RBI Monetary Policy: వడ్డీరేట్లపై కీలక ప్రకటన చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఆర్‌బీఐ. మరోసారి వాటిని యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పింది. 5.25 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు గవర్నర్ సంజయ్ తెలిపారు. వడ్డీరేట్లను ఆర్‌బీఐ సవరించకపోవడం వరుసగా ఇది నాలుగోసారి.
మానిటరీ పాలసీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం ప్రకటించారు. మరోసారి కీలక రెపో రేట్లను 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి-ఏప్రిల్-జూన్‌లో జరిగిన సమీక్షల్లో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఇందుకు కారణాలు వెల్లడించారు.
ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటనలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతల సవాళ్లు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, ప్రధాన వాణిజ్య మార్గాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా అనిశ్చితి వాతావరణం ఉన్నప్పటికీ దేశీయంగా స్థిరమైన డిమాండ్ భారత ఆర్థికవృద్ధికి అండగా నిలుస్తోందన్నారు.
వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేకపోవడంతో గృహ, వాహన రుణాలు, ఇతర వ్యక్తిగత రుణాలపై ఈఎంఐలపై తక్షణమే భారం పెరిగే అవకాశం లేదు. బ్యాంకులు కూడా ఇప్పుడున్న వడ్డీ రేట్లను కంటిన్యూ చేయనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ రెండవ త్రైమాసికానికి తన వృద్ధి అంచనాను కూడా పెంచింది. రిజర్వ్ బ్యాంక్ రెండవ త్రైమాసికానికి తన వృద్ధి అంచనాను పెంచింది.
దేశంలో నైరుతి రుతుపవనాల విస్తరణ, పంటల సాగు సరళిపై ఫోకస్ చేసింది ఆర్‌బీఐ. వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాలో అంతరాయాలు కలగకుండా చూడడం ద్రవ్యోల్బణ నియంత్రణకు ముఖ్యమని తెలిపారు. రూపాయి మారకం విలువను బలోపేతం చేయడానికి విదేశీ డాలర్ డిపాజిట్లను ఆకర్షించేందుకు ఆర్‌బీఐ తీసుకొచ్చిన కొత్త ఎఫ్‌సిఎన్‌ఆర్-FCNR స్కీమ్.
ALSO READ: పసిడి ప్రియులకు ఊరట.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
దీనికి ఎన్‌ఆర్‌ఐల నుంచి భారీ స్పందన వస్తోంది. ఈ పథకం ద్వారా వచ్చిన నిధుల్లో సగానికి పైగా హెచ్‌ఎస్‌బీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకులకు వచ్చాయి. జూన్ 8న మొదలైన ఈ స్కీమ్ సెప్టెంబర్ చివరి వరకు అమలులో ఉండనుంది. ప్రస్తుత ఆర్థిక ఏడాదికి ద్రవ్యోల్బణం 4.3 శాతం నమోదు కావచ్చని తెలిపారు గవర్నర్ సంజయ్ మల్హోత్రా.