National Highway: ఢిల్లీ అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో రూ.11వేల కోట్లతో నిర్మించిన రహదారులను ప్రధాని జాతికి అంకితం చేశారు. కాసేపటి క్రితమే ప్రధాని రెండు జాతీయ రహదారులను ప్రధాని మోదీ ప్రారంభించారు. వికిసిత్ భారత్ కు ఢిల్లీ ప్రతిరూపంగా నిలిచిందని చెప్పారు. వోకల్ ఫర్ లోకల్ నినాదంతో ముందుకెళ్తున్నామని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.
ప్రదాని మోదీ ప్రారంభించిన ద్వారకా ఎక్స్ ప్రెస్ వే ద్వారా 20 నిమిషాల్లోనే నోయిడా నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరవచ్చు. ఢిల్లీ శివారులోని కొన్ని ప్రాంతాలను కలుపుతూ 76 కిలోమీటర్లు అర్బన్ ఎక్స్ టెన్షన్ రోడ్ కారిడార్ ప్రాజెక్ట్ తో అనుసంధానం చేశారు. ఎయిర్ పోర్టు దగ్గరలో ఉన్న అలీపూర్ నుంచి మహిపాల్ పూర్ వరకు రోడ్ కారిడార్ పనులు కూడా పూర్తయ్యాయి.
ALSO READ: Vizag Rainfall: మరో 3 రోజుల వర్షాలు.. విశాఖ వాసులకు టెన్షన్ పెంచుతున్న వాతావరణం!
ఢిల్లీలో నిర్మించిన ఈ కొత్త రోడ్ల ప్రారంభంతో లక్షల మంది ప్రయాణికులకు ఉపశమనం కలుగుతోంది. ఈ రోడ్డు అందుబాటులో రావడంతో గురుగ్రామ్ నుంచి ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వరకు ప్రయాణాన్ని కేవలం 20 నిమిషాల్లోనే ప్రయాణించవచ్చు. అలాగే ఢిల్లీ- ఎన్సీఆర్ ట్రాఫిక్ సమస్య కూడా తీరుతోంది. ఢిల్లీ రింగ్ రోడ్డులో ట్రాఫిక్ ను తగ్గించడానికి ద్వారకా ఎక్స్ ప్రెస్ వేను దాదాపు రూ.7,716 కోట్లతో నిర్మించారు. ముండ్కా, బక్కర్ వాలా, నజాఫ్ గడ్, ద్వారకను కలుపుతూ మొత్తం 6 లేన్ల హైవే పనులను పూర్తి చేశారు.
ALSO READ: Bigg Boss 9 : బిగ్ బాస్ నుండి అదిరిపోయే అప్డేట్.. దివ్వెల మాధురి కన్ఫామ్.. మరి దువ్వాడ?
ఢిల్లీ – చండీగఢ్, ఢిల్లీ రోహ్ తక్ మార్గాలను అర్బన్ ఎక్స్ టెన్ష్ రోడ్ కారిడార్ కలుపుతోంది. ఈ నేషనల్ హైవే ద్వారా ఢిల్లీ- ఎన్సీఆర్ వెస్ట్ ప్రాంతాల ప్రజలకు ప్రయాణం ఈజీ అవ్వనుంది. అంతకు ముందు ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం ఉండేది. ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన జాతీయ రహదారులతో ఈ సమస్య తీరనుంది. ప్రధాని రెండు జాతీయ రహదారులను ప్రధాని మోదీ ప్రారంభించారు. వికిసిత్ భారత్ కు ఢిల్లీ ప్రతిరూపంగా నిలిచిందని చెప్పారు. వోకల్ ఫర్ లోకల్ నినాదంతో ముందుకెళ్తున్నామని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు