కి పుతిన్ బాడీ డబుల్ ఎందుకొచ్చాడనేదే అసలు ప్రశ్న.
అనుమానం ఎలా వచ్చింది..?
సహజంగా పుతిన్ వ్యవహార శైలి ఇతర దేశాలకు చెందిన రాయబారులకు బాగా తెలుసు. అయితే అలస్కా వచ్చినప్పుడు ఆయనలో చాలా మార్పులు కనపడ్డాయని అంటున్నారు. ట్రంప్ ని కలసిన పుతిన్ ఎక్కువ ఉత్సాహంతో ఉన్నాడట. అతడి రూపు రేఖల్లో కూడా స్పష్టమైన మార్పులున్నాయ. ట్రంప్ ని కలసిన పుతిన్ చెంప ఎముకలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇదే విషయాన్ని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ వార్త వైరల్ గా మారింది. ట్రంప్ ని కలవని పుతున్ అంటూ హెడ్డింగ్స్ పెట్టేశారు. ట్రంప్ తో కలసి కనిపించినప్పుడు పుతిన్ ఎక్కువ ఉత్సాహంతో కనిపించారని, అది ఆయన సహజ లక్షణం కాదని చాలామంది అంటున్నారు.
కారణం ఏంటి?
పోనీ పుతిన్ తన డూపునే పంపారనుకుందాం, అయితే దానివల్ల వారికి ఒరిగే నష్టమేంటి? ప్రాణ హానీ ఉందనుకోడానికి కూడా వీలు లేదు. అయితే అప్పుడప్పుడు ఇలా బాడీ డబుల్స్ ఏదైనా కార్యక్రమాల్లో అసలు వారి తరపున పాల్గొంటుంటారు. ఎవరైనా గుర్తుపడతారా లేదా అనేది తేల్చుకోడానికే ఈ ప్రయత్నం చేస్తుంటారు. ఈసారి పుతిన్ కూడా అలాగే ట్రంప్ తో ప్రయోగం చేశారనేది కొందరి వాదన. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ, ఆ బాడీ డబుల్ పై విపరీతమైన జోకులు పేలుతున్నాయి. అతని నడక మారిందని, కుడిచేతిని పుతిన్ ఉపయోగించినట్టుగా డూపు పుతిన్ ఉపయెగించలేకపోయారని కూడా అంటున్నారు. సాధారణంగా పుతిన్ కి బుగ్గలు ఎత్తుగా ఉంటాయి, అతడు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. కానీ డూపు పుతిన్ కి బుగ్గల ఎముకలు కనపడుతున్నాయి. అతడు నవ్వు ఆపుకుంటున్నట్టుగా వీడియోలు, ఫొటోలలో కనపడ్డాడు. అందుకే అలస్కా వచ్చింది పుతిన్ బాడీ డబుల్ అని ముద్రవేశారు నెటిజన్లు.