E-Paper
Advertisement

Independence Day : సెల్ఫీలు తీసుకోండి.. బహుమతులు కొట్టండి.. ఎంత ఇస్తారో తెలుసా..?

Independence Day : సెల్ఫీలు తీసుకోండి.. బహుమతులు కొట్టండి.. ఎంత ఇస్తారో తెలుసా..?
Advertisement

Independence Day : స్వతంత్ర దినోత్సవం వేళ కేంద్రం కొన్ని స్పెషల్ ఈవెంట్స్ నిర్వహించనుంది. సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేసి ప్రత్యేక పోటీలు నిర్వహించనుంది. విజేతలకు కానుకలు కూడా అందిస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి సెల్ఫీ పాయింట్లను దేశ రాజధాని ఢిల్లీలోని 12 ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఆ పాయింట్ల వద్ద సెల్పీ తీసుకోవాలి. ఆ ఫోటోలను MyGov పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఆగస్టు 15 -20 మధ్య ఈ పోటీలు జరుగుతాయి. ప్రజలు ఒకటి కంటే ఎక్కువ ఫోటోలను పంపే అవకాశం కల్పించారు. సెల్ఫీలు పంపిన వారి నుంచి 12 మందిని ఎంపిక చేస్తారు. ఒకొక్కరికి రూ.10 వేలు చొప్పున బహుమతి అందిస్తామని ఈ కాంపిటీషన్ వివరాలను రక్షణశాఖ తెలిపింది.

Advertisement

77వ స్వతంత్ర దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకలకు ఉత్తరాఖండ్‌లో ఓ మారుమూల గ్రామానికి చెందిన మహిళకు ఆహ్వానం పంపారని సమాచారం. ఆ మహిళ గతేడాదిలో మోదీకి యాపిల్‌ పచ్చడి పంపారు. ఈ అతిథుల్లో గ్రామ సర్పంచులు , పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం, పీఎం కౌశల్‌ వికాస్‌ యోజన పథకం లబ్దిదారులు కూడా ఉన్నారు. అలాగే ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యకారులు, ఖాదీ శ్రామికులను ఉత్సవాలకు ఆహ్వానించామని రక్ష మంత్రిత్వశాఖ వెల్లడించింది.

ఆగస్టు 15న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమానికి కేంద్రం 1,800 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించింది. మరో 17 వేల మందికి ఇన్విటేషన్లు పంపింది.

Tags

Related News

ఢిల్లీలో భారీ వర్షాలు.. కూలిన మూడంతస్తుల భవనం

మురికి నదిని ఒంటరిగా శుభ్రం చేసిన పేద యువకుడు.. కట్ చేస్తే అంతర్జాతీయ కంపెనీ జాబ్ ఆఫర్

నిందితుడ్ని వాహనానికి కట్టేసి.. 10 నిమిషాలపాటు లాఠీకి పని చెప్పిన పోలీసులు.. ఆ నేరానికి ఇది చాలా చిన్న శిక్ష!

కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు.. ఆరు రాష్ట్రాలకు ఏఐసీసీ కొత్త నేతలు, ఏపీకి పివి మోహన్‌

డేంజర్ బెల్స్.. నేపాల్ వరదల ఎఫెక్ట్‌కు బీహార్ అతలాకుతలం!

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

Big Stories

Advertisement
×