E-Paper
Advertisement

Southwest Monsoon: చల్లటి కబురు వచ్చిసిందోచ్.. కేరళంను తాకనున్న నైరుతి రుతుపవనాలు, ఆనందంలో రైతులు

Southwest Monsoon: చల్లటి కబురు వచ్చిసిందోచ్.. కేరళంను తాకనున్న నైరుతి రుతుపవనాలు, ఆనందంలో రైతులు
Advertisement

Southwest Monsoon: ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు చల్లని కబురు చెప్పింది భారత వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగా ఈసారి దేశంలోకి ప్రవేశించనున్నాయి. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ విషయంలో తెలియగానే రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

చల్లటి కబురు వచ్చిసిందోచ్.. ఆనందంలో రైతులు

Advertisement

నార్మల్‌గా జూన్ ఒకటిన కేరళను రుతుపవనాలు తాకుతాయి. ఈసారి ఐదు రోజులు ముందుగా వచ్చేస్తున్నాయి. మే 26న కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకే అవకాశం శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. వాతావరణ శాఖ అంచనా మేరకు చెప్పిన తేదీకి నాలుగు రోజులు అటూ ఇటూగా రుతుపవనాలు కేరళలో ఎంట్రీ ఇవ్వవచ్చని పేర్కొంది.

ఈ లెక్కన మే 22-30లో నైరుతి రుతుపవనాల రావచ్చు. ప్రస్తుతం అండమాన్ -నికోబార్ దీవులను రుతపవనాలు తాకాయి. రుతుపవనాల రాకతో ఉష్ణోగ్రతల నుంచి ప్రజలకు ఉపశమనం లభించనుంది. దేశంలో 50 శాతానికి పైగా సాగుభూమికి వర్షపాతం ప్రధాన ఆధారం. వ్యవసాయ ఉత్పత్తిలో సాగు భూమి నుంచి ఏకంగా 40 శాతం దిగుబడి రానుంది.

Advertisement

కేరళంను తాకనున్న నైరుతి రుతుపవనాలు

దేశ ఆహార భద్రత-ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతుపవనాలది కీలకపాత్ర. వాన కబురు తెలియగానే రైతులు ఆనందంగా ఫీలవుతారు. తొలకరికి సంబంధించి అన్ని పనులు మొదలుపెట్టనున్నారు. రెండు దశాబ్దాలుగా ఐఎండీ విడుదల చేసిన అంచనాలు మేరకు నైరుతి రుతుపవనాలు కచ్చితంగా వచ్చాయి. కేవలం ఒక్కసారి మాత్రమే అంచనా తప్పింది.

అది 2015లో మాత్రమే. ఆరేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. చెప్పిన తేదీకి ఒకటి రెండు రోజుల తేడా ఉండేది. తాజాగా వాతావరణ శాఖ అంచనాలు నిజమవుతాయని భావిస్తున్నారు అన్నదాతలు. హిందూ -పసిఫిక్ మహా సముద్రాలపై గాలుల సరళి, వాయువ్య భారతదేశంలో కనీస ఉష్ణోగ్రతలు, దక్షిణ చైనా సముద్రంపై రేడియేషన్ స్థాయితోపాటు ఆరు కీలక వాతావరణ సంకేతాలను విశ్లేషించే ఈ అంచనాలు రూపొందిస్తుంది వాతావరణ శాఖ.

ALSO READ: రాహుల్‌గాంధీ ఫారెన్ టూర్లు.. లెక్కల మాటేంటి, పలు ప్రశ్నలు సంధించిన కేంద్రమంత్రి

Related News

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

Big Stories

Advertisement
×