BigTV English

Cloud Burst: అసలు క్లౌడ్ బరస్ట్ ఏంటి..? దీనికి గల కారణాలేంటి..?

Cloud Burst: అసలు క్లౌడ్ బరస్ట్ ఏంటి..? దీనికి గల కారణాలేంటి..?

Cloud Burst: వాతావరణం పొడిగానే కనిపిస్తుంది. కానీ.. అంతలోనే ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఒక్కసారిగా వెదర్ మారిపోతోంది. కుండపోత వర్షం కుమ్మేస్తోంది. ఆకస్మిక వరదలు ముంచేస్తున్నాయ్. గట్టుమీదున్నా.. లోతట్టు ప్రాంతంలో ఉన్నా.. ఎక్కడున్నా తేడా లేదు. ఏ క్షణమైనా కాలనీలు మునిగిపోవచ్చు. రోడ్లు చెరువులైపోవచ్చు. ఇళ్లలోకి నీరు చేరిపోవచ్చు. గూడు చెదిరిపోవచ్చు. తెలుగు రాష్ట్రాలే కాదు ఉత్తర భారతంలోని పర్వత ప్రాంతాల్లోనూ సంభవిస్తున్న క్లౌడ్ బరస్ట్‌ల్ని చూశాక.. మన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు.


ఒక్క రాత్రిలోనే బీభత్సం సృష్టిస్తున్న వర్షం..
అప్పుడే వాన.. అప్పుడే ఎండ.. పడితే కుండపోత! లేకపోతే.. ఎండ మోత! రాత్రికి రాత్రే వరదలొచ్చేస్తున్నాయ్. ఇండ్లు మునిగిపోతున్నాయ్. లోతట్టు ప్రాంతాల సంగతి సరేసరి, హైదరాబాద్, వరంగల్‌, గుంటూరు, విజయవాడ లాంటి ప్రాంతాల్లో.. ఒక్క రాత్రిలోనే వర్షం బీభత్సం ఎలా ఉంటుందో చూస్తున్నాం. ఇటీవలే.. మంగళగిరిలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. ఆ ప్రాంతాన్ని ముంచేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఉత్తర భారతంలోని పర్వత ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తుంటే.. ఇంకొన్ని చోట్ల తేలికపాటి వర్షాలే కురుస్తున్నాయ్. అసలేం.. జరుగుతోంది? ఒక్కసారిగా కుమ్ముతున్న వర్షాలతో.. కాలనీలన్నీ నీట మునుగుతున్నాయ్. ఇళ్లలోకి నీరు చేరుతుండటంతో.. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్‌లో అయితే.. ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయ్. కొండచరియలు విరిగిపడుతున్నాయ్. రోడ్లు తెగుతున్నాయ్. గంటల్లోనే.. కళ్లముందు జలపాతాలు ప్రత్యక్షమవుతున్నాయ్. ఈ కుంభవృష్ణి వానలకు.. జనజీవనం స్తంభిస్తోంది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. సిచ్యువేషన్ ఎంత సీరియస్‌గా ఉందో!

క్లౌడ్ బరస్ట్‌ల ధాటికి తట్టుకోలేకపోతున్న దేశం
క్లౌడ్ బరస్ట్‌ల ధాటికి మహా నగరాలే కాదు.. మారుమూల ప్రాంతాలు కూడా తట్టుకోలేకపోతున్నాయ్. క్లౌడ్ బరస్ట్ అయితే చాలు.. సిటీ వరస్ట్‌గా మారిపోతోంది. చిన్న వానకే చితికిపోయే నగరాలు.. క్లౌడ్ బరస్ట్‌లని తట్టుకుంటాయా? అందుకే.. కాలనీల చుట్టూ నీరు చేరడం, రోడ్లు చెరువుల్లా మారిపోవడం, గల్లీల్లో వరదలు రావడం, ఇళ్లల్లోకి నీళ్లొచ్చేయడం లాంటివన్నీ.. ఇప్పుడు అంతటా కామన్ అయిపోయాయ్. ఈ కామన్ సమస్యల్లో.. కామన్ మ్యాన్ పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కుండపోత వర్షం కుమ్మేసిన ప్రతిసారీ.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఓ వర్షం కురిసిన రాత్రి.. నగరాలు నరకంగా మారిపోతున్నాయ్. కమ్ముకున్న నల్లటి మబ్బుల్ని చూస్తే.. ఆటోమేటిక్‌గా భయం పుడుతోంది. ఈ పరిస్థితులన్నింటికీ.. వన్ అండ్ ఓన్లీ రీజన్ క్లౌడ్ బరస్ట్.


