E-Paper
Advertisement

ఉక్కపోతకు బై బై.. వర్షాలకు హాయ్ హాయ్.. దేశవ్యాప్తంగా ఇక వానలే వానలు!

ఉక్కపోతకు బై బై.. వర్షాలకు హాయ్ హాయ్.. దేశవ్యాప్తంగా ఇక వానలే వానలు!
Advertisement

Monsoon Revival: ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేక, ఎండలతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఒక వాతావరణ వ్యవస్థ.. ప్రస్తుతం బంగాళాఖాతంలోకి ప్రవేశించిందని తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రోజుల్లో రుతుపవనాలు మళ్లీ పుంజుకుని.. దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

రాబోయే 2, 3 రోజుల్లో..

ప్రస్తుతం బంగాళాఖాతంలోకి ప్రవేశించిన ఈ వాతావరణ వ్యవస్థ కారణంగా సముద్రంలో బలమైన గాలులు, దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితులు అల్పపీడనానికి దారితీస్తాయి. అల్పపీడనం ఏర్పడినప్పుడు భూమిపైకి మేఘాలు కమ్ముకొచ్చి పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతం ఏర్పడిన వాతావరణ వ్యవస్థ రాబోయే 2, 3 రోజుల్లో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనివల్ల తూర్పు భారతదేశంలో వర్షాలు ప్రారంభమై, ఆ తర్వాతి వారాల్లో మధ్య, ఉత్తర భారత దేశాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని శాటిలైట్ చిత్రాల ద్వారా ఐఎండీ అంచనా వేసింది.

దోబూచులాడుతున్న వానలు..

Advertisement

వర్షాకాలం ప్రారంభమైనా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ చెప్పుకోతగ్గ స్థాయిలో వర్షాలు లేవు. జూలై ప్రారంభంలో దేశంలోని పశ్చిమ ప్రాంతాలతో సహా పలు చోట్ల భారీ వర్షాలు కురిసినప్పటికీ జూలై మధ్య నాటికి ఒక్కసారిగా వర్షాలు హ్యాండ్ ఇచ్చాయి. దీంతో చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఆకాశం నిర్మలంగా మారి ఎండలు మళ్లీ ముదిరిపోయాయి. దీంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని పగటి ఉష్ణోగ్రతలు.. వేసవిని తలపిస్తున్నాయి.

తీవ్ర ఆందోళనలో రైతులు

వర్షాల కొరత దేశవ్యాప్తంగా ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వర్షాలు సకాలంలో పడకపోవడంతో వరి, ఇతర ప్రధాన పంటల విత్తనాలు వేసే ప్రక్రియ ఒక్కసారిగా నెమ్మదించింది. సాధారణంగా రుతుపవనాల కాలంలో ఇలాంటి తాత్కాలిక విరామాలు సహజమే అయినప్పటికీ ఈసారి వర్షాల లేమి మాత్రం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

Advertisement

Also Read: ఎల్ఐసీ కస్టమర్లకు బిగ్ షాక్.. సైలెంట్‌గా ఆ కీలక సేవలు బంద్!

త్వరలోనే ఉపశమనం

అయితే బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడిన ఈ వ్యవస్థతో త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని వాతావరణ నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తూర్పు, మధ్య భారత దేశాల్లో కురిసే వర్షాలు నీటి కొరతను తీర్చడమే కాకుండా ఉష్ణోగ్రతలను గణనీయంగా తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగిస్తాయని వారు భావిస్తున్నారు. ఎట్టకేలకు రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారుతుండటంతో త్వరలోనే వానలు తిరిగి పలకరిస్తాయన అభిప్రాయపడుతున్నారు.

Also Read: ఫోన్లు, టీవీల వెనుక ఉండే.. ‘CE’ గుర్తు అర్థమేంటి? దాని రహస్యం ఇదే!

Related News

Gold Paste: బంగారం పేస్ట్‌ ఇదిగో.. ఎప్పుడైనా చూశారా, అడ్డంగా బుక్కైన జంట

అమ్మ పెళ్లి సంబంధాలు చూస్తోందని.. ఊహించని షాక్ ఇచ్చిన కూతురు.. ఏం చేసిందంటే?

Bengaluru: నేను తప్పు చేశాను.. తల్లికి లేఖ రాసిన బెంగుళూరు టీచర్, చివరకు ఏం జరిగింది?

ఢిల్లీలో అర్ధరాత్రి దారుణం.. భార్యను నడిరోడ్డుపై కాల్చి చంపిన పోలీస్ భర్త

సీఎం విజయ్ కొత్త రూల్.. రోగి మరణిస్తే ఫీజు మాఫీ? ఆస్పత్రుల గుండెల్లో రైళ్లు!

బంగాళాఖాతంలో పడవ బోల్తా.. 9 మంది మత్స్యకారులు మృతి, ఆరుగురి గల్లంతు!

ఐసీయూలో కన్నతల్లి.. తల్లడిల్లిన జొమాటో బాయ్.. కస్టమర్ చేసిన పనికి నెట్టింట ప్రశంసలు!

Big Stories

Advertisement
×