BigTV English

Top-up Loan: టాపప్‌ లోన్ తీసుకుంటున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి

Top-up Loan: టాపప్‌ లోన్ తీసుకుంటున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి

Top-up Loan: మీకు ఇప్పటికే ఇంటిలోన్, వెహికల్ లోన్ ఉందా? మీ వ్యక్తిగత, వ్యాపార అవసరాలకు మరింత లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే.. మీరు టాపప్ లోన్ తీసుకోవచ్చు. అయితే.. టాపప్ లోన్ తీసుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవి..


టాపప్ లోన్ అంటే..
ఇప్పటికే మీకు బ్యాంక్ లోన్ ఉండి, వాటి ఈఎంఐలు టైంకి కడుతూ.. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు టాపప్ లోన్ ఇస్తాయి. అంటే.. పాతలోన్ అసలుకు.. మీకు మంజూరైన మొత్తాన్ని కలుపుతారు. దీనివల్ల లోన్ అమౌంట్, చెల్లించే పీరియడ్ కూడా పెరుగుతాయి.

పాత లోన్ మొత్తం, క్రెడిట్ స్కోరు, ఆదాయం, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బట్టి బ్యాంకు టాపప్ లోన్ మొత్తాన్ని నిర్ణయిస్తుంది. టాపప్‌ లోన్ కోసం కొత్తగా అప్లై చేయాల్సిన పనిలేదు. స్పెషల్ ఫీజు కూడా లేదు. ఈ లోన్‌కు బ్యాంకు ఓకే అంటే దాన్ని ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు.


ఇంటి మరమ్మతు, పిల్లల చదువు, ఎక్కువ వడ్డీకి తెచ్చిన లోన్లు తిరిగి కట్టేందుకు టాపప్ లోన్ పనికొస్తుంది. అయితే.. నిజంగా అవసరం ఉంటేనే దీన్ని తీసుకోవాలి. టాపప్‌ లోన్ వల్ల ఎంత అదనంగా ఈఎంఐ కట్టాలో లెక్కించుకుంటే.. మన రీపేమెంట్ కెపాసిటీ మీద మరింత క్లారిటీ వస్తుంది.

పర్సనల్ లోన్ కంటే టాపప్ లోన్ మీద వడ్డీ తక్కువే అయినా.. రీపేమెంట్‌కు ఎక్కువ టైం పెట్టుకునే కొద్దీ వడ్డీభారం పెరుగుతుంది. కొన్నిసార్లు అసలు కంటే వడ్డీయే ఎక్కువకావచ్చు. మీకు 750 దాటిన క్రెడిట్ స్కోర్, మంచి రీపేమెంట్ చరిత్ర ఉంటే కొంత తక్కువ వడ్డీకే బ్యాంకు టాపప్ లోన్ ఇచ్చే ఛాన్స్ ఉంది.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×