మేఘాలన్ని కలిపి ఒక్కసారిగా కుమ్మరించినట్లుగా వర్షం
అసలేంటీ.. ఈ క్లౌడ్ బరస్ట్? అంటే.. ఓ గంటలో కురిసే వాన తీవ్రతని బట్టి.. అది కుండపోత వర్షమా? క్లౌడ్ బరస్టా? అనేది డిసైడ్ అవుతుంది. వాతావరణ శాఖ ప్రకారం.. ఓ భౌగోళిక ప్రాంతంలో.. గంటలో 10 సెంటీమీటర్లు, అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే.. దానిని క్లౌడ్ బరస్ట్ అంటారు. ఇది కేవలం భారీ వర్షం మాత్రమే కాదు.. ఆకాశం నుంచి మేఘాలన్నింటిని కలిపి ఒక్కసారిగా కుమ్మరించినట్లుగా.. వర్షం కురుస్తుంది. దీని వల్ల.. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం లాంటి విపత్తులు సంభవిస్తున్నాయ్. క్యుములోనింబస్ మేఘాల కారణంగా.. గంట, రెండు గంటల్లోనే కుండపోత వర్షాలు కుమ్మేస్తున్నాయ్. ఈ భారీ వర్షాలను.. నగరాలే కాదు పర్వత ప్రాంతాలు కూడా తట్టుకోలేకపోతున్నాయ్.

కుమ్మేస్తున్న కుండపోత వర్షాలు.. క్లౌడ్ బరస్ట్ కారణంగా మెరుపు వరదలు
ఉత్తరాఖండ్‌లో ఇటీవల సంభవించిన క్లౌడ్ బరస్ట్‌లు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. ముఖ్యంగా ఉత్తరకాశీ జిల్లాలోని ధారాలీ గ్రామం, చుట్టుపక్కల ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. క్లౌడ్ బరస్ట్ కారణంగా వచ్చిన మెరుపు వరదలు.. ధారాలీ గ్రామంలోని ఇళ్లను, దుకాణాలను, హోటళ్లను తుడిచిపెట్టేశాయ్. దీంతో ఆ గ్రామం దాదాపుగా పూర్తిగా ధ్వంసమైంది. పదుల సంఖ్యలో పౌరులు, ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారని చెబుతున్నారు. వీరిలో స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు కూడా ఉన్నారు. వరదల కారణంగా అనేక రోడ్లు, నేషనల్ హైవేలు తీవ్రంగా దెబ్బతిన్నాయ్. దీంతో.. ఆ ప్రాంతంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయ్. ధారాలీ వరదల తర్వాత, హర్సిల్ పై ప్రాంతాల్లో ఓ తాత్కాలిక సరస్సు ఏర్పడింది. ఇది ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉండటంతో, దిగువ ప్రాంతాలకు మరింత ముప్పు పొంచి ఉంది. ఈ విధ్వంసం ఉత్తరాఖండ్ టూరిజానికి కూడా భారీ నష్టాన్ని కలిగించింది. ఈ వర్షాలు.. హిమాలయ ప్రాంతం ఎంత సున్నితమైందో.. పర్యావరణ మార్పుల వల్ల ఎలాంటి విపత్తులు సంభవిస్తున్నాయో మరోసారి గుర్తుచేసింది.

