E-Paper
Advertisement

వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇన్సురెన్స్ లేకపోతే ఆయిల్ బంద్, రంగంలోకి పోలీసులు

వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇన్సురెన్స్ లేకపోతే ఆయిల్ బంద్, రంగంలోకి పోలీసులు
Advertisement

Vehicle Insurance: మీ వాహనానికి బీమా లేదా? భవిష్యత్తులో మీకు ఇబ్బందులు తప్పవు. చివరకు పెట్రోల్ కూడా దొరక్కపోవచ్చు. రోడ్లపై తిరుగుతున్న బీమా లేని వాహనాల సమస్యను పరిష్కరించడానికి కీలక నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు. అలాంటి వాహనాలకు ఇంధనం సరఫరా చేయవద్దని సూచన చేసింది. బీమా ఉన్న వాహనాలకు ఇంధనం సరఫరా అయ్యేలా ప్రైలట్‌ ప్రాజెక్టును అమలుచేయాలని సూచించింది.

వాహనదారులకు బిగ్ అలర్ట్

దేశంలో ఇన్సూరెన్స్‌ లేకుండానే సగానికి పైగానే వాహనాలు నడుస్తున్నాయి. దీనిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో వాహనాలకు బీమా లేకుంటే.. ఆయిల్ లేకుండా చేయాలని ఆదేశించింది. రిజిస్ట్రేషన్‌ సమయంలో కొత్త కార్లకు నాలుగేళ్లు, టూ వీలర్స్‌కు ఆరేళ్లు థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ తప్పనిసరి చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని పేర్కొంది. బీమా అమల్లో ఉన్న వాహనాలకు ఆయిల్ సరఫరా జరిగేలా చూడాలని వెల్లడించింది. దీనిపై కేంద్ర రవాణా శాఖతో సంప్రదించి ఓ ప్రైలట్‌ ప్రాజెక్టును అమలు చేయాలని ఆదేశించింది.

వాహనాల గణాంకాలు బయటకు

Advertisement

దేశంలో మొత్తం 30.48 కోట్ల వాహనాలు ఉండగా, అందులో దాదాపు 56 శాతానికి సంబంధించిన వాహనాలకు ఎలాంటి థర్డ్ పార్టీ బీమా లేకుండానే నిర్లక్ష్యంగా తిరుగుతున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 22 శాతం రోడ్డు ప్రమాదాలు బీమా లేని వాహనాల వల్లే జరుగుతున్నాయి. ఇన్యూరెన్స్ లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితుల కుటుంబాలకు సకాలంలో పరిహారం అందకుండా పోతోందని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ద్వారా జీవించే ప్రాథమిక హక్కును భంగపరచడమేనని స్పష్టంచేసింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు జస్టిస్ సంజయ్ కరోల్-జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మార్గదర్శకాలు జారీ చేసింది.

సుప్రీంకోర్టు ప్రతిపాదనలు

బీమా లేని వాహనాలకు ఆటోమేటిక్‌గా ఈ-చలానాలు జారీ చేయడానికి వీలుగా ఆటోమేటిక్‌ నెంబర్ ప్లేట్‌ రికగ్నిషన్‌-ANPR కెమెరాలను విహాన్ – VAHAN డేటాబేస్‌తో అనుసంధానించాలని పేర్కొంది. రియల్‌టైమ్ ఇన్సూరెన్స్‌ స్టేటస్‌ను చెక్ చేయడానికి పోలీసులకు డిజిటల్ పరికరాలు సమకూర్చాలని సూచించింది. బీమా లేని వాహనం ఉపయోగించేవారిపై మోటార్‌ వాహన చట్టం-1988లో సెక్షన్‌ 196 కింద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రస్తావించింది. ప్రైవేటు వాహనాలకు నాలుగు అంచెల బీమా విధానాన్ని ప్రతిపాదన చేసింది. థర్ డ్‌పార్టీ బీమా తప్పనిసరి. బీమా చేసిన వాహనానికి అయ్యే నష్టాన్ని భర్తీ చేసే కవరేజీలను ఆప్షనల్‌గా అమలు చేయాలని పేర్కొంది.

Advertisement

ALSO READ: కర్ణాటక పరిశ్రమలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి, ఐసీయూలో మరో ముగ్గురు!

బీమా కొనుగోలు చేసేటప్పుడు ఈ తరహా ఆప్షన్లతో కూడిన ఫామ్‌ అందించి వారు ఎంచుకున్న ఆప్షన్ల ఆధారంగా కవరేజి కల్పించాలని తెలిపింది. ఒకవేళ ఏమైనా మార్పులు, చేర్పులు చేయాలనుకుంటే ఐఆర్‌డీఏ ఆ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. వీటికి సంబంధిత పక్షాలు ఆగస్టు 14 లోగా నివేదికలు దాఖలు చేయాలని, తదుపరి విచారణ ఆగస్టు 18న జరుగుతుందని పేర్కొంది. 2018లో కొత్త వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు కార్లకు మూడు సంవత్సరాలు, టూ వీలర్స్‌కు ఐదేళ్లు థర్డ్-పార్టీ బీమాను తప్పనిసరి చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెల్సిందే.

Related News

రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేసిన మహిళ .. TTEతో వాగ్వాదం, స్వయంగా బట్టలు చించుకుని

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. జలపాతంలోకి దూసుకెళ్లిన కారు, 8 మంది మృతి

భార్యకు మస్కా కొట్టి.. ప్రేయసితో మలేషియా ట్రిప్ ప్లాన్.. తీరా ఎయిర్‌పోర్టులో ఊహించని ట్విస్ట్!

దీదీకి దెబ్బ మీద దెబ్బ.. నందిగ్రామ్ తర్వాత రెజీనగర్‌లోనూ షాక్!

ఢిల్లీలో గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ సమిట్.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!

ఐఐటీ బొంబాయిలో తీవ్ర విషాదం.. చాట్‌జీపీటీ కాపీయింగ్ రచ్చ.. విద్యార్థి ఆత్మహత్య!

లా స్టూడెంట్ అమృత హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్!

నందిగామ్ బైపోల్లో బిగ్ ట్విస్ట్.. మమత మద్దతు ఇచ్చిన గంటల వ్యవధిలో.. కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్!

Big Stories

Advertisement
×