E-Paper
Advertisement

నోయిడాలో ఘోర ప్రమాదం.. పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ.. ఇద్దరు మృతి!

నోయిడాలో ఘోర ప్రమాదం.. పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ.. ఇద్దరు మృతి!
Advertisement

Noida Fire: నోయిడాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మామురా గ్రామంలోని ఒక నాలుగంతస్తుల నివాస భవనంలో ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీ పేలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనం కింద ఈ స్కూటీని ఛార్జింగ్ పెట్టిన సమయంలో ఒక్కసారిగా స్పార్క్ వచ్చి, బ్యాటరీ పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి మంటలు క్షణాల్లోనే భవనం అంతటా వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదం కారణంగా దట్టమైన పొగ కమ్మేయడంతో భవనంలో ఉన్నవారంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ఊపిరాడక, తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో సుమారు 50 మంది వరకు నివాసితులు లోపలే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది , పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అలాగే భవనంలో చిక్కుకున్న మిగతా వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement

Also Read: సిరిసిల్ల నేత అద్భుత ప్రతిభ.. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర.. బరువు తెలిస్తే షాకవుతారు!

ఈ ప్రమాదానికి సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు భావిస్తూ పోలీసులు సదరు ఇంటి యజమానిని అరెస్టు చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇంతటి పెద్ద ప్రమాదం జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన నోయిడా పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేపింది. కేవలం ఒక చిన్న నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాలను బలిగొనడమే కాకుండా, మరెంతో మందిని ప్రమాదంలోకి నెట్టేసింది.

Advertisement

Related News

జర్మనీలో షాకింగ్ కేసు కలకలం.. 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిన రోబో!

‘చెవి కొరికి తినేసి.. ఇప్పుడేమో ముందస్తు బెయిలా?’.. నిందితుడిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం!

రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. దసరాకి బోనస్..?

‘బ్లూ డ్రమ్’ కేసులో సంచలన తీర్పు.. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణ శిక్ష ఖరారు!

పొయ్యిలో 20కి పైగా పాములు.. ఏకంగా పిల్లలతో కాపురం పెట్టేసిందిగా? ధైర్యం ఉంటేనే చూడండి

ప్రేమకు అడ్డొచ్చిందని.. కంటికి రెప్పలా చూసిన నానమ్మనే హత్య చేసిన మనుమరాలు!

గోల్డ్ షాపు ఓపెనింగ్‌కు ముందే బిగ్ షాక్.. 12 నిమిషాల్లో రూ.8 కోట్ల బంగారం చోరీ..!

భారతీయ పైలట్‌పై దాడి.. విచారణ ముమ్మరం చేసిన ఎన్ఐఏ.. యూఏఈకి ప్రత్యేక బృందం!

Big Stories

Advertisement
×