E-Paper
Advertisement

Surat Diamond Bourse : ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల మార్కెట్..! సూరత్‌ డైమండ్‌ బోర్స్‌ను ప్రారంభించిన ప్రధాని..

Surat Diamond Bourse : ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల మార్కెట్..! సూరత్‌ డైమండ్‌ బోర్స్‌ను ప్రారంభించిన ప్రధాని..
Advertisement

Surat Diamond Bourse : దేశ వ్యాప్తంగా డైమండ్స్‌ బిజినెస్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న సూరత్‌.. ఇప్పుడు ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ సెంటర్‌గా మారబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్‌ ఆఫీస్‌ హబ్‌ సూరత్‌ డైమండ్‌ బోర్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సూరత్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సూరత్ డైమండ్ బోర్స్.. కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. దాదాపు రూ. 3400 కోట్లతో 35.54 ఎకరాల స్థలంలో నిర్మించిన సూరత్ డైమండ్ బోర్స్ పాలిష్ చేసిన వజ్రాల వ్యాపారానికి గ్లోబల్ హబ్‌గా మారనుంది.

36 ఎకరాల విస్తీర్ణంలో 45 అంతస్తుల్లో ఈ భవనాన్ని నిర్మించారు. ఒకేసారి 67వేల మంది ఈ బిల్డింగ్ లో కంఫర్ట్‌బుల్‌గా కార్యకలాపాలు చేసుకునేలా నిర్మాణం చేపట్టారు. 131 హైస్పీడ్‌ లిఫ్ట్‌లు ఈ బిల్డింగ్ లో ఉండడం మరో ప్రత్యేకతగా చెప్పుకోవాలి. అంతే కాకుండా ప్రపంచం లోనే అతిపెద్ద ఇంటర్‌ కనెక్టెడ్‌ భవనంగా కూడా ఇది రికార్డు సృష్టించింది. ఈ భవనంలో 175 దేశాల నుంచి 4వేల మందికి పైగా వ్యాపారులు తమ కార్యకలాపాలను నిర్వహించనున్నారు. ఎగుమతులు, దిగుమతులు, కస్టమ్స్‌ క్లియరెన్స్‌, రిటైల్‌ జువెలరీ, డైమండ్ రీసెర్చ్ సెంటర్‌… ఇలా ఎన్నో విభాగాలు ఇక్కడ ఉన్నాయి.

Advertisement

డైమండ్‌ బోర్స్‌ సెంటర్‌తో…. వజ్రాల పరిశ్రమకు మరింత ఊపు వస్తుందన్నారు ప్రధాని మోదీ. గత 80 ఏళ్లుగా ప్రపంచం లోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా ఉన్న అమెరికా పెంటగాన్‌ను.. సూరత్‌ డైమండ్‌ బోర్స్‌ అధిగమించిందన్నారు మోదీ. ప్రస్తుతం ఏటా 2లక్షల కోట్ల రూపాయల వజ్రాల వ్యాపారం జరుగుతుండగా.. ఇప్పుడది 4లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అలానే డైమండ్‌ బోర్స్‌ ద్వారా లక్షన్నర మందికి ఉపాధి లభించబోతోందని మోదీ వ్యాఖ్యానించారు.

Tags

Related News

మురికి నదిని ఒంటరిగా శుభ్రం చేసిన పేద యువకుడు.. కట్ చేస్తే అంతర్జాతీయ కంపెనీ జాబ్ ఆఫర్

నిందితుడ్ని వాహనానికి కట్టేసి.. 10 నిమిషాలపాటు లాఠీకి పని చెప్పిన పోలీసులు.. గుజరాత్‌లో ఘటనపై

కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు.. ఆరు రాష్ట్రాలకు ఏఐసీసీ కొత్త నేతలు, ఏపీకి పివి మోహన్‌

డేంజర్ బెల్స్.. నేపాల్ వరదల ఎఫెక్ట్‌కు బీహార్ అతలాకుతలం!

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

Big Stories

Advertisement
×