క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి?
ఇండియాలో.. క్లౌడ్ బరస్ట్‌లు ఎందుకు సంభవిస్తున్నాయ్? ఒక్కసారిగా ఇంత వర్షం ఎందుకు కురుస్తోంది? మొన్న ఉత్తరాఖండ్.. ఇప్పుడు కశ్మీర్.. అసలు క్లౌడ్ బరస్ట్‌లకు కారణాలేంటి? కొన్ని గంటల్లోనే.. వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా ఎందుకు మారిపోతున్నాయ్? ఈ మధ్యకాలంలో.. మన దేశంలో క్లౌడ్ బరస్ట్‌లు సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. ఇందుకు.. లేటెస్ట్‌గా జమ్ముకశ్మీర్‌లో వర్షాలు సృష్టించిన బీభత్సమే బిగ్ ఎగ్జాంపుల్. కథువా జిల్లాలో క్లౌడ్ బరస్ట్‌ల కారణంగా.. కొండచరియలు విరిగిపడటంతో.. ఏడుగురు చనిపోయారు. ఇంకొందరు గాయపడ్డారు. ఇటీవలే.. కిష్త్వార్‌లో ఇలాంటి బీభత్సవే జరిగితే.. 60 మందికి పైగా మరణించారు. జోధ్ ఘాటి ప్రాంతంలో అనేక ఇళ్లు.. వరద నీటిలో మునిగిపోయాయ్. జమ్ము-పఠాన్‌కోట్ నేషనల్ హైవేపైనా.. అనేక చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయ్. భారీ వర్షాల కారణంగా.. జమ్ముకశ్మీర్‌లోని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయ్. అధికారులు, ఆర్మీ.. ఈ పరిస్థితులని నిశితంగా గమనిస్తున్నాయ్. కథువాలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా.. కొండచరియలు విరిగిపడిన ఘటనలో.. ప్రాణనష్టం సంభవించింది. సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయచర్యలు చేపట్టాయ్. మీరు చూస్తున్న బీభత్సమంతా.. క్లౌడ్ బరస్ట్‌ల ఎఫెక్టే.

క్లౌడ్ బరస్ట్‌లకు మరో కారణం..
క్లౌడ్ బరస్ట్‌లు ఎక్కువగా.. హిమాలయ ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి ఎత్తైన ప్రదేశాల్లో సంభవిస్తున్నాయ్. ఇందుకు.. అనేక కారణాలున్నాయ్. హిమాలయ పర్వత శ్రేణులు సముద్రం నుంచి వచ్చే తేమతో కూడిన రుతుపవన గాలులకు అడ్డంకిగా ఉంటాయ్. ఈ గాలులు పర్వతాలను దాటలేకపోవడంతో.. మేఘాలు ఒకే చోట చేరి దట్టంగా ఏర్పడుతున్నాయ్. దీనిని.. ఒరోగ్రాఫిక్ లిఫ్ట్ అంటారు. చల్లని, వేడి గాలుల కలయికతో.. అస్థిర వాతావరణంలో మేఘాలుగా మారుతున్నాయ్. ఫలితంగా.. ఒక్కసారిగా కుండపోత వర్షాలు కుమ్మేస్తున్నాయ్. సాధారణంగా.. మేఘాలు చల్లబడినప్పుడు వర్షం కురుస్తుంది. కానీ.. పర్వత ప్రాంతాల్లో వేడి గాలుల కారణంగా వర్షుపు చినుకులు కిందకి పడకుండా.. మళ్లీ పైకి కదులుతున్నాయ్. ఇది కొన్నిసార్లు కొనసాగడంతో.. మేఘాల్లోని వర్షపు బిందువుల పరిమాణం, బరువు అసాధారణంగా పెరుగుతోంది. వర్షపు బిందువుల బరువును మేఘాలు మోయలేని స్థితికి చేరుకున్నప్పుడు.. అవి ఒక్కసారిగా బద్దలైపోతాయ్. దాంతో.. చాలా కొద్ది సమయంలోనే.. అపారమైన వర్షం కురుస్తోంది. ఇది.. క్లౌడ్ బరస్ట్‌కు దారితీస్తోంది. ఫలితంగా ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం లాంటి విపత్తులకు దారితీసి.. భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తున్నాయ్.

క్యుములోనింబస్ మేఘాలతో ఉరుములు, మెరుపులు
మరోవైపు.. క్యుములోనింబస్ మేఘాలు కూడా క్లౌడ్ బరస్ట్‌లకు ప్రధాన కారణం. ఇదొక.. అసాధారణమైన వాతావరణ పరిస్థితి. క్యుములోనింబస్ మేఘాలు వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన తుపాను మేఘాలు ఏర్పడుతున్నాయ్. అవి.. ఊహించని బీభత్సాన్ని సృష్టిస్తున్నాయ్. క్యుములోనింబస్ మేఘాలు నిలువుగా చాలా ఎత్తు వరకు ఏర్పడతాయ్. ఈ మేఘాల్లో నీటి ఆవిరి, నీటి బిందువులు, మంచు కణాలు అధిక మొత్తంలో నిల్వ ఉంటాయ్. వేడిగా, తేమగా ఉండే గాలి వేగంగా పైకి వెళ్లినప్పుడు.. ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయ్. ఈ బలమైన పైకి వీచే గాలుల కారణంగా.. మేఘాల్లోని నీటి బిందువులు, మంచు కణాలు.. కింద పడకుండా ఒకే చోట నిలిచిపోతున్నాయ్.

Also Read: రాష్ట్రమంతా వర్షాలు దంచికొడుతున్నా.. ఈ రెండు చెరువుల్లో చుక్క నీళ్లు లేని పరిస్థితి

నీటి బరువును తట్టుకోలేనంత భారీగా మేఘాలు
ఈ విధంగా.. గాలి పైకి కదులుతున్నప్పుడు.. మేఘాల్లో నీటి నిల్వ మరింత పెరుగుతుంది. ఒక దశలో.. మేఘం తనలో ఉన్న నీటి బరువును తట్టుకోలేనంత భారీగా మారుతుంది. మేఘంలోని పైకి వీచే గాలులు బలహీనపడినప్పుడు.. మేఘంలో నిలిచి ఉన్న భారీ నీరంతా.. ఒకేసారి కుండపోతగా కిందకు కురుస్తోంది. ఇదే.. క్లౌడ్ బరస్ట్‌కు కారణమవుతోంది. సాధారణంగా క్లౌడ్ బరస్ట్‌లు.. పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా సంభవిస్తాయ్. కానీ.. మారిన వాతావరణ పరిస్థితులతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఏర్పడుతున్నాయ్. క్యుములోనింబస్ మేఘాల రూపంలో మన దగ్గర కూడా కుండపోత వర్షాలు కుమ్మేస్తున్నాయ్. జనజీవనం స్తంభించిపోయేలా చేస్తున్నాయ్.

Related News

Gold In Odisha: ఒడిషాకు ‘బంగారు’ పంట.. నాలుగైదు జిల్లాల్లో బంగారం గనులు

CP Radhakrishnan: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్

Rahul Gandhi: ఎలక్షన్ కమిషన్‌పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు.. సీఈసీ ఫైర్

National Highway: రూ.11వేల కోట్లతో నేషనల్ హైవే.. 20 నిమిషాల్లోనే ఎయిర్ పోర్టుకు..!

Rare disease: హడలెత్తిస్తున్న అరుదైన వ్యాధి.. పాపం చిన్నారి మృతి.. బీ అలర్ట్!

Big Stories

×