Rahul Gandhi: భారత రాజకీయాల్లో వివాదాలు సర్వసాధారణం జరుగుతూనే ఉంటాయి.. కానీ ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. రాహుల్ గాంధీ భారతదేశ ఎన్నికల ప్రక్రియలో ‘ఓట్ చోరీ’ జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో సీఈసీ ఆయన వ్యాఖ్యలపై ఫైరయ్యింది. రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనడం రాజ్యాంగాన్ని అవమానించడమే భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్ మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఎన్నికల సంస్థ సంతంత్రత, పారదర్శకతపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బ తీసే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం పౌరులు స్వచ్ఛందంగా ఓటు వేయొచ్చని చెప్పారు.
ఇలాంటి ఆరోపణలపై ఎన్నికల సంఘం భయపడదు..
లోక్ సభ ఎన్నికల్లో లక్షలాది మంది పోలింగ్ ఏజెంట్లు, ఉద్యోగులు తమ విధులు సమర్థంగా నిర్వహించారని ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్ అన్నారు. ఇలాంటి ఆరోపణలపై ఎన్నికల సంఘం భయపడదని చెప్పారు. ఎవరి పేర్లయినా గల్లంతయినా.. పేరు, అడ్రస్ తప్పుడా నమోదైనా ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చని చెప్పారు. ఓట్ చోరీ అనడం రాజ్యాంగాన్ని అవమానించడమే అని ఫైరయ్యారు. ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు విపక్షాలు ప్రయతం చేస్తున్నాయని ఆరోపించారు. ఓట్లు వేసేందుకు వచ్చే వాళ్ల వివరాలను అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తారని చెప్పారు.
ALSO READ: RK Roja: వార్-2 సినిమాను అడ్డుకుంటారా..? రోజా సంచలన వ్యాఖ్యలు
ఈసీకి అన్ని పార్టీలు సమానమే..
ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం ఎలాంటి పక్షపాతం చూపదని చీఫ్ ఎలక్షన్ కమిషన్ అన్నారు. ఓట్ల చోరీ అంశంపై విపక్షాల వద్ద ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. చట్టాలను ఎన్నికల సంఘం అన్ని వేళలా గౌరవిస్తుందని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘానికి అధికార, విపక్షాలు సమానమే అని చెప్పారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉంటుందని చెప్పారు. ఎన్నికల కమిషన్ కు ఎలాంటి భేదభావాలు ఉండవని పేర్కొన్నారు. తమకు అన్ని పార్టీల సమానమే అని చెప్పుకొచ్చారు. దరఖాస్తు చేసుకోకుంటే ఓటు ఎలా వస్తుందని ప్రశ్నించారు.
ALSO READ: National Highway: రూ.11వేల కోట్లతో నేషనల్ హైవే.. 20 నిమిషాల్లోనే ఎయిర్ పోర్టుకు..!
గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు..
బీహర్ ఓటర్ల లిస్ట్ తయారీలో అన్ని పార్టీలు పాలుపంచుకున్నాయని ఆయనన్నారు. ఓట్ల చోరీ పేరుతో ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఓటర్ జాబితాను బూత్ లెవల్ లోనే పార్టీలో చేసుకుంటాయని అన్నారు. బీహర్ లో ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 1 వరకు సమాచారం ఇచ్చామని తెలిపారు. బీహార్ కు ఇంకా 15 రోజుల గడువు ఉందని చెప్పారు. సంస్కరణల్లో భాగంగానే బీహర్ లో ఓటర్ జాబితా సవరణ జరగిందని వివరించారు. అయితే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భారత ఎన్నికల వ్యవస్థపై తవ్ర చర్చకు దారితీసింది. రాజకీయ నాయకులు తమ ఆరోపణలలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఆధారాలతో మాట్లాడాలని ఈసీ సూచించింది. ఈ వివాదం ద్వారా ఎన్నికల సంఘం స్వతంత్రత, రాజకీయ బాధ్యతలపై మరోసారి దృష్టి సారించింది.