E-Paper
Advertisement

బీరుకు రూ.10 కూలింగ్ ఛార్జ్.. సీఎం విజయ్‌కు యువకుడి ఫిర్యాదు! వీడియో వైరల్

బీరుకు రూ.10 కూలింగ్ ఛార్జ్.. సీఎం విజయ్‌కు యువకుడి ఫిర్యాదు! వీడియో వైరల్
Advertisement

Cooling Charges: రాష్ట్రంలో అవినీతి కనిపిస్తే ఉపేక్షించవద్దని, వెంటనే ఫిర్యాదు చేయాలని ముఖ్యమంత్రి విజయ్ ఇచ్చిన పిలుపును ఓ యువకుడు చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. అయితే, అతను పెద్ద పెద్ద స్కాములు, భూ ఆక్రమణల జోలికి వెళ్లకుండా.. సగటు మందుబాబుల గుండెల్లో గుబులు రేపుతున్న ఒక సలసల కాగుతున్న సమస్యపై ఫోకస్ పెట్టాడు. ప్రభుత్వ వైన్ షాపుల్లో ఎప్పటి నుంచో అనధికారికంగా నడుస్తున్న కూలింగ్ ఛార్జ్ దందాను లైవ్‌లోకి తెచ్చాడు.

కూలింగ్ పేరుతో దోపిడీ
విషయంలోకి వెళ్తే.. సదరు యువకుడు స్థానిక ప్రభుత్వ వైన్ షాపుకు వెళ్లి చిల్డ్‌ బీరు ఆర్డర్ చేశాడు. ఎంఆర్‌పీ ధర ప్రకారం రూ.160 ఉండాల్సిన బీరుకు, అక్కడి సిబ్బంది క్యాజువల్‌గా రూ.170 డిమాండ్ చేశారు. అదేంటన్నా.. రూ.10 ఎక్కువ అడుగుతున్నారు? అని ప్రశ్నిస్తే, “ఫ్రిజ్‌లో పెట్టి కూల్ చేసినందుకు కరెంట్ బిల్లు మేమే కట్టాలి కదా తమ్ముడూ.. ఆ మాత్రం కూలింగ్ ఛార్జ్ ఇచ్చుకోవాలి” అంటూ సిబ్బంది సదరు యువకుడికి తత్వశాస్త్రం బోధించారు. దీంతో షాకైన యువకుడు, ఇదేం అన్యాయం అంటూ అక్కడికక్కడే తన మొబైల్‌ తీసి గుట్టు రట్టు చేశాడు.

Advertisement

వీడియో తీసి సీఎం విజయ్‌కు ట్యాగ్.. నెట్టింట వైరల్!
వైన్ షాప్ సిబ్బంది చేస్తున్న ఈ అక్రమ వసూళ్లను ఆ యువకుడు పక్కా ఆధారాలతో వీడియో రికార్డ్ చేశాడు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ, నిలువు దోపిడీకి పాల్పడుతున్న తీరును ఎండగట్టాడు. అంతటితో ఆగకుండా, “సార్.. మీరు అవినీతిపై ఫిర్యాదు చేయమన్నారు కదా, ఇదిగోండి సాక్ష్యం” అంటూ ఆ వీడియోను నేరుగా సీఎం విజయ్‌కు ట్విట్టర్ వేదికగా ట్యాగ్ చేశాడు. సదరు వైన్ షాప్ కాంట్రాక్ట్‌ను తక్షణమే రద్దు చేసి, ఇలాంటి దోపిడీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

నువ్వు దేవుడివయ్యా స్వామి!
ఈ వీడియో చూసిన నెటిజన్లు, ముఖ్యంగా మందుబాబులు ఆ యువకుడి ధైర్యాన్ని వేనోళ్ల శ్లాఘిస్తున్నారు. “ప్రతి వైన్ షాపులోనూ ఈ రూ.10 ఎక్స్‌ట్రా దందా కామన్‌ అయిపోయింది, ఎవరూ అడగలేక సైలెంట్‌గా ఇస్తున్నారు, నువ్వు మా గుండె చప్పుడువయ్యా స్వామి!” అంటూ కామెంట్లు పెడుతున్నారు. కూలింగ్ ఛార్జ్ పేరుతో రోజూ లక్షల్లో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని, దీనిపై సీఎం విజయ్ కచ్చితంగా స్పందించి గట్టి యాక్షన్ తీసుకుంటారని సామాన్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ‘బీరు’ ఫిర్యాదుపై ప్రభుత్వం ఎలాంటి ‘కిక్’ ఇచ్చే నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Advertisement

Also Read: కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి.. పవిత్ర సంగమం వద్ద వైభవంగా పూజలు

Related News

జర్మనీలో షాకింగ్ కేసు కలకలం.. 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిన రోబో!

‘చెవి కొరికి తినేసి.. ఇప్పుడేమో ముందస్తు బెయిలా?’.. నిందితుడిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం!

రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. దసరాకి బోనస్..?

‘బ్లూ డ్రమ్’ కేసులో సంచలన తీర్పు.. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణ శిక్ష ఖరారు!

పొయ్యిలో 20కి పైగా పాములు.. ఏకంగా పిల్లలతో కాపురం పెట్టేసిందిగా? ధైర్యం ఉంటేనే చూడండి

ప్రేమకు అడ్డొచ్చిందని.. కంటికి రెప్పలా చూసిన నానమ్మనే హత్య చేసిన మనుమరాలు!

గోల్డ్ షాపు ఓపెనింగ్‌కు ముందే బిగ్ షాక్.. 12 నిమిషాల్లో రూ.8 కోట్ల బంగారం చోరీ..!

భారతీయ పైలట్‌పై దాడి.. విచారణ ముమ్మరం చేసిన ఎన్ఐఏ.. యూఏఈకి ప్రత్యేక బృందం!

Big Stories

Advertisement
×