BigTV English

RRR: ఆస్కార్ రేసులో ఎన్టీఆర్, రాజమౌళి.. చరిత్ర సృష్టిస్తారా?

RRR: ఆస్కార్ రేసులో ఎన్టీఆర్, రాజమౌళి.. చరిత్ర సృష్టిస్తారా?

Jr NTR: ఇండియాకి ఆస్కార్. గతంలో కలలా ఉండేది. రెహమాన్ లాంటి వాళ్లు ఆస్కార్ ను ఒడిసిపట్టి.. భారతీయ సత్తా చాటారు. ఈసారి తెలుగోళ్లు సైతం ఆస్కార్ బరిలో నిలిచే ఛాన్స్ ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఆ తెలుగోళ్లు ఇంకెవరో కాదు.. జూనియర్ ఎన్టీఆర్ అండ్ ఎస్ఎస్ రాజమౌళి.


ప్రపంచ వ్యాప్తంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హవా మామూలుగా లేదు. అనేక భాషల్లో, అనేక దేశాల్లో దూసుకుపోతోంది. రికార్డు కలెక్షన్లతో ప్రపంచ ప్రేక్షకులను కట్టి పడేస్తోంది. అదే జోష్ తో అకాడమీ, ఆస్కార్ అవార్డులు కొల్లగొట్టేందుకూ సిద్ధమవుతోంది.

ఈ ఏడాది ఆస్కార్‌ అవార్డుల వేదికపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సత్తా చాటే అవకాశం ఉందని ప్రముఖ హాలీవుడ్‌ మ్యాగజైన్‌ ‘వెరైటీ’ ఓ కథనం ప్రచురించింది. ఉత్తమ నటుడు కేటగిరిలో జూనియర్ ఎన్టీఆర్, ఉత్తమ దర్శకుడు కేటగిరీలో రాజమౌళి నామినేట్‌ అయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ విషయం తెలిసి ఇండియన్స్ ఫుల్ ఖుషీ.


‘వెరైటీ’ వెల్లడించిన ప్రాబబులిటీ జాబితాలో విల్‌ స్మిత్‌, హ్యూ జాక్‌మన్ లాంటి హాలీవుడ్‌ స్టార్స్‌ తో పాటు ఎన్టీఆర్‌ పేరు కూడా ఉంది. ‘వెరైటీ’ మ్యాగజైన్ అనే కాదు.. ఎన్టీఆర్‌కు ఆస్కార్‌ అవార్డ్ వచ్చే అవకాశం ఉందని గతంలోనూ ఈ పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఇలా హాలీవుడ్ వాళ్లే మన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాను.. ఎన్టీఆర్, రాజమౌళిలను ఆస్కార్ రేసులో నిలుపుతుండటం విశేషం.

మరోవైపు, ఈ ఏడాది అకాడమీ అవార్డుల్లో పోటీ పడేందుకు జనరల్ కేటగిరీలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ దరఖాస్తు చేసుకుంది. ఇప్పటికే ‘నాటునాటు’ సాంగ్ ఆస్కార్‌ ఉత్తమ ఒరిజనల్‌ సాంగ్‌ విభాగం షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. షార్ట్‌లిస్ట్‌లో ఎంపికైన చిత్రాలకు జనవరి 12 నుంచి 17 వరకూ అకాడమీ టీమ్ ఓటింగ్‌ నిర్వహించనుంది. ఆ ఓటింగ్‌ను ఆధారంగా జనవరి 24న ఆస్కార్ నామినేషన్‌లో నిలిచిన చిత్రాలను ప్రకటిస్తారు. మార్చి 12న విజేతలకు ఆస్కార్‌ అవార్డులు ప్రదానం చేస్తారు. మరి, ఈసారి మనోళ్లని ఆస్కార్ వరిస్తుందా? కొడాక్ థియేటర్లో తెలుగు పేర్లు ప్రతిధ్వనిస్తాయా?

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×