Mega Job Mela: తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ఇది గోల్డెన్ ఛాన్స్. రేపు (ఆగస్టు 19) హైదరాబాద్, మలక్‌పేటలోని సిమ్లా గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక మెగా జాబ్ మేళా జరగనుంది. మెట్రో పిల్లర్ నంబర్ 1430 సమీపంలో ఈ ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని మన్నన్ ఖాన్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నారు. ఈ మెగా జాబ్ మేళాలో ఫార్మా, హెల్త్‌కేర్, ఐటీ, ఐటీఈఎస్, ఎడ్యుకేషణ్, బ్యాంకింగ్ వంటి వివిధ రంగాలకు చెందిన అనేక కంపెనీలు పాల్గొంటున్నాయి. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తున్నాయి.
ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు కనీస విద్యార్హత టెన్త్ క్లాస్ పాసై ఉంటే సరిపోతుంది. అభ్యర్థులు తమ బయోడేటా, రెండు సెట్ల ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, ఫోటోలతో రావాలని మెగా జాబ్ మేళా నిర్వాహకులు తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఇది అభ్యర్థులకు తమ నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశాన్ని అందిస్తుంది. ఈ జాబ్ మేళాకు ప్రవేశం పూర్తిగా ఉచితం, ఇది యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తుందని చెప్పవచ్చు.
ALSO READ: Biggest Gold Mines: దేశంలో బయటపడుతున్న బంగారు గనులు.. ఈ ప్రాంతాల్లో టన్నుల కొద్ది పసిడి నిక్షేపాలు..
మన్నన్ ఖాన్ ఇంజనీర్ గతంలో హైదరాబాద్‌లో 130కి పైగా జాబ్ మేళాలను నిర్వహించారు. ఈ మెగా జాబ్ మేళాలో 17,000 కంటే ఎక్కువ మందికి ఉద్యోగాలు అందజేశారు. ఈ మేళాలో కూడా అనేక కంపెనీలు ఆన్ ది స్పాట్ (వెంటనే) నియామక పత్రాలను అందజేసే అవకాశం ఉంది. అభ్యర్థులు తమ సామర్థ్యాలను అర్థం చేసుకోవడానికి.. సరైన రంగాన్ని ఎంచుకోవడానికి కౌన్సెలింగ్ సెషన్ లు కూడా అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాల కోసం.. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు 8374315052 నంబర్‌ను సంప్రదించవచ్చు.
ALSO READ: Nellore News: నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ రద్దు.. తెర వెనుక ఇద్దరు ఎమ్మెల్యేల హస్తం?
ఈ మెగా జాబ్ మేళా హైదరాబాద్‌లోని నిరుద్యోగ యువతకు ఎంతో గానూ తోడ్పడుతోంది. ముఖ్యంగా ఉద్యోగం చేయాలని ఎదురుచూసే వారికి అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. ఫ్రెషర్స్, ఎక్స్ పీరియన్స్ అందరూ ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. వివిధ రంగాలకు చెందిన కంపెనీలు మెగా జాబ్ మేళాల్లో పాల్గొంటున్నాయి. కనుక అర్హత ఉన్నవారు మెగా జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.