E-Paper
Advertisement

Vladimir Putin: ఫుడ్ ల్యాబ్.. సూట్‌కేసులో మలం.. పుతిన్‌తో ఇవి ఉండాల్సిందే, ఆ పరీక్షల తర్వాతే తింటాడట!

Vladimir Putin: ఫుడ్ ల్యాబ్.. సూట్‌కేసులో మలం.. పుతిన్‌తో ఇవి ఉండాల్సిందే, ఆ పరీక్షల తర్వాతే తింటాడట!
Advertisement

Vladimir Putin’s Security: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ప్రపంచం అగ్ర రాజ్యాధినేతల్లో ఒకరు. రెండు రోజుల పర్యటన కోసం కాసేపటి క్రితం భారత్ లో అడుగు పెట్టారు. ప్రొటోకాల్ ను పక్కన పెట్టి ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. పాలెం ఎయిర్ పోర్టుకు వెళ్లి సాదర స్వాగతం పలికారు. ఇవాళ ప్రధాని మోడీ ఇచ్చే ప్రైవేట్ పార్టీలో పాల్గొననున్న ఆయన, రేపు పలు అధికారిక సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రక్షణ, వాణిజ్య రంగాలకు సంబంధించి కీలక ఒప్పందాలు జరగనున్నాయి.

పుతిన్ కు అసాధారణ భద్రతా ప్రొటోకాల్

ప్రెసిడెంట్ పుతిన్ ఏ దేశానికి వెళ్లినా.. ఆయనకు అసాధారణ భద్రత ఉంటుంది. మెరికల్లాంటి వ్యక్తిగత అంగరక్షకులతో పాటు, అసాధారణ రక్షణతో కూడిన కాన్వాయ్ ఉంటుంది. రష్యా భద్రతా విభాగం ఆయన రక్షణ కోసం ఎలా పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. పుతిన్ దగ్గర ఉండే సెక్యూరిటీ గార్డ్స్.. సూట్లు, సన్ గ్లాసెస్‌లో స్టైలిష్ గా కనిపిస్తారు. వారి కళ్ళు నిరంతరం చుట్టుపక్కల పరిసరాలను, వ్యక్తులను స్కాన్ చేస్తూనే ఉంటాయి. ఆయన పర్సనల్ సెక్యూరిటీ సిబ్బంది  సుమారు 5.9 అడుగుల నుంచి 6.3 అడుగుల ఎత్తు, 75 నుంచి 90 కేజీల బరువు ఉంటారు. వారి వయసు 35 సంవత్సరాల కంటే తక్కువ ఉంటుంది. ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా ప్రెసిడెంట్ ను సేఫ్ గా ఉంచడమే వీరి లక్ష్యం. ఎదురుగా ఉన్న ప్రమాదాన్ని కళ్లు మూసి తెరిచే లోగా న్యూట్రలైజ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ప్రెసిడెంట్ సెక్యూరిటీ వింగ్ లో పని చేసే గార్డ్స్ కు అసాధారణమైన మానసిక, శారీరక ఒత్తిడి ఉంటుంది. అందుకే, 35 సంవత్సరాలు నిండగానే వారికి రిటైర్మెంట్ అందిస్తారు.

Advertisement

నిర్దిష్ట సమయాల్లో ప్రెసిడెంట్ పుతిన్ కు రక్షణగా టెంపరరీ బుల్లెట్ ప్రూఫ్ గాజు తెరలు ఏర్పాటు చేస్తారు. భద్రత కోసం AK-47ల నుంచి పోర్టబుల్ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థల వరకు  ఆయుధాలు కలిగిన ప్రత్యేక ఆపరేషన్ సిబ్బందిని తీసుకెళ్లే సాయుధ వ్యాన్‌లు ఉంటాయి. ప్రెసిడెంట్ తన సెక్యూరిటీ టీమ్ ను పూర్తి నమ్ముతారు. వారు ఏది చేసినా తన భద్రతకే అని భావించి, వారి సూచనలకు అనుగుణంగా నడుచుకుంటారు. భద్రతా సిబ్బంది ఆయుధాలు తీయకుండానే ప్రెసిడెంట్ ను కాపాడుతారు. ఆయుధాలు తీస్తే తమ వైఫల్యంగా భావిస్తారు. ప్రమాదాన్ని ముందే గమనించి దాన్ని నిరోధిస్తారు.

ఫుడ్ ల్యాబ్‌.. పూప్ సూట్‌కేస్

పుతిన్ ప్రొటోకాల్ లో భాగంగా ఆయన వెంట ఫుడ్ ల్యాబ్, పూప్ సూట్ కేస్ ను తీసుకెళ్తారు. భద్రతా బృందం ఆయన ఆరోగ్య రహస్యాలు ఇతర దేశాలకు తెలియకుండా కీలక జాగ్రత్తలు చేపడుతాయి. ఆయన మలమూత్రాలను ఓ బ్రీప్ కేస్ లో స్టోర్ చేస్తారు. భారత పర్యటనలోనూ దీనిని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు, అధ్యక్షుడికి అందించే ఫుడ్, డ్రింక్స్ పరీక్షించేందుకు మొబైల్ ఫుడ్ లాబొరేటరీ ఉంటుంది. ఆయన ప్రయాణించే కారు అత్యాధునిక రక్షణ వ్యవస్థను కలిగి ఉంటుంది.  .

ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అల్ట్రా సీక్రెట్ సెక్యూరిటీ సిస్టమ్    

Advertisement

ఫుతిన్ తొలుత FSB డైరెక్టర్ గా పని చేశారు. ఆ తర్వాత ప్రధానమంత్రిగా ఎదిగారు. అనంతరం తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కొద్ది రోజుల తర్వాత ప్రెసిడెంట్ అయ్యారు. రష్యా ఉన్నత రక్షణ విభాగంలో పని చేసిన ఆయన తన భద్రతను శత్రు దుర్భేద్యంగా మార్చుకున్నారు. 2000 సంవత్సరం ప్రారంభం నుంచి భద్రతను మరింత మెరుగుపరుచున్నారు. విదేశీ సందర్శనల సమయంలో పుతిన్ కోసం రష్యా వాటర్ బాటిళ్లు, హైజీన్ కిట్లు, వైద్య నిపుణులను తీసుకెళ్తారు.

2018 నుంచి 2021 వరకు రష్యా అధ్యక్షుడి భద్రత మరింత పెరిగింది. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం తర్వాత పరిమిత విదేశీ ప్రయాణాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయనకు అల్ట్రా సెక్యూరిటీ కల్పిస్తున్నారు. ఇప్పటికే ఉన్న ప్రోటోకాల్, పర్యవేక్షణకు డబుల్ లేయర్లను అమలులోకి తెచ్చారు. పూప్ సూట్‌ కేస్, మొబైల్ ఫుడ్ లాబొరేటరీలు, కౌంటర్ బయోలాజికల్ సెక్యూరిటీ, బాడీ డబుల్స్‌ తో సహా  ప్రోటోకాల్స్ ను పూర్తిగా మార్చేశారు. అధ్యక్షుడు పుతిన్ భారత్ లో ఉన్నప్పుడు, అతని భద్రతా బృందాలు మెరుగౌన రక్షణను అందించడానికి భారతీయ భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నాయి.

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×