Jio Network: దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థలైన జియో, వొడాఫోన్-ఐడియా నెట్‌వర్క్‌లు సాంకేతిక సమస్యల కారణంగా తాత్కాలికంగా ఈ రోజు అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. ఈ సమస్య ఎయిర్‌టెల్ వినియోగదారులు కూడా ఎదుర్కొన్నారు. జియో, వోడా ఫోన్ నెట్ వర్క్ లు సమస్యను ఎదుర్కొన్న కొన్ని గంటల తర్వాత వెలుగులోకి వచ్చింది. డౌన్ డిటెక్టర్ వివరాల ప్రకారం.. ఈ రోజ సాయంత్రం 5 గంటల సమయంలో జియో నెట్‌వర్క్‌కు సంబంధించి 200కు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. అదే సమయంలో వొడాఫోన్-ఐడియాకు సంబంధించి సుమారు 100 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ రెండు సంస్థల ఫిర్యాదుల సంఖ్య ఎయిర్‌టెల్‌తో పోలిస్తే తక్కువగా ఉన్నప్పటికీ, సాధారణ స్థాయితో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉంది.
సాయంత్రం 8: 30 గంటల సమయంలో డౌన్ డిటెక్టర్‌ను మళ్లీ పరిశీలించగా.. జియో ఫిర్యాదుల సంఖ్య 54కి తగ్గగా, వొడాఫోన్-ఐడియా ఫిర్యాదులు 9కి తగ్గాయి. ఇది నెట్‌వర్క్‌లు క్రమంగా సాంకేతిక సమస్య బయట పడ్డాయని తెలిపింది. డౌన్ డిటెక్టర్ అందించిన అవుటేజ్ మ్యాప్ ప్రకారం, వొడాఫోన్-ఐడియా సమస్య ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, జైపూర్ వంటి నగరాల్లోని వినియోగదారులు ఎక్కువ ఈ సమస్యకు గురయ్యారు. జియో నెట్‌వర్క్ సమస్య మరింత విస్తృతంగా ఉంది. ఇందులో చండీగఢ్, హైదరాబాద్, లక్నో, పాట్నా, అహ్మదాబాద్ వంటి అనేక నగరాల్లో సమస్య ఎక్కువగా వచ్చింది. అయితే, ఈ రెండు టెలికాం సంస్థలు ఈ సమస్యపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
ఇదే రోజు మధ్యాహ్నం 4:32 గంటల సమయంలో ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌కు సంబంధించి 3,600కు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. 5:30 గంటల సమయంలో ఈ సంఖ్య 2,000 కంటే తక్కువకు చేరింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో మొదటగా గుర్తించిన ఈ సమస్య, తర్వాత ముంబై, బెంగళూరు నగరాలకు కూడా వ్యాపించింది. ఎయిర్‌టెల్ సంస్థ ఈ సమస్యను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో అధికారికంగా వివరించింది. మా నెట్‌వర్క్‌లో అంతరాయం ఏర్పడింది. టీమ్ ఈ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తోంది. అసౌకర్యానికి క్షమించండి’ అని ఎయిర్‌టెల్ ఒక ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
ALSO READ: Asia Cup 2025: టీమిండియాలోకి 14 ఏళ్ల వైభవ్, సాయి సుదర్శన్.. మంగళవారం 1:30 గంటలకు గెట్ రెడీ ?
ఎయిర్‌టెల్‌కు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా మొబైల్ ఫోన్ సేవలు, సిగ్నల్ సమస్యలు, మొబైల్ ఇంటర్నెట్ సమస్యలకు సంబంధించినవి. జియో, వొడాఫోన్-ఐడియా నెట్‌వర్క్‌లు క్రమంగా కోలుకుంటున్నప్పటికీ.. ఈ సాంకేతిక సమస్యలు టెలికాం సేవలపై ఆధారపడే వినియోగదారులకు అసౌకర్యాన్ని కలిగించాయి.