E-Paper
Advertisement

SonuSood : రైలులో డేంజర్ జర్నీపై విమర్శలు… అందుకే అలా చేశా: సోనూసూద్

SonuSood : రైలులో డేంజర్ జర్నీపై విమర్శలు… అందుకే అలా చేశా: సోనూసూద్
Advertisement

SonuSood : నటుడు సోనూసూద్ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. కరోనా కాలంలో పేదలకు సాయం అందించి ఎంతో పేరు సంపాదించారు. ఇప్పటికీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.పేదల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలన్నదే ఆయన ప్రయత్నం. ఈ క్రమంలో పేదల జీవితాలను అర్ధం చేసుకునేందుకు ఆయన చేసి ప్రయత్నం విమర్శలకు దారితీసింది. ఇటీవల ఆయన రైలులో ప్రయాణించిన తీరుపై విమర్శలు వచ్చాయి.

ఇటీవల సోనూసూద్ తన ట్విటర్ ఖాతాలో రైలు ప్రయాణం వీడియోను షేర్ చేశారు. అందులో ఫుట్‌బోర్డ్‌పై కూర్చొని బయటికి చూస్తూ కనిపించారు. అలా డేంజర్ జర్నీ చేయడాన్ని చాలా మంది తప్పుపట్టారు. సోనూసూద్ షేర్ చేసిన ఈ వీడియోపై నార్తన్‌ రైల్వే స్పందించింది. ఎంతోమంది సోనూసూద్ ను అభిమానిస్తున్నారని వారికి రోల్‌మోడల్‌గా నిలుస్తున్నారని పేర్కొంది. అలాంటి వ్యక్తి ఇలా రైలు ఫుట్ బోర్డు వద్ద కూర్చొని ప్రయాణించడం ప్రమాదకరమని పేర్కొంది. ఈ తరహా వీడియో అభిమానులకు తప్పుడు సందేశాన్ని పంపుతుందని తెలిపింది. ఇలాంటివి చేయవద్దుని నార్తన్ రైల్వే హెచ్చరించింది.

Advertisement

సోనూసూద్ డిసెంబర్ 13న షేర్ చేసిన ఈ వీడియోపై ముంబై రైల్వే పోలీసు కమిషనరేట్‌ కూడా స్పందించింది. సోనూసూద్ చర్యను తప్పుపట్టింది. నిజజీవితంలో ఇలాంటి స్టంట్‌లు చేయొద్దని సూచించింది. ఈ విమర్శలపై తాజాగా సోనూసూద్ క్షమాణలు తెలిపారు. ఆ ప్రయాణం ఎందుకో చేశానే వివరించారు. రైలు డోరువద్దే మగ్గిపోతున్న పేదల జీవితాలను అర్థం చేసుకునేందుకు తాను అక్కడ కూర్చుని ప్రయాణించానని వివరణ ఇచ్చారు. రైల్వే వ్యవస్థ పనితీరు మెరుగుపరిచినందుకు ధన్యవాదాదలని ట్వీట్ చేశారు.

మనదేశంలో పనులు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, ప్రయాణ ఛార్జీల కూడా డబ్బులు లేనివారు ఎంతోమంది ఉంటారు. అలాంటి వారు రైళ్లే చౌకైన ప్రయాణ సాధనం. తక్కువ ఖర్చుతో తమ గమ్యస్థానాలకు చేరుకుందుకు పేదలు రైళ్లలోనే ప్రయాణిస్తారు. అందుకే పేదలు, కూలీలు, కార్మికులతో రైళ్లలోని జనరల్ బోగీలు కిక్కిరిసిపోయి ఉంటాయి. సోనూసూద్ ఎలా కూర్చుని ప్రయాణించారో అలాగే నిత్యం లక్షల మంది ప్రయాణిస్తుంటారు. వాళ్ల కష్టాన్ని అర్థం చేసుకోవాలన్న తాపత్రయంతో సోనూసూద్ అలా జర్నీ చేశారు. విమర్శలు రావడంతో సోనూసూద్ తన హుందాతనాన్ని మరింత ప్రదర్శించి వివరణ ఇచ్చుకోవడంతోపాటు క్షమాపణలు కోరుకున్నారు. దటీజ్ సోనూసూద్.

Advertisement

Related News

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

Big Stories

Advertisement